< కీర్తనల~ గ్రంథము 103 >
1 ౧ దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
ipsi David benedic anima mea Domino et omnia quae intra me sunt nomini sancto eius
2 ౨ నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.
benedic anima mea Domino et noli oblivisci omnes retributiones eius
3 ౩ ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.
qui propitiatur omnibus iniquitatibus tuis qui sanat omnes infirmitates tuas
4 ౪ నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.
qui redimit de interitu vitam tuam qui coronat te in misericordia et miserationibus
5 ౫ నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
qui replet in bonis desiderium tuum renovabitur ut aquilae iuventus tua
6 ౬ యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.
faciens misericordias Dominus et iudicium omnibus iniuriam patientibus
7 ౭ ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.
notas fecit vias suas Mosi filiis Israhel voluntates suas
8 ౮ యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
miserator et misericors Dominus longanimis et multum misericors
9 ౯ ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.
non in perpetuum irascetur neque in aeternum comminabitur
10 ౧౦ మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
non secundum peccata nostra fecit nobis nec secundum iniustitias nostras retribuit nobis
11 ౧౧ భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
quoniam secundum altitudinem caeli a terra corroboravit misericordiam suam super timentes se
12 ౧౨ పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
quantum distat ortus ab occidente longe fecit a nobis iniquitates nostras
13 ౧౩ తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
quomodo miseretur pater filiorum misertus est Dominus timentibus se
14 ౧౪ మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
quoniam ipse cognovit figmentum nostrum recordatus est quoniam pulvis sumus
15 ౧౫ మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.
homo sicut faenum dies eius tamquam flos agri sic efflorebit
16 ౧౬ దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
quoniam spiritus pertransivit in illo et non subsistet et non cognoscet amplius locum suum
17 ౧౭ యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.
misericordia autem Domini ab aeterno et usque in aeternum super timentes eum et iustitia illius in filios filiorum
18 ౧౮ వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.
his qui servant testamentum eius et memores sunt mandatorum ipsius ad faciendum ea
19 ౧౯ యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.
Dominus in caelo paravit sedem suam et regnum ipsius omnibus dominabitur
20 ౨౦ యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.
benedicite Domino angeli eius potentes virtute facientes verbum illius ad audiendam vocem sermonum eius
21 ౨౧ యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.
benedicite Domino omnes virtutes eius ministri eius qui facitis voluntatem eius
22 ౨౨ యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
benedicite Domino omnia opera eius in omni loco dominationis ipsius benedic anima mea Domino