< కీర్తనల~ గ్రంథము 102 >

1 బాధితుడి ప్రార్థన, దుఃఖంలో సోలిపోయి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.
نوێژی هەژارێکی ورەڕووخاو، کە هاواری دەباتە بەردەم یەزدان. ئەی یەزدان، گوێ لە نوێژم بگرە، با هاوارم بگاتە لات.
2 నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
لە ڕۆژی تەنگانەدا ڕووی خۆتم لێ مەشارەوە، لەو ڕۆژەی کە هاوارت بۆ دەکەم گوێم بۆ شل بکە، زوو وەڵامم بدەوە.
3 పొగ లాగా నా రోజులు గతించిపోతున్నాయి. నా ఎముకలు కాలిపోతున్నట్టు ఉన్నాయి.
ڕۆژگارم وەک دووکەڵ ڕەوییەوە، ئێسکم وەک پشکۆ گڕی گرتووە.
4 నా గుండె కుంగిపోయింది. నేను వాడిన గడ్డి పరకలాగా ఉన్నాను. నేనేమీ తినలేక పోతున్నాను.
هەڵپڕووکاوە، دڵم وشک بووەتەوە، نانخواردنم لەبیر نەماوە.
5 నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను.
لە دەنگی ناڵەم ئێسکم بە پێستمەوە نووساوە.
6 నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి.
وەک کوندەپەپووی بیابانی چۆڵەوانیم لێهاتووە، وەک کوندەپەپووی کەلاوەم لێهاتووە.
7 ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.
ڕادەکشێم و وەک چۆلەکەیەکی تەنهای سەربانم لێهاتووە.
8 రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.
بە درێژایی ڕۆژ دوژمنەکانم سووکایەتیم پێ دەکەن، ئەوانەی لە دژی منن وەک شێتیان لێ هاتووە، نەفرەتم لێدەکەن.
9 బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను.
بۆیە خۆڵەمێش دەخۆم وەک نان، فرمێسکم تێکەڵ بە خواردنەوەم بووە،
10 ౧౦ నీ కోపాగ్నిని బట్టి నువ్వు నన్ను పైకెత్తి అవతల పారేశావు.
لەبەر تووڕەیی زۆری تۆ، چونکە هەڵتگرتم و فڕێتدام.
11 ౧౧ నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను.
ڕۆژگارم وەک سێبەری خوارە، خۆشم وەک گیا وشک دەبمەوە.
12 ౧౨ అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.
تۆش ئەی یەزدان، هەتاهەتایە لەسەر تەختی، نەوە دوای نەوە یادت دەکەنەوە.
13 ౧౩ నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.
تۆ هەڵدەستیت و بەزەییت بە سییۆن دێتەوە، چونکە ماوەی میهرەبانییە، کاتی هاتووە.
14 ౧౪ దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం.
خزمەتکارەکانت بە تاسەوەن بۆ بەردەکانی، دڵیان دەسووتێ بۆ خۆڵەکەی.
15 ౧౫ యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు.
هەموو نەتەوەکان لە ناوی یەزدان دەترسن، هەموو پاشاکانی زەویش لە شکۆمەندیت،
16 ౧౬ యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.
چونکە کە یەزدان سییۆن بنیاد دەنێتەوە، بە شکۆمەندی خۆی دەبینرێت.
17 ౧౭ అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
ئاوڕ لە نوێژی ڕووتوڕەجاڵەکان دەداتەوە، نوێژەکانیان بە کەم نازانێت.
18 ౧౮ రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
ئەمە بۆ نەوەی داهاتوو دەنووسرێت، تاکو ئەو نەوەیە ستایشی یەزدان بکەن، کە هێشتا لەدایک نەبوونە:
19 ౧౯ బందీల మూలుగులు వినడానికీ చావు ఖరారైన వాళ్ళను విడిపించడానికీ,
«یەزدان لە بەرزایی پیرۆزگای خۆیەوە دەڕوانێتە خوارێ، لە ئاسمانەوە سەیری زەوی دەکات،
20 ౨౦ యెహోవా ఉన్నతమైన పవిత్ర స్థలం నుంచి కిందికి చూశాడు, పరలోకం నుంచి భూమిని చూశాడు.
بۆ ئەوەی گوێی لە ناڵەی دیلەکان بێت، ئەوانە ئازاد بکات کە دراونەتە دەست مردن.»
21 ౨౧ యెహోవాను సేవించడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడినప్పుడు,
جا لە سییۆن ناوی یەزدان ڕادەگەیەنرێت، لە ئۆرشەلیم ستایشی،
22 ౨౨ మనుషులు యెహోవా నామాన్ని సీయోనులో ప్రకటిస్తారు. యెరూషలేములో ఆయన కీర్తిని ప్రకటిస్తారు.
کاتێک گەلان و پاشایەتییەکان پێکەوە بۆ پەرستنی یەزدان کۆدەبنەوە.
23 ౨౩ ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.
لە ناوەڕاستی تەمەنم هێزی کزکردم، ڕۆژگاری کورتکردم.
24 ౨౪ నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
گوتی: «ئەی خودای من، لە ناوەڕاستی ڕۆژگارم لام مەدە، ساڵانی تۆ بۆ نەوە دوای نەوەیە.
25 ౨౫ పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
لە سەرەتاوە بناغەی زەویت دانا، ئاسمانیش دەستکردی تۆیە.
26 ౨౬ అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.
ئەوان لەناودەچن، بەڵام تۆ دەمێنیت، هەموو وەک کراس کۆن دەبن، وەک جلوبەرگ دەیانگۆڕیت و فڕێدەدرێن.
27 ౨౭ అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.
بەڵام تۆ هەروەک خۆتی، ساڵانی تۆ کۆتایی نایەت.
28 ౨౮ నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.
کوڕی خزمەتکارەکانت نیشتەجێ دەبن و نەوەکانیان لەبەردەمت دەچەسپێن.»

< కీర్తనల~ గ్రంథము 102 >