< కీర్తనల~ గ్రంథము 102 >
1 ౧ బాధితుడి ప్రార్థన, దుఃఖంలో సోలిపోయి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.
Bir məzlumun duası. Taqətdən düşüb Rəbbin hüzurunda şikayətlənəndə. Ya Rəbb, bu duama qulaq as, Qoy fəryadım Sənə çatsın.
2 ౨ నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
Nə olar, dar günümdə üzünü məndən gizlətmə, Qulaq as, Səni çağırarkən mənə tez cavab ver.
3 ౩ పొగ లాగా నా రోజులు గతించిపోతున్నాయి. నా ఎముకలు కాలిపోతున్నట్టు ఉన్నాయి.
Günlərim tüstü kimi çəkilir, Sümüklərim elə bil yanıb közə dönür.
4 ౪ నా గుండె కుంగిపోయింది. నేను వాడిన గడ్డి పరకలాగా ఉన్నాను. నేనేమీ తినలేక పోతున్నాను.
Ürəyim kəsilib atılan ot kimi saralıb-solur, Çörək yemək belə, yadımdan çıxır.
5 ౫ నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను.
Ah-zar çəkməkdən Bir dəri, bir sümük qalmışam.
6 ౬ నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి.
İndi çöldəki yapalağa bənzəyirəm, Viranəlik bayquşu kimiyəm.
7 ౭ ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.
Gözümə yuxu getmir, Damda tənha qalan bir quşa bənzəyirəm.
8 ౮ రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.
Bütün gün düşmənlərim məni təhqir edir, Mənə istehza edənlər adımla lənət oxuyur.
9 ౯ బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను.
Yeməyim çörək yerinə kül olub, İçməyim göz yaşıma qarışıb.
10 ౧౦ నీ కోపాగ్నిని బట్టి నువ్వు నన్ను పైకెత్తి అవతల పారేశావు.
Çünki qəzəbindən, hiddətindən Məni götürüb bir tərəfə atmısan.
11 ౧౧ నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను.
Günlərim axşamın kölgəsi kimi keçir, Bir ot kimi quruyuram.
12 ౧౨ అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.
Lakin Sən, ya Rəbb, əbədi taxtında əyləşmisən, Sənin şöhrətin nəsildən-nəslə deyiləcək.
13 ౧౩ నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.
Sən qalxıb Siona mərhəmət edəcəksən, Zamanını təyin etdin, indi ona lütf ediləcək.
14 ౧౪ దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం.
Çünki Sənin qulların onun daşlarını əziz tuturlar, Onun toz-torpağına necə də acıyırlar.
15 ౧౫ యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు.
Millətlər Rəbbin ismindən, Dünyanın bütün padşahları Onun əzəmətindən qorxacaqlar.
16 ౧౬ యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.
Rəbb Sionu yenidən bərpa edəcək, Əzəmətində görünəcək,
17 ౧౭ అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
Yoxsulların duasına qulaq asacaq, Yalvarışlarına xor baxmayacaq.
18 ౧౮ రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
Sonrakı övladları Rəbbə həmd etsin deyə Qoy gələcək nəsil üçün belə yazılsın:
19 ౧౯ బందీల మూలుగులు వినడానికీ చావు ఖరారైన వాళ్ళను విడిపించడానికీ,
«Rəbb müqəddəs yüksəklikdən, Göylərdən yer üzünə nəzər saldı;
20 ౨౦ యెహోవా ఉన్నతమైన పవిత్ర స్థలం నుంచి కిందికి చూశాడు, పరలోకం నుంచి భూమిని చూశాడు.
Əsirlərin naləsini eşitmək üçün, Ölümə aparılanları azad etmək üçün».
21 ౨౧ యెహోవాను సేవించడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడినప్పుడు,
Ona görə Rəbbin ismini Sionda elan edəcəklər, Yerusəlimdə Ona həmdlər söyləyəcəklər
22 ౨౨ మనుషులు యెహోవా నామాన్ని సీయోనులో ప్రకటిస్తారు. యెరూషలేములో ఆయన కీర్తిని ప్రకటిస్తారు.
Rəbbə xidmət etmək üçün gələrkən, Xalqlar, ölkələr bir yerə gələrkən.
23 ౨౩ ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.
Yolda ikən Rəbb gücümü azaltdı, O, ömrümü qısaltdı.
24 ౨౪ నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
Dedim: «Ey Allahım, canımı alma, ömrümün yarısıdır, Sənin illərin nəsillərdən-nəsillərə çatır».
25 ౨౫ పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
Yerin təməlini əzəldən qurmusan, Göylər Sənin əllərinin işidir!
26 ౨౬ అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.
Onlar yox olacaq, amma Sən qalacaqsan, Hamısı paltar kimi köhnələcək, Onları geyim kimi dəyişdirəcəksən, Keçib-gedəcəklər.
27 ౨౭ అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.
Amma Sən dəyişməzsən, İllərin tükənməzdir.
28 ౨౮ నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.
Qullarının övladları yaşayacaq, Nəvə-nəticələri hüzurunda dayanacaq.