< సామెతలు 9 >
1 ౧ జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది.
Khôn ngoan xây cất nhà mình; chạm bảy cột trụ.
2 ౨ పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది.
Giết chiên bò, pha rượu nho, chuẩn bị dọn tiệc lớn.
3 ౩ తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది.
Khôn ngoan sai tớ gái mời mọi người đến dự. Từ các nơi cao của thành, sự khôn ngoan kêu gọi.
4 ౪ “జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది.
“Hãy đến cùng ta,” khôn ngoan mời người đơn sơ. Và nhắn với người ngu muội rằng:
5 ౫ తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి.
“Cứ đến ăn bánh, và uống rượu ta pha.
6 ౬ ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.”
Bỏ đường lối dại khờ, thì con sẽ được sống; và bước đi trên đường thông sáng.”
7 ౭ ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది.
Ai quở người chế nhạo sẽ bị nhục nhã. Ai trách người độc ác sẽ mang nhuốc nhơ.
8 ౮ ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.
Đừng quở người chế nhạo; vì họ sẽ ghét con. Nhưng khiển trách người khôn ngoan, thì con sẽ được yêu kính.
9 ౯ జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు.
Hướng dẫn người khôn, họ sẽ thêm khôn. Dạy bảo người ngay, họ sẽ thêm hiểu biết.
10 ౧౦ జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే.
Kính sợ Chúa Hằng Hữu là khởi đầu sự khôn ngoan. Hiểu biết Đấng Thánh, ấy cội nguồn tri thức.
11 ౧౧ నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.
Nhờ sự khôn ngoan, ngày con thêm nhiều và tuổi đời con gia tăng.
12 ౧౨ నువ్వు జ్ఞానం గలవాడివైతే నీ జ్ఞానం నీకే ఉపయోగపడుతుంది. నువ్వు అపహాసకుడివైతే దానివల్ల కలిగే ఫలితాలు నువ్వే భరించాలి.
Nếu khôn ngoan, chính con được nhờ. Còn chế nhạo, riêng con gánh chịu.
13 ౧౩ బుద్ధిహీనత అనే స్త్రీ గావుకేకలు పెట్టేది. ఆమె తెలివితక్కువది, చదువు లేనిది.
Đàn bà điên dại ăn nói sỗ sàng. Thiếu suy nghĩ và không hiểu biết.
14 ౧౪ ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చుంటుంది. పట్టణ ప్రముఖ వీధుల్లో కుర్చీ వేసుకుని కూర్చుంటుంది.
Nó ngồi trước cửa nhà, tại nơi góc đường đô thị.
15 ౧౫ ఆ దారిలో వెళ్ళేవాళ్ళను, తమ దారిన తాము తిన్నగా వెళ్ళేవారిని చూసి,
Kêu gọi khách bộ hành, đang bận rộn qua lại.
16 ౧౬ “జ్ఞానం లేనివాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి” అని వాళ్ళను పిలుస్తుంది.
“Hãy đến với tôi,” nó mời người đơn sơ. Và bảo người thiếu suy xét:
17 ౧౭ తెలివి లేని ఒకడు వచ్చినప్పుడు వాణ్ణి చూసి “దొంగిలించిన నీళ్లు తియ్యగా ఉంటాయి. దొంగచాటుగా తిన్న తిండి రుచిగా ఉంటుంది” అని చెబుతుంది.
“Nước uống trộm thật ngọt ngào, bánh ăn vụng thật ngon thay!”
18 ౧౮ అయితే చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారనీ, ఆమె ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళంతా నరక కూపంలో పడిపోతారనీ వాళ్ళు తెలుసుకోలేరు. (Sheol )
Người ấy chẳng biết nhà nó là mồ chôn người chết. Và khách nó mời đều ở nơi vực thẳm âm ty. (Sheol )