< సామెతలు 8 >
1 ౧ జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది.
¿No clama la sabiduría, Y el entendimiento hace oír su voz?
2 ౨ రహదారుల్లో, ప్రధాన వీధుల్లో, పట్టణ దారులు కలిసే కూడలిలో అది నిలబడి ఉంది.
En las cimas de las alturas junto al camino, En las encrucijadas de los senderos, allí está ella.
3 ౩ నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది.
Junto a las puertas, en la entrada de la ciudad, En el acceso a las puertas, ella da voces:
4 ౪ “మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను.
¡Oh hombres, a ustedes clamo! Mi voz se dirige a los hijos de los hombres.
5 ౫ జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి.
Oh simples, aprendan prudencia. Y ustedes, insensatos, dispongan su corazón.
6 ౬ వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.
Escuchen, porque diré cosas excelentes, Y abriré mis labios para cosas rectas.
7 ౭ నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.
Mi boca pronunciará verdad. La maldad es repugnancia para mis labios.
8 ౮ న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు.
Todas las palabras de mi boca son con justicia. En ellas nada hay torcido o perverso.
9 ౯ నా మాటలన్నీ వివేకం గలవాడికి తేటగా అర్థం అవుతాయి. తెలివి గలవాడు న్యాయం గ్రహిస్తాడు.
Son claras para el que entiende Y rectas para los que hallan el conocimiento.
10 ౧౦ వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి.
Reciban mi enseñanza y no plata, Conocimiento, mejor que oro fino.
11 ౧౧ విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు.
Pues mejor es la sabiduría que las perlas. Nada de lo que desees podrá compararse con ella.
12 ౧౨ నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను.
Yo, la sabiduría, moro con la prudencia, Y descubro el conocimiento y la discreción.
13 ౧౩ దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
El temor a Yavé es aborrecer el mal. Aborrezco la soberbia, la arrogancia, el mal camino y la boca perversa.
14 ౧౪ అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే.
Mío es el consejo y la eficiente sabiduría. Mía es la inteligencia y mía la valentía.
15 ౧౫ నా మూలంగా రాజులు పరిపాలిస్తారు. అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు.
Por mí reinan los reyes, Y los magistrados administran justicia.
16 ౧౬ నా మూలంగా ఘనత వహించిన న్యాయాధిపతులంతా న్యాయం జరిగిస్తారు. లోకంలోని అధికారులు పాలన సాగిస్తారు.
Por mí gobiernan los príncipes Y los nobles que juzgan la tierra.
17 ౧౭ నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.
Yo amo a los que me aman. Me hallan los que temprano me buscan.
18 ౧౮ ఐశ్వర్యం, ప్రతిష్ఠ, నీతి న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి.
Las riquezas y la honra están conmigo, Riquezas y justicia perdurables.
19 ౧౯ నా వల్ల కలిగే ఫలం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది.
Mi fruto es mejor que el oro, Aun que el oro puro, Y mi ganancia mejor que la plata escogida.
20 ౨౦ నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి.
Yo ando por camino de justicia, Por los senderos de equidad,
21 ౨౧ నన్ను ప్రేమించే వాళ్ళను నేను సంపన్నులుగా చేస్తాను. వారికి ధన సమృద్ధి కలిగిస్తాను.
Para hacer que los que me aman obtengan su heredad. Y para que yo llene sus tesoros.
22 ౨౨ గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు.
Yavé me poseía en el principio, Ya de antiguo, antes de sus obras.
23 ౨౩ అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు.
Eternamente estaba establecida, Antes de haber tierra.
24 ౨౪ ప్రవాహించే నదులు లేనప్పుడు, నీటి ఊటలు ఇంకా పుట్టనప్పుడు నేను రూపుదిద్దుకున్నాను.
Nací antes que existieran los océanos, Antes que existieran las fuentes de muchas aguas.
25 ౨౫ పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను.
Antes que las montañas fueran fundadas, Antes de las colinas, fui yo engendrada.
26 ౨౬ ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను.
Cuando Él no había hecho la tierra, ni los campos, Ni el primer polvo del mundo.
27 ౨౭ ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను.
Cuando estableció los cielos, allí estaba yo. Cuando trazó el horizonte sobre la superficie del océano,
28 ౨౮ ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను.
Cuando afirmó los cielos arriba, Cuando afirmó las fuentes del océano,
29 ౨౯ భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను.
Cuando señaló al mar su estatuto, Para que las aguas no traspasaran su mandato, Cuando estableció los fundamentos de la tierra,
30 ౩౦ నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను.
Yo estaba junto a Él como arquitecto. Diariamente era su deleite. Me regocijaba ante Él siempre.
31 ౩౧ ఆయన సృష్టించిన లోకాన్నిబట్టి, భూమిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. భూమిపై ఉన్న మానవ జాతిని చూసి ఆనందిస్తున్నాను.
Me regocijaba en su tierra habitada, Y tenía mi deleite con los hijos de los hombres.
32 ౩౨ కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు.
Ahora pues, hijos, escúchenme. Inmensamente felices los que guardan mis caminos.
33 ౩౩ నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి.
Atiendan la instrucción, sean sabios Y no la menosprecien.
34 ౩౪ నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు.
¡Inmensamente feliz es el hombre que me escucha, Que vigila en mis portones cada día, Que espera en el umbral de mis entradas!
35 ౩౫ నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది.
Porque el que me halla, Halla la vida y alcanza el favor de Yavé.
36 ౩౬ నన్ను తృణీకరించేవాడు తనకు తానే హాని కలిగించుకుంటాడు. నన్ను అసహ్యించుకొనే వాళ్ళు మరణానికి స్నేహితులౌతారు.”
Pero el que peca contra mí, defrauda su propia alma. Todos los que me aborrecen aman la muerte.