< సామెతలు 7 >
1 ౧ కుమారా, నా మాటలు నీ మనసులో ఉంచుకో. నా ఆజ్ఞలు నీ దగ్గర పదిలంగా దాచుకో.
Ndodana yami, agcine amazwi ami ulondoloze imilayo yami ngaphakathi kwakho.
2 ౨ నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుని నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకుంటే నీకు జీవం కలుగుతుంది.
Gcina imilayo yami ukuze uphile; ulinde imfundiso yami njengegugu lakho elikhulu.
3 ౩ నీ చేతి వేళ్లకు వాటిని కట్టుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసి ఉంచుకో.
Ibophele eminweni yakho; uyilobe enhliziyweni yakho.
4 ౪ జ్ఞానంతో “నీవు నా సోదరివి” అని చెప్పు. వివేకాన్ని నీ బంధువుగా భావించు.
Tshela ukuhlakanipha uthi, “Ungudadewethu wena,” uthi ukuqedisisa kuyisihlobo sakho;
5 ౫ అలా చేస్తే నువ్వు వ్యభిచారి దగ్గరికి వెళ్ళకుండా, సరసాలాడే స్త్రీ వలలో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు.
lezizinto zizakuvikela emfazini oyisifebe, lakumkakho ongelambeko ngamazwi akhe adukisayo.
6 ౬ నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను.
Ngema ewindini lendlu yami ngalunguza ngesikhala.
7 ౭ జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు.
Ngabona phakathi kwabayizithutha, ngananzelela phakathi kwamajaha ngabona ijaha elingelangqondo.
8 ౮ సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు.
Lalisehla ngomgwaqo liseduze lejiko, liqonda endlini yowesifazane
9 ౯ ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు.
ntambama sekunqunda amehlo, umnyama wobusuku usujiya.
10 ౧౦ అప్పుడు వేశ్య వేషం ధరించిన ఒక కుటిల బుద్ధిగల స్త్రీ అతనికి ఎదురు వచ్చింది.
Khonokho nje kwaqhamuka owesifazane elihlangabeza egqoke okwesifebe ngoba eqophile.
11 ౧౧ ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.
(Umfazi lowo, ngumuntu womsindo uyisiqholo, inyawo zakhe kazihlali phansi;
12 ౧౨ ఆమె ఒక్కోసారి తన ఇంటి ఎదుట, ఒక్కోసారి పట్టణ వీధుల్లో ఉంటుంది. ప్రతి సందులోనూ ఆమె కాపు కాసి ఉంటుంది.
khathesi nangu emgwaqweni, njalo nangu enkundleni, utshobatshoba izindawana zonke.)
13 ౧౩ ఆమె ఆ యువకుణ్ణి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. సిగ్గు, బిడియం లేని ముఖంతో అతనితో ఇలా చెప్పింది,
Wafika waligona lelijaha walanga wakhuluma engelanhloni wathi:
14 ౧౪ “నేను శాంతి బలులు చెల్లించవలసి ఉంది. ఇప్పుడే నా మొక్కుబడులు చెల్లించాను.
“Ngenzile umnikelo wobudlelwano ngekhaya; lamuhla ngizigcwalisile izifungo zami.
15 ౧౫ నిన్ను కలుసుకోవాలని, నీకు ఎదురు రావాలని బయలుదేరాను. నువ్వే నాకు కనబడ్డావు.
Yikho ngilapha ukukuhlangabeza; sengikudinge ngaze ngakuthola!
16 ౧౬ నా మంచంపై రత్న కంబళ్ళు పరిచాను. ఐగుప్తు నుండి తెప్పించిన నైపుణ్యంగా అల్లిన నార దుప్పట్లు వేశాను.
Sengiwendlele umbheda wami ngamalineni eGibhithe awemibalabala.
17 ౧౭ నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను.
Sengiwuqholile umbheda wami ngemure, ngenhlaba langesinamoni.
18 ౧౮ బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం.
Woza sizitike ngothando kuze kuse; kasizijabulise ngothando!
19 ౧౯ నా భర్త ఇంట్లో లేడు. ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు.
Indoda yami kayikho ekhaya; ihambile iye khatshana.
20 ౨౦ అతడు డబ్బు సంచి తనతో తీసుకు వెళ్ళాడు. పున్నమి రోజు వరకూ ఇంటికి తిరిగి రాడు.”
Ithwele isikhwama sayo sigcwele imali, ngakho kayibuyi kuze kube phakathi kwenyanga.”
21 ౨౧ ఆ విధంగా ఆమె తన మృదువైన మాటలు పదే పదే చెబుతూ, లాలిస్తూ అతణ్ణి లోబరచుకుంది. పొగడ్తలతో ముంచెత్తుతూ అతణ్ణి ఈడ్చుకు పోయింది.
Ngamazwi akhe amnandi waledukisa ijaha lelo; walihuga ijaha lelo ngolimi olumnandi.
22 ౨౨ వెంటనే అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధకై వెళ్లినట్టు, పరాయివాళ్ళ చేతికి చిక్కి చెరసాల పాలైనట్టు అతడు వెళ్ళాడు.
Khonokho nje lahle lamlandela njengenkabi idonselwa ukuyabulawa, njengomziki uzingenisa emjibileni,
23 ౨౩ పక్షి తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలియక ఉచ్చులో పడినట్టు, అతని గుండెను చీల్చే బాణం దూసుకుపోయేంత వరకూ అతడు ఆమె వెంటబడి వెళ్ళాడు.
umtshoko uze uyehlaba isibindi, njengenyoni ithothela ngaphansi kwesifu, ingaboni ukuthi isizingenise ekufeni.
24 ౨౪ నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి.
Ngakho-ke madodana ami, ngilalelani; zwanini lokhu engikutshoyo.
25 ౨౫ నీ మనస్సు వ్యభిచారి నడిచే మార్గాల వైపు మళ్ళనియ్యకు. దారి తప్పి ఆమె నడిచే దారిలోకి పోకు.
Lingayivumeli inhliziyo ikhangwe yizindlela zakhe, langabe iphumputhekele emikhubeni yakhe.
26 ౨౬ ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది. లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు.
Banengi labo asebadilizile; izinkubela zakhe zilucaca olwesabekayo.
27 ౨౭ ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది. (Sheol )
Indlu yakhe ingumgudu oya engcwabeni, iholela phansi ezindongeni zokufa. (Sheol )