< సామెతలు 5 >
1 ౧ కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు.
Fiul meu, dă atenție la înțelepciunea mea și apleacă-ți urechea la înțelegerea mea,
2 ౨ అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది.
Ca să iei aminte la discernere și ca buzele tale să păzească cunoașterea.
3 ౩ వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.
Fiindcă buzele femeii străine picură ca fagurele și gura ei este mai alunecoasă decât untdelemnul;
4 ౪ చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.
Dar sfârșitul ei este amar ca pelinul, ascuțit ca o sabie cu două tăișuri.
5 ౫ దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది. (Sheol )
Picioarele ei merg jos la moarte, pașii ei apucă spre iad. (Sheol )
6 ౬ జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.
Ca nu cumva să cumpănești cărarea vieții, căile ei sunt schimbătoare, ca să nu le poți cunoaște.
7 ౭ కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.
De aceea ascultați-mă acum copiilor și nu vă depărtați de cuvintele gurii mele!
8 ౮ వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.
Mută-ți calea departe de ea și nu te apropia de ușa casei ei,
9 ౯ నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.
Ca nu cumva să dai onoarea ta altora și anii tăi celui crud,
10 ౧౦ అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.
Ca nu cumva să fie îndestulați străinii cu bogăția ta și ostenelile tale să fie în casa unui străin,
11 ౧౧ చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.
Și la urmă să jelești, când carnea ta și trupul tău sunt mistuite,
12 ౧౨ అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను?
Și să spui: Cum de am urât instruirea și inima mea a disprețuit mustrarea;
13 ౧౩ నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు.
Și nu am ascultat de vocea învățătorilor mei, nici nu mi-am aplecat urechea la cei ce m-au instruit!
14 ౧౪ సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు.
Am fost aproape în fiecare rău în mijlocul mulțimii și al adunării.
15 ౧౫ నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.
Bea apă din propriul tău izvor și ape curgătoare din propria ta fântână.
16 ౧౬ నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?
Izvoarele tale să se reverse departe și râuri de ape să fie pe străzi.
17 ౧౭ పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.
Să fie numai ale tale și nu ale străinilor care sunt cu tine.
18 ౧౮ నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.
Fântâna ta să fie binecuvântată; și bucură-te cu soția tinereții tale.
19 ౧౯ ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.
Ca cerboaica drăgăstoasă să fie ea și o căprioară plăcută; să te sature tot timpul sânii ei; și fii întotdeauna îmbătat de dragostea ei.
20 ౨౦ కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?
Și de ce ai dori tu, fiul meu, să fii îmbătat de o femeie străină și să îmbrățișezi sânul unei străine?
21 ౨౧ మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.
Căci căile omului sunt înaintea ochilor DOMNULUI și el cumpănește toate cărările lui.
22 ౨౨ దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు.
Propriile lui nelegiuiri îl vor prinde pe cel stricat și va fi ținut cu funiile păcatelor sale.
23 ౨౩ అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.
El va muri fără instruire și în măreția nechibzuinței sale se va rătăci.