< సామెతలు 4 >

1 కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి.
Me mma, muntie me, muntie agya nkyerɛkyerɛ; monyɛ aso na moanya ntease.
2 నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.
Mema mo adesua a ɛkɔ anim, enti munnnyaa me nkyerɛkyerɛ mu.
3 నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి.
Efisɛ na me nso, meyɛ mʼagya babarima, meda so yɛ akokoaa no, na me na ani gye me ho.
4 ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు “నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు.
Na ɔkyerɛkyerɛɛ me se, “Ma me nsɛm nni wo koma mu dɛm, di me nkyerɛkyerɛ so na wubenya nkwa.
5 జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
Nya nyansa, nya ntease; mma wo werɛ mfi me nsɛm anaa ntwe wo ho mfi ho.
6 జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.
Nnyaw nyansa hɔ, na ɛbɛbɔ wo ho ban; dɔ no, na ɛbɛhwɛ wo so.
7 జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.
Nyansa boro biribiara so; enti hwehwɛ nyansa. Ɛwɔ mu sɛ ne bo te sɛ wʼahode nyinaa de, nanso nya ntease.
8 నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది.
Di no ni na ɛbɛma wo so; yɛ no atuu, na ɛbɛhyɛ wo anuonyam.
9 అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది.
Ɔde nkonimdi nhwiren hankare begu wo ti so na wama wo ahenkyɛw a ɛyɛ fɛ.”
10 ౧౦ కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది.
Me ba, tie na fa nea meka no, na wo nkwanna bɛyɛ bebree.
11 ౧౧ జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను.
Mɛkyerɛ wo nyansa kwan so na mede wo afa akwan a ɛteɛ so.
12 ౧౨ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు.
Sɛ wonantew a, wʼanammɔntu bɛkɔ waa na sɛ wutu mmirika a, worenhintiw.
13 ౧౩ అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.
Di nkyerɛkyerɛ so; na nnyaa mu, bɔ ho ban yiye, efisɛ ɛyɛ wo nkwa.
14 ౧౪ భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
Ntu wo nan nsi amumɔyɛfo kwan so na nnantew abɔnefo kwan so.
15 ౧౫ అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
Kwati no, ntu kwan mfa so; dan fi so na kɔ wo kwan.
16 ౧౬ ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు.
Efisɛ wɔnyɛɛ bɔne a wontumi nna; na wɔn nna tew yera kosi sɛ wɔbɛma obi ahwe ase.
17 ౧౭ వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు.
Wodi amumɔyɛsɛm brodo, na wɔnom kitikitiyɛ nsa.
18 ౧౮ ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది.
Atreneefo kwan te sɛ adekyee hann a edi kan, ɛkɔ so hyerɛn yiye kodu awia ketee.
19 ౧౯ దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు.
Nanso amumɔyɛfo kwan te sɛ sum kabii; wonnim nea ɛma wohintiw.
20 ౨౦ కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో.
Me ba, yɛ aso ma nea meka; tie me nsɛm no yiye.
21 ౨౧ నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.
Mma emfi wʼani so, fa sie wo koma mu;
22 ౨౨ అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.
efisɛ, ɛyɛ nkwa ma wɔn a wohu ne akwahosan ma nipadua no nyinaa.
23 ౨౩ అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.
Ne nyinaa akyi, bɔ wo koma ho ban, efisɛ, ɛno ne wo nkwa asuti.
24 ౨౪ నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.
Mma oburu kasa mfi wʼano; mma nkontomposɛm mmɛn wʼano koraa.
25 ౨౫ నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.
Hwɛ wʼanim tee, na ma wʼani nkɔ nea ɛwɔ wʼanim no so.
26 ౨౬ నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి.
Bɔ ɔkwan tamaa ma wʼanan na fa akwan a atim so.
27 ౨౭ కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”
Mman mfa nifa anaa benkum; twe wo nan fi bɔne ho.

< సామెతలు 4 >