< సామెతలు 31 >
1 ౧ రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి,
Ɔhene Lemuel nsɛm a ɛyɛ nkɔmhyɛ a ne maame kyerɛɛ no:
2 ౨ కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను?
Ao me babarima, me yafunu ba, Ao mebɔhyɛ ba,
3 ౩ నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు.
nsɛe wʼahoɔden wɔ mmaa ho, wɔn a wɔgu ahemfo asu no.
4 ౪ ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.
Lemuel, nsã nyɛ mma ahemfo; asanom nyɛ mma ahemfo, ɛnsɛ sɛ sodifoɔ pere nsaden ho;
5 ౫ తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు.
sɛ wɔnom nsã a, wɔn werɛ bɛfiri deɛ mmara no ka, na wɔn a wɔdi wɔn nya no rennya deɛ wɔwɔ ho ɛkwan.
6 ౬ ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి.
Fa nsaden ma wɔn a wɔresɛe, na fa nsã ma wɔn a wɔwɔ amanehunu mu;
7 ౭ వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు.
Momma wɔnnom, na wɔn werɛ mfiri wɔn hia na wɔnnkae wɔn awerɛhoɔ bio.
8 ౮ మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.
Kasa ma wɔn a wɔntumi nkasa mma wɔn ho, kasa ma mmɔborɔfoɔ yiedie.
9 ౯ నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.
Kasa na bu atɛntenenee; kasa ma ahiafoɔ ne onnibie yiedie.
10 ౧౦ సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
Ɔyere pa, hwan na ɔbɛnya? Ɔsom bo pa ara sene nhwene pa.
11 ౧౧ ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు.
Ne kunu wɔ ne mu ahotosoɔ pa ara na biribiara a ɛwɔ boɔ nhia no.
12 ౧౨ ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు.
Ɔde deɛ ɛyɛ brɛ no, na ɛnyɛ ɔhaw, ne nkwa nna nyinaa mu.
13 ౧౩ ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది.
Ɔhwehwɛ odwannwi ne asaawa na ɔde ne nsa nwono wɔ fɛ so.
14 ౧౪ వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.
Ɔte sɛ adwadifoɔ ahyɛn, ɔde ne nnuane firi akyirikyiri ba.
15 ౧౫ ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
Adeɛ nnya nkyeeɛ no na wasɔre; ɔsiesie aduane ma nʼabusuafoɔ na ɔkyekyɛ nnwuma ma ne mmaawa.
16 ౧౬ ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
Ɔdwene afuo ho, na ɔtɔ; ɔfiri deɛ ɔnya mu yɛ bobefuo.
17 ౧౭ ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.
Ɔde nsi yɛ nʼadwuma; nʼabasa mu wɔ ahoɔden ma nʼadwuma.
18 ౧౮ తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
Ɔhwɛ sɛ nʼadwadie ho wɔ mfasoɔ, na ne kanea ɛnnum anadwo.
19 ౧౯ ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది.
Daa, na ne nsa kura tadua mu a ne nsateaa nso retoatoa asaawa.
20 ౨౦ దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.
Ɔgo ne nsam ma ahiafoɔ na ne nsa so onibie so.
21 ౨౧ తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.
Sɛ sukyerɛmma tɔ a ne yam nhyehye no wɔ ne fiefoɔ ho; ɛfiri sɛ wɔn nyinaa wɔ aduradeɛ a wɔde ko awɔ.
22 ౨౨ ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు.
Ɔyɛ ne mpasotam; na ɔfira nwera ne serekye ntoma.
23 ౨౩ ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి.
Ne kunu wɔ animuonyam wɔ kuropɔn ɛpono ano, baabi a ɔne asase no so mpanimfoɔ tena.
24 ౨౪ ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది.
Ɔpempam nwera ntadeɛ tontɔn, na ɔtu abɔwomu ma adwadifoɔ.
25 ౨౫ బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.
Ɔwɔ ahoɔden ne animuonyam; na ɔnsuro nna a ɛwɔ nʼanim.
26 ౨౬ ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది.
Ɔkasa nyansa mu, na nokorɛ nkyerɛkyerɛ wɔ ne tɛkrɛma so.
27 ౨౭ ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు.
Ɔhwɛ ne fidua mu nnwuma so na ɔnnyegye aniha so.
28 ౨౮ ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.
Ne mma sɔre a wɔfrɛ no nhyira; ne kunu nso saa ara, na ɔkamfo no sɛ,
29 ౨౯ “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు.
“Mmaa pii yɛ nneɛma a ɛwɔ edin, na wo deɛ, wosene wɔn nyinaa.”
30 ౩౦ చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.
Ɔbaa kɔnɔfoɔ yɛ nnaadaa, na ahoɔfɛ twam ntɛm so; nanso ɔbaa a ɔsuro Awurade no fata nkamfoɔ.
31 ౩౧ ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.
Fa abasobɔdeɛ a wanya no ma no, na wɔnkamfo ne nnwuma wɔ kuropɔn ɛpono ano.