< సామెతలు 30 >
1 ౧ ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట.
Detta är Agurs, Jakes sons, ord och utsaga. Så talade den mannen till Itiel -- till Itiel och Ukal.
2 ౨ నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు.
Ja, jag är för oförnuftig för att kunna räknas såsom människa, jag har icke mänskligt förstånd;
3 ౩ నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు.
vishet har jag icke fått lära, så att jag äger kunskap om den Helige.
4 ౪ ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా?
Vem har stigit upp till himmelen och åter farit ned? Vem har samlat vinden i sina händer? Vem har knutit in vattnet i ett kläde? Vem har fastställt jordens alla gränser? Vad heter han, och vad heter hans son -- du vet ju det?
5 ౫ దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు.
Allt Guds tal är luttrat; han är en sköld för dem som taga sin tillflykt till honom.
6 ౬ ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.
Lägg icke något till hans ord, på det att han icke må beslå dig med lögn.
7 ౭ దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు.
Om två ting beder jag dig, vägra mig dem icke, intill min död:
8 ౮ వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.
Låt fåfänglighet och lögn vara fjärran ifrån mig; och giv mig icke fattigdom, ej heller rikedom, men låt mig få det bröd mig tillkommer.
9 ౯ ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.
Jag kunde eljest, om jag bleve alltför matt, förneka dig, att jag sporde: »Vem är HERREN?» eller om jag bleve alltför fattig, kunde jag bliva en tjuv, ja, förgripa mig på min Guds namn.
10 ౧౦ దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు.
Förtala icke en tjänare inför hans herre; han kunde eljest förbanna dig, så att du stode där med skam.
11 ౧౧ తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది.
Ett släkte där man förbannar sin fader, och där man icke välsignar sin moder;
12 ౧౨ తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది.
ett släkte som tycker sig vara rent, fastän det icke har avtvått sin orenlighet;
13 ౧౩ కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా!
ett släkte -- huru stolta äro icke dess ögon, och huru fulla av högmod äro icke dess blickar!
14 ౧౪ దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.
ett släkte vars tänder äro svärd, och vars kindtänder äro knivar, så att de äta ut de betryckta ur landet och de fattiga ur människornas krets!
15 ౧౫ జలగకు ఇవ్వు, ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తిలేనివి మూడు ఉన్నాయి. చాలు అని పలకనివి నాలుగు ఉన్నాయి.
Blodigeln har två döttrar: »Giv hit, giv hit.» Tre finnas, som icke kunna mättas, ja, fyra, som aldrig säga: »Det är nog»:
16 ౧౬ పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. (Sheol )
dödsriket och den ofruktsammas kved, jorden, som icke kan mättas med vatten, och elden, som aldrig säger: »Det är nog.» (Sheol )
17 ౧౭ తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.
Den som bespottar sin fader och försmår att lyda sin moder hans öga skola korparna vid bäcken hacka ut, och örnens ungar skola äta upp det.
18 ౧౮ నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.
Tre ting äro mig för underbara, ja, fyra finnas, som jag icke kan spåra:
19 ౧౯ అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.
örnens väg under himmelen, ormens väg över klippan, skeppets väg mitt i havet och en mans väg hos en ung kvinna.
20 ౨౦ వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది.
Sådant är äktenskapsbryterskans sätt: hon njuter sig mätt och stryker sig så om munnen och säger: »Jag har intet orätt gjort.»
21 ౨౧ భూమిని వణకించేవి మూడు ఉన్నాయి, అది మోయ లేనివి నాలుగు ఉన్నాయి.
Tre finnas, under vilka jorden darrar, ja, fyra, under vilka den ej kan uthärda:
22 ౨౨ అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు,
under en träl, när han bliver konung, och en dåre, när han får äta sig mätt,
23 ౨౩ పెళ్లి చేసుకున్న గయ్యాళి గంప, యజమానురాలికి హక్కు దారైన దాసి.
under en försmådd kvinna, när hon får man och en tjänstekvinna, när hon tränger undan sin fru.
24 ౨౪ భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి.
Fyra finnas, som äro små på jorden, och likväl är stor vishet dem beskärd:
25 ౨౫ చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి.
myrorna äro ett svagt folk, men de bereda om sommaren sin föda;
26 ౨౬ చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి.
klippdassarna äro ett folk med ringa kraft, men i klippan bygga de sig hus;
27 ౨౭ మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.
gräshopporna hava ingen konung, men i härordning draga de alla ut;
28 ౨౮ నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది.
gecko-ödlan kan gripas med händerna, dock bor hon i konungapalatser.
29 ౨౯ డంబంగా నడుచుకునేవి మూడు ఉన్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి.
Tre finnas, som skrida ståtligt fram, ja, fyra, som hava en ståtlig gång:
30 ౩౦ అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం,
lejonet, hjälten bland djuren, som ej viker tillbaka för någon,
31 ౩౧ బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.
en stridsrustad häst och en bock och en konung i spetsen för sin här.
32 ౩౨ నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో.
Om du har förhävt dig, evad det var dårskap eller det var medveten synd, så lägg handen på munnen.
33 ౩౩ పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.
Ty såsom ost pressas ut ur mjölk, och såsom blod pressas ut ur näsan, så utpressas kiv ur vrede.