< సామెతలు 3 >
1 ౧ కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.
Mon fils, n'oublie point mon enseignement, et que ton cœur garde mes commandements.
2 ౨ అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.
Car ils t'apporteront de longs jours, et des années de vie, et la prospérité.
3 ౩ అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.
Que la miséricorde et la vérité ne t'abandonnent point; lie-les à ton cou, écris-les sur la table de ton cœur;
4 ౪ అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.
Et tu obtiendras la grâce et une grande sagesse aux yeux de Dieu et des hommes.
5 ౫ నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
Confie-toi en l'Éternel de tout ton cœur, et ne t'appuie point sur ta prudence.
6 ౬ ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
Considère-le dans toutes tes voies, et il dirigera tes sentiers.
7 ౭ నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
Ne sois point sage à tes propres yeux; crains l'Éternel, et détourne-toi du mal.
8 ౮ అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
Ce sera la santé pour tes muscles et un rafraîchissement pour tes os.
9 ౯ యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.
Honore l'Éternel de ton bien, et des prémices de tout ton revenu;
10 ౧౦ అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.
Et tes greniers seront remplis d'abondance, et tes cuves regorgeront de moût.
11 ౧౧ కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.
Mon fils, ne rejette point la correction de l'Éternel, et ne perds pas courage de ce qu'il te reprend;
12 ౧౨ ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.
Car l'Éternel châtie celui qu'il aime, comme un père l'enfant qu'il chérit.
13 ౧౩ జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.
Heureux l'homme qui a trouvé la sagesse, et l'homme qui avance dans l'intelligence!
14 ౧౪ వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.
Car il vaut mieux l'acquérir que de gagner de l'argent, et le revenu qu'on en peut tirer vaut mieux que l'or fin.
15 ౧౫ రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.
Elle est plus précieuse que les perles, et toutes les choses désirables ne la valent pas.
16 ౧౬ జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
Il y a de longs jours dans sa droite, des richesses et de la gloire dans sa gauche.
17 ౧౭ అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.
Ses voies sont des voies agréables, et tous ses sentiers conduisent à la paix.
18 ౧౮ దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.
Elle est l'arbre de vie pour ceux qui l'embrassent, et tous ceux qui la conservent sont rendus bienheureux.
19 ౧౯ తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.
L'Éternel a fondé la terre par la sagesse, et agencé les cieux par l'intelligence.
20 ౨౦ ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.
C'est par sa science que les abîmes s'ouvrent, et que les nuées distillent la rosée.
21 ౨౧ కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.
Mon fils, qu'elles ne s'écartent point de devant tes yeux; garde la sagesse et la prudence,
22 ౨౨ జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.
Et elles seront la vie de ton âme, et un ornement à ton cou.
23 ౨౩ అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.
Alors tu marcheras en assurance par ton chemin, et ton pied ne heurtera point.
24 ౨౪ పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.
Si tu te couches, tu n'auras point de frayeur; et quand tu seras couché, ton sommeil sera doux.
25 ౨౫ అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.
Ne crains point la frayeur soudaine, ni l'attaque des méchants, quand elle arrivera.
26 ౨౬ యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.
Car l'Éternel sera ton espérance, et il gardera ton pied du piège.
27 ౨౭ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.
Ne refuse pas un bienfait à celui qui en a besoin, quand il est en ton pouvoir de l'accorder.
28 ౨౮ నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.
Ne dis point à ton prochain: Va et reviens, et je te donnerai demain; quand tu as de quoi donner.
29 ౨౯ నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.
Ne machine point de mal contre ton prochain qui habite en assurance avec toi.
30 ౩౦ నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.
N'aie point de procès sans sujet avec personne, lorsqu'on ne t'a fait aucun mal.
31 ౩౧ దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.
Ne porte pas envie à l'homme violent, et ne choisis aucune de ses voies.
32 ౩౨ కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.
Car celui qui va de travers est en abomination à l'Éternel; mais il est l'ami de ceux qui sont droits.
33 ౩౩ దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.
La malédiction de l'Éternel est dans la maison du méchant; mais il bénit la demeure des justes.
34 ౩౪ ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
Il se moque des moqueurs; mais il fait grâce aux humbles.
35 ౩౫ జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.
Les sages hériteront la gloire; mais l'ignominie accablera les insensés.