< సామెతలు 29 >
1 ౧ చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.
人屢次受責罰,仍然硬着頸項; 他必頃刻敗壞,無法可治。
2 ౨ మంచి చేసే వారు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలుతున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు.
義人增多,民就喜樂; 惡人掌權,民就歎息。
3 ౩ జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు అతని ఆస్తిని పాడుచేస్తాడు.
愛慕智慧的,使父親喜樂; 與妓女結交的,卻浪費錢財。
4 ౪ న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు.
王藉公平,使國堅定; 索要賄賂,使國傾敗。
5 ౫ తన పొరుగువాడితో ముఖ స్తుతి మాటలు చెప్పేవాడు అతణ్ణి చిక్కించు కోడానికి వలవేసేవాడు.
諂媚鄰舍的, 就是設網羅絆他的腳。
6 ౬ దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు. మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు.
惡人犯罪,自陷網羅; 惟獨義人歡呼喜樂。
7 ౭ మంచి మనిషి పేదల పక్షంగా వాదిస్తాడు. పాతకుడికి అలాటి జ్ఞానం లేదు.
義人知道查明窮人的案; 惡人沒有聰明,就不得而知。
8 ౮ అపహాసకులు ఊరిని తగల బెడతారు. జ్ఞానులు కోపం చల్లారుస్తారు.
褻慢人煽惑通城; 智慧人止息眾怒。
9 ౯ జ్ఞాని మూర్ఖనితో వాదించేటప్పుడు వాడు రెచ్చిపోతుంటాడు, నవ్వుతుంటాడు. నెమ్మది ఉండదు.
智慧人與愚妄人相爭, 或怒或笑,總不能使他止息。
10 ౧౦ రక్తపిపాసులు నిర్దోషులను ద్వేషిస్తారు. వారు నీతిపరుల ప్రాణాలు తీయాలని చూస్తుంటారు.
好流人血的,恨惡完全人, 索取正直人的性命。
11 ౧౧ బుద్ధిహీనుడు తన కోపమంతా వెళ్ళగక్కుతాడు. జ్ఞానం గలవాడు కోపం అణచుకుంటాడు.
愚妄人怒氣全發; 智慧人忍氣含怒。
12 ౧౨ రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.
君王若聽謊言, 他一切臣僕都是奸惡。
13 ౧౩ పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే.
貧窮人、強暴人在世相遇; 他們的眼目都蒙耶和華光照。
14 ౧౪ ఏ రాజు దరిద్రులకు సత్యంతో న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం శాశ్వతంగా ఉంటుంది.
君王憑誠實判斷窮人; 他的國位必永遠堅立。
15 ౧౫ బెత్తం, గద్దింపు జ్ఞానం కలిగిస్తుంది. అదుపులేని పిల్లవాడు తన తల్లికి అవమానం తెస్తాడు.
杖打和責備能加增智慧; 放縱的兒子使母親羞愧。
16 ౧౬ దుష్టులు ప్రబలినప్పుడు దుర్మార్గత ప్రబలుతుంది. వారి పతనాన్ని నీతిపరులు కళ్లారా చూస్తారు.
惡人加多,過犯也加多, 義人必看見他們跌倒。
17 ౧౭ నీ కొడుకును శిక్షించినట్టయితే అతడు నీకు విశ్రాంతినిస్తాడు. నీ మనస్సుకు ఆనందం కలిగిస్తాడు.
管教你的兒子,他就使你得安息, 也必使你心裏喜樂。
18 ౧౮ ప్రవచన దర్శనం లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ఉంటారు. ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండే వాడు ధన్యుడు.
沒有異象,民就放肆; 惟遵守律法的,便為有福。
19 ౧౯ సేవకుడు మందలిస్తే బుద్ధి తెచ్చుకోడు. వాడికి విషయం అర్థం అయినా వాడు లోబడడు.
只用言語,僕人不肯受管教; 他雖然明白,也不留意。
20 ౨౦ తొందరపడి మాట్లాడే వాణ్ణి చూసావా? వాడికంటే మూర్ఖుడే సుళువుగా మారతాడు.
你見言語急躁的人嗎? 愚昧人比他更有指望。
21 ౨౧ ఒకడు తన సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబంగా పెంచితే చివరకూ వాడి వలన ఇబ్బందులు వస్తాయి.
人將僕人從小嬌養, 這僕人終久必成了他的兒子。
22 ౨౨ కోపిష్టి కలహం రేపుతాడు. ముక్కోపి చాలా పాపాలు చేస్తాడు.
好氣的人挑啟爭端; 暴怒的人多多犯罪。
23 ౨౩ ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.
人的高傲必使他卑下; 心裏謙遜的,必得尊榮。
24 ౨౪ దొంగతో చేతులు కలిపినవాడు తనకు తానే పగవాడు. అలాంటివాడు శాపపు మాటలు విని కూడా మిన్నకుంటాడు.
人與盜賊分贓,是恨惡自己的性命; 他聽見叫人發誓的聲音,卻不言語。
25 ౨౫ భయపడడం వల్ల మనుషులకు ఉరి వస్తుంది. యెహోవా పట్ల నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు.
懼怕人的,陷入網羅; 惟有倚靠耶和華的,必得安穩。
26 ౨౬ పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. కానీ మనుష్యులకు న్యాయం తీర్చేది యెహోవాయే.
求王恩的人多; 定人事乃在耶和華。
27 ౨౭ మంచి చేసే వారికీ దుర్మార్గుడు అంటే అసహ్యం. అలానే యథార్థవర్తనుడు భక్తిహీనుడికి హేయుడు.
為非作歹的,被義人憎嫌; 行事正直的,被惡人憎惡。