< సామెతలు 24 >

1 దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు.
ئیرەیی بە پیاوخراپان مەبە، ئارەزوو مەکە لەگەڵیاندا بیت،
2 వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది.
چونکە دڵیان پیلانی زۆرداری دەکێشێت و لێوەکانیان باسی گرفتنانەوە دەکەن.
3 జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది.
بە دانایی ماڵ بنیاد دەنرێت، بە تێگەیشتنیش دەچەسپێت،
4 తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి.
بە زانیاریش ژوورەکان پڕ دەبن لە هەموو گەنجینەیەکی بە نرخ و جوان.
5 జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి.
پیاوی دانا بەتوانایە، کەسی زانا هێزی زیاد دەبێت.
6 వివేకం గల నాయకుడివై యుద్ధం చెయ్యి. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండడం భద్రత.
بێگومان بە ڕاوێژەوە شەڕ دەکەیت، سەرکەوتنیش بە زۆری ئامۆژگارانە.
7 మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు.
دانایی بەرزە بۆ گێل، لە کۆڕی ناو دەروازەدا دەمی لێک ناکاتەوە.
8 కీడు చేయాలని పన్నాగాలు పన్నే వాడికి జిత్తులమారి అని పేరు పెడతారు.
ئەوەی بیر لە خراپە بکاتەوە، بە تەڵەکەباز ناودەبردرێت.
9 మూర్ఖుని ఆలోచన పాప భూయిష్టం. అపహాసకులను మనుషులు చీదరించుకుంటారు.
پیلانی گێلایەتی گوناهە، خەڵک قێزیان لە گاڵتەجاڕە.
10 ౧౦ కష్ట కాలంలో నీవు కుంగిపోతే చేతగాని వాడివౌతావు.
ئەگەر ورە بەردەیت لە ڕۆژی تەنگانە، بێ هێزیت!
11 ౧౧ మృత్యు ముఖంలో ఉన్న వారిని తప్పించు. నాశనం వైపుకు తూలుతున్న వారిని చేతనైతే రక్షించు.
ئەوانە دەرباز بکە کە بۆ مردن دەبردرێن و لەوانەی بۆ سەربڕین پاڵخراون، کەمتەرخەم مەبە.
12 ౧౨ “చూసావా ఈ సంగతి మనకి తెలియ లేదు” అని నీవంటే సరిపోతుందా? హృదయాలను పరిశోధించేవాడు నీవు చెబుతున్నది గ్రహించడా? నీ జీవాన్ని కాపాడే వాడు నీ మాటను గ్రహించడా? మనుషులకు వారి చర్యలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడా?
ئەگەر بڵێی: «ئەوەتا ئەمەم نەزانیوە،» ئایا هەڵسەنگێنەری دڵەکان تێناگات؟ ئەوەی گیانت دەپارێزێت ئایا نازانێت؟ ئایا سزای مرۆڤ بەپێی کردەوەکانی ناداتەوە؟
13 ౧౩ కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా.
ڕۆڵە، هەنگوین بخۆ، چونکە باشە و شیلەی هەنگوین لە گەرووت شیرینە،
14 ౧౪ నీ ఆత్మకు జ్ఞానం అలాటిదని తెలుసుకో. అది నీకు దొరికితే నీకు మంచి భవిషత్తు ఉంటుంది. నీకు ఆశాభంగం కలగదు.
هەروەها بزانە دانایی بۆ گیانت بەم جۆرەیە. ئەگەر دانایی بدۆزیتەوە دواڕۆژت دەبێت و ئومێدبڕ نابیت.
15 ౧౫ మంచివారి ఇళ్ళ దగ్గర పొంచి ఉండి దాడి చేసే దురాత్ముల్లాగా ఉండకు. వారి గృహాలను పాడు చేయకు.
وەک خراپەکار خۆت مەڵاس مەدە بۆ ماڵی کەسی ڕاستودروست، هەڵمەکوتە سەر جێی حەسانەوەی،
16 ౧౬ ఉత్తముడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. విపత్తు కలిగినప్పుడు భక్తిహీనులు కూలి పోతారు.
چونکە کەسی ڕاستودروست حەوت جار دەکەوێت و هەڵدەستێتەوە، بەڵام کارەسات بەدکاران تێکدەشکێنێت.
17 ౧౭ నీ శత్రువు పడిపొతే సంతోషించవద్దు. వాడు తూలిపడినప్పుడు నీవు మనస్సులో అనందించవద్దు.
بە ساتمەکردنی دوژمنت شاد مەبە، بە کەوتنیشی دڵت خۆش نەبێت،
18 ౧౮ యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో.
نەوەک یەزدان ببینێت و بەلایەوە خراپ بێت، جا تووڕەیی خۆی لێ بگێڕێتەوە.
19 ౧౯ దుర్మార్గులను చూసి అందోళన చెందకు. భక్తిహీనుల విషయం మత్సరపడకు.
مەراق لە خراپەکاران مەخۆ، ئیرەیی بە بەدکاران مەبە،
20 ౨౦ దుర్జనుడికి పుట్టగతులుండవు. భక్తిహీనుల దీపం కొడిగడుతుంది.
چونکە خراپەکار دواڕۆژی نابێت و چرای بەدکاران دەکوژێتەوە.
21 ౨౧ కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు.
ڕۆڵە، لە یەزدان و پاشا بترسە، تێکەڵی یاخیبووەکان مەبە،
22 ౨౨ అలాటి వారికి హఠాత్తుగా ఆపద వాటిల్లుతుంది. వారి కాలం ఎప్పుడు ముగిసి పోతుందో ఎవరికి తెలుసు?
چونکە بەڵایان لەپڕ دێت، بەڵای هەردووکیان کێ دەیزانێت؟
23 ౨౩ ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయ తీర్పులో పక్షపాతం ధర్మం కాదు.
هەروەها ئەمەش قسەی دانایانە: لایەنگریکردن لە دادوەری باش نییە.
24 ౨౪ నీలో దోషం లేదని దుష్టుడితో చెప్పే వాణ్ణి మనుషులు శపిస్తారు. జనం అలాటి వాణ్ణి అసహ్యించుకుంటారు.
ئەوەی بە بەدکار بڵێت: «تۆ بێتاوانی،» گەلان نەفرەتی لێ دەکەن و نەتەوەکان تاوانباری دەکەن.
25 ౨౫ న్యాయంగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన అలాంటి వారి మీదికి వస్తుంది.
بەڵام ئەوانەی بەدکار تاوانبار دەکەن دەکەونە خۆشی و بەرەکەتی باشیان بەسەردا دەڕژێت.
26 ౨౬ సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.
وەڵامی ڕاست وەک ماچی لێوە.
27 ౨౭ బయట పని చక్కబెట్టుకో. ముందుగా పొలంలో సిద్ధపరచుకో. ఆ తరవాత ఇల్లు కట్టుకోవచ్చు.
کاروباری خۆت لە دەرەوە ڕاپەڕێنە و لە کێڵگەکەت ئامادەی بکە، دوای ئەمە ماڵی خۆت بنیاد بنێ.
28 ౨౮ అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా?
بەبێ هۆ لە دژی دراوسێکەت شایەتی مەدە، بە لێوەکانت فێڵ مەکە.
29 ౨౯ “వాడు నాకు చేసినట్లు వాడికి చేస్తాను. వాడి క్రియ చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాను” అనుకోవద్దు.
مەڵێ: «چی لێکردووم، ئاوای لێ دەکەم، سزای ئەو پیاوە بەپێی کردەوەکەی دەدەمەوە.»
30 ౩౦ సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే,
بەلای کێڵگەی پیاوی تەمبەڵ تێپەڕیم، بەلای ڕەزەمێوی کەسی تێنەگەیشتووش.
31 ౩౧ ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.
چقڵ هەمووی داگرتبوو، گەزگەزکە هەمووی داپۆشی بوو، کەڵەکە بەردەکانی ڕووخابوو.
32 ౩౨ నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను.
تەماشام کرد و لە دڵی خۆمدا لێکم دایەوە، بینیم و وانەم لێ وەرگرت:
33 ౩౩ మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం,
کەمێک خەوتن، کەمێک خەواڵووبوون، کەمێکیش دەست تێکنان بۆ ڕاکشان،
34 ౩౪ వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.
ئینجا هەژاریت وەک چەتە دێت، نەبوونیشت وەک چەکدار.

< సామెతలు 24 >