< సామెతలు 23 >

1 నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు.
なんぢ侯たる者とともに坐して食ふときは 愼みて汝の前にある者の誰なるかを思へ
2 నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో.
汝もし食を嗜む者ならば汝の喉に刀をあてよ
3 అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి.
その珍饈を貧り食ふこと勿れ これ迷惑の食物なればなり
4 ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి.
富を得んと思煩らふこと勿れ 自己の明哲を恃むこと勿れ
5 డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.
なんぢ虚しきに歸すべき者に目をとむるか 富はかならず自ら翅を生じて鷲のごとく天に飛さらん
6 దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు.
惡目をする者の糧をくらふことなく その珍饈をむさぼりねがふことなかれ
7 ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.
そはその心に思ふごとくその人となりも亦しかればなり 彼なんぢに食へ飮めといふこといへどもその心は汝に眞實ならず
8 నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది.
汝つひにその食へる物を吐出すにいたり 且その出しし懇懃の言もむなしくならん
9 బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు.
愚なる者の耳に語ること勿れ 彼なんぢが言の示す明哲を藐めん
10 ౧౦ పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు.
古き地界を移すことなかれ 孤子の畑を侵すことなかれ
11 ౧౧ వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు.
そはかれが贖者は強し 必ず汝に對らひて之が訴をのべん
12 ౧౨ ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు.
汝の心を敎に用ゐ 汝の耳を知識の言に傾けよ
13 ౧౩ నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు.
子を懲すことを爲ざるなかれ 鞭をもて彼を打とも死ることあらじ
14 ౧౪ బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. (Sheol h7585)
もし鞭をもて彼をうたばその霊魂を陰府より救ふことをえん (Sheol h7585)
15 ౧౫ కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది.
わが子よもし汝のこころ智からば我が心もまた歓び
16 ౧౬ నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది.
もし汝の口唇ただしき事をいはば我が腎腸も喜ぶべし
17 ౧౭ పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు.
なんぢ心に罪人をうらやむ勿れ ただ終日ヱホバを畏れよ
18 ౧౮ నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు.
そは必ず應報ありて汝の望は廢らざればなり
19 ౧౯ కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో.
わが子よ 汝ききて智慧をえ かつ汝の心を道にかたぶけよ
20 ౨౦ ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు.
酒にふけり肉をたしむものと交ること勿れ
21 ౨౧ తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది.
それ酒にふける者と肉を嗜む者とは貧しくなり 睡眠を貧る者は敞れたる衣をきるにいたらん
22 ౨౨ నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు.
汝を生る父にきけ 汝の老たる母を軽んずる勿れ
23 ౨౩ సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో.
眞理を買へ これを售るなかれ 智慧と誡命と知識とまた然あれ
24 ౨౪ ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు.
義き者の父は大によろこび 智慧ある子を生る者はこれがために樂しまん
25 ౨౫ నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి.
汝の父母を樂しませ 汝を生る者を喜ばせよ
26 ౨౬ కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి.
わが子よ汝の心を我にあたへ 汝の目にわが途を樂しめ
27 ౨౭ వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట.
それ妓婦は深き坑のごとく 淫婦は狭き井のごとし
28 ౨౮ దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది.
彼は盗賊のごとく人を窺ひ かつ世の人の中に悖れる者を増なり
29 ౨౯ ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు?
禍害ある者は誰ぞ 憂愁ある者は誰ぞ 爭端をなす者は誰ぞ 煩慮ある者は誰ぞ 故なくして傷をうくる者は誰ぞ 赤目ある者は誰ぞ
30 ౩౦ ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా.
是すなはち酒に夜をふかすもの 往て混和せたる酒を味ふる者なり
31 ౩౧ ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు.
酒はあかく盃の中に泡だち滑かにくだる 汝これを見るなかれ
32 ౩౨ అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది.
是は終に蛇のごとく噬み蝮の如く刺すべし
33 ౩౩ నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు.
また汝の目は怪しきものを見 なんぢの心は諕言をいはん
34 ౩౪ నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు.
汝は海のなかに偃すもののごとく帆桅の上に偃すもののごとし
35 ౩౫ “నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు.
汝いはん人われを撃ども我いたまず 我を拷けども我おぼえず 我さめなばまた酒を求めんと

< సామెతలు 23 >