< సామెతలు 22 >
1 ౧ గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.
Edin pa yɛ sene ahonya bebrebe; sɛ wɔbɛdi wo ni yɛ sene dwetɛ anaa sikakɔkɔɔ.
2 ౨ ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే.
Ɔdefoɔ ne ohiani wɔ adeɛ baako, Awurade ne wɔn nyinaa Yɛfoɔ.
3 ౩ బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.
Onitefoɔ hunu amanehunu a ɛreba na ɔhinta ne ho, nanso atetekwaa kɔ nʼanim kɔnya amane.
4 ౪ యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.
Ahobrɛaseɛ ne Awurade suro ma ahonya ne animuonyam ne nkwa.
5 ౫ ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు.
Nkasɛɛ ne mfidie wɔ amumuyɛfoɔ akwan so, nanso deɛ ɔbɔ ne kra ho ban no mmɛn ho.
6 ౬ పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.
Kyerɛ abɔfra ɛkwan a ɔmfa so, na sɛ ɔnyini a ɔremfiri so.
7 ౭ ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.
Adefoɔ di ahiafoɔ so, na boseagyeni yɛ deɛ ɔde fɛm ɔsomfoɔ.
8 ౮ దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది.
Deɛ ɔdua amumuyɛsɛm no twa ɔhaw na wɔbɛsɛe nʼabufuhyeɛ abaa.
9 ౯ ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.
Ɔyamyɛfoɔ bɛnya nhyira ɛfiri sɛ ɔne ahiafoɔ kyɛ nʼaduane.
10 ౧౦ తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.
Pam ɔfɛdifoɔ na basabasayɛ nso bɛkɔ; ntɔkwa ne atɛnnidie to atwa.
11 ౧౧ శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు.
Obi a ɔdɔ akoma a emu teɛ na ne kasa ho yɛ nyam bɛnya ɔhene afa no adamfo.
12 ౧౨ జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.
Awurade ani wɛn nimdeɛ, na ɔsɛe ɔtorofoɔ nsɛm.
13 ౧౩ సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.
Ɔkwadwofoɔ ka sɛ, “Gyata bi wɔ mfikyire hɔ!” anaasɛ, “Wɔbɛkum me wɔ mmɔntene so.”
14 ౧౪ వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.
Ɔbaa waresɛefoɔ anomu yɛ amena donkudonku; deɛ ɔhyɛ Awurade abufuo ase no bɛtɔ mu.
15 ౧౫ పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది.
Agyimisɛm kyekyere abɔfra akoma ho, nanso ntenesoɔ abaa bɛpamo akɔ akyiri.
16 ౧౬ తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.
Obi bɛsisi ohiani de apɛ ahonya anaa ɔbɛkyɛ ɔdefoɔ adeɛ, ne nyinaa de no kɔ ohia mu.
17 ౧౭ శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.
Yɛ aso na tie anyansasɛm yi; fa wʼakoma di me nkyerɛkyerɛ akyi,
18 ౧౮ నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.
ɛfiri sɛ ɛyɛ sɛ wokora saa nsɛm yi wɔ wʼakoma mu, na ne nyinaa ada wʼano.
19 ౧౯ నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?
Sɛdeɛ wode wo ho bɛto Awurade so, merekyerɛkyerɛ wo ɛnnɛ, aane wo.
20 ౨౦ వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
Mentwerɛɛ mmɛ aduasa mmaa wo, deɛ ɛyɛ afotusɛm ne nimdeɛ,
21 ౨౧ నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?
a ɛkyerɛkyerɛ wo nokorɛ ne deɛ akyinnyeɛ nni ho, sɛdeɛ wobɛnya mmuaeɛ pa ama deɛ ɔsomaa woɔ no anaa?
22 ౨౨ పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.
Mmɔ ahiafoɔ korɔno, sɛ wɔyɛ ahiafoɔ enti, na nnsisi wɔn a wɔnni bie wɔ asɛnniiɛ,
23 ౨౩ యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.
ɛfiri sɛ Awurade bɛdi wɔn asɛm ama wɔn na wafom afa wɔn a wɔfom ahiafoɔ fa.
24 ౨౪ కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.
Mfa obi a ne bo ha no adamfo, na mmfa wo ho mmɔ deɛ ne bo nkyɛre fu,
25 ౨౫ నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.
anyɛ saa a, wobɛsua nʼakwan na woakɔtɔ afidie mu.
26 ౨౬ అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.
Ɛnyɛ deɛ ɔde ne nsa hyɛ krataa ase di agyinamu, anaasɛ deɛ ɔdi akagyinamu;
27 ౨౭ ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?
na sɛ wonni deɛ wɔde tua a wɔbɛhwan wo mpa mpo afiri wʼase.
28 ౨౮ నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
Ntutu tete aboɔ a wɔde ato hyeɛ; deɛ wo nananom de sisii hɔ no.
29 ౨౯ తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.
Wohunu odwumayɛfoɔ a ne nsa akokwa nʼadwuma ho anaa? Ahemfo anim na ɔbɛsom, na ɔrensom wɔ mpapahwekwaa anim.