< సామెతలు 21 >

1 రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు.
Ɔhene akoma da Awurade nsam; ɔkyerɛ no ɛkwan te sɛ asutene ma ɔkɔ baabiara a ɔpɛ.
2 ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాయే.
Onipa akwan nyinaa tene wɔ nʼani so, nanso Awurade na ɔkari akoma.
3 బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.
Sɛ woyɛ adepa ne adeɛ a ɛtene a ɛsɔ Awurade ani sene afɔrebɔ.
4 అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం.
Ani a ɛtra ntɔn ne ahomasoɔ akoma, ne amumuyɛfoɔ asetena nyinaa yɛ bɔne!
5 శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే.
Nsiyɛfoɔ nhyehyɛeɛ de mfasoɔ ba sɛdeɛ ntɛmpɛ kɔwie ohia no.
6 అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం.
Ahonya a nkontompo tɛkrɛma de ba no yɛ huhuro ne owuo afidie.
7 భక్తిహీనులకు న్యాయం గిట్టదు. వారు చేసే దౌర్జన్యమే వారిని కొట్టుకు పోయేలా చేస్తుంది.
Amumuyɛfoɔ basabasayɛ bɛtwe wɔn akɔ, ɛfiri sɛ wɔmpɛ sɛ wɔyɛ deɛ ɛtene.
8 దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు.
Onipa a ɔdi fɔ no akwan yɛ kɔntɔnkye, na deɛ ne ho nni asɛm no adeyɛ tene.
9 గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు.
Suhyɛ twɛtwɛwa ase baabi tena yɛ sene sɛ wo ne ɔyere ntɔkwapɛfoɔ bɛtena efie.
10 ౧౦ భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు.
Omumuyɛfoɔ kɔn dɔ bɔne; ɔnni ahummɔborɔ mma ne yɔnko.
11 ౧౧ అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞాని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది.
Sɛ wɔtwe fɛdifoɔ aso a, ntetekwaafoɔ hunu nyansa, sɛ wɔkyerɛkyerɛ onyansafoɔ a, ɔnya nimdeɛ.
12 ౧౨ న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు.
Ɔteneneeni no nim deɛ ɛrekɔso wɔ omumuyɛfoɔ fie na ɔde omumuyɛfoɔ no kɔ ɔsɛeɛ mu.
13 ౧౩ దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు.
Sɛ onipa sisi nʼaso wɔ mmɔborɔni su ho a ɔno nso bɛsu afrɛ, na wɔrennye no so.
14 ౧౪ చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది.
Kokoam adekyɛ dwodwo akoma, kɛtɛasehyɛ nso pata abufuhyeɛ.
15 ౧౫ న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం.
Sɛ wobu atɛntenenee a, teneneefoɔ anigye nanso ɛyɛ ahunahuna ma abɔnefoɔ.
16 ౧౬ వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు.
Onipa a ɔmane firi nhunumu kwan soɔ no bɛhome wɔ awufoɔ fekuo mu.
17 ౧౭ సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు.
Deɛ ɔdi ahosɛpɛ akyi no bɛyɛ ohiani; deɛ ɔpɛ nsã ne ngo no rennya ne ho da.
18 ౧౮ నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు.
Amumuyɛfoɔ de wɔn nkwa to hɔ ma teneneefoɔ, na atorofoɔ yɛ saa ma wɔn a wɔyɛ pɛ.
19 ౧౯ ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు.
Ɛyɛ sɛ wobɛtena ɛserɛ so, sene sɛ wo ne ɔyere ntɔkwapɛfoɔ a nʼakoma ha no bɛtena.
20 ౨౦ విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు.
Nnuane pa ne ngo ayɛ onyansafoɔ fie ma, nanso ɔkwasea di deɛ ɔwɔ nyinaa.
21 ౨౧ నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.
Deɛ ɔti tenenee ne ɔdɔ no ɔnya nkwa, yiedie ne animuonyam.
22 ౨౨ జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు.
Onyansafoɔ to hyɛ ahoɔdenfoɔ kuropɔn so na ɔdwiri abandenden a wɔn werɛ hyɛ mu gu fam.
23 ౨౩ నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు.
Deɛ ɔkora nʼano ne ne tɛkrɛma no ɔtwe ne ho firi amanenya ho.
24 ౨౪ అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు.
Ɔhantanni a ɔma ne ho so no, ne din ne “Ɔfɛdifoɔ” ɔde ahantan ntrasoɔ yɛ adeɛ.
25 ౨౫ సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి.
Deɛ ɔkwadwofoɔ kɔn dɔ no bɛyɛ owuo ama no, ɛfiri sɛ ne nsa mpɛ adwumayɛ.
26 ౨౬ రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు.
Ɛda mu nyinaa ɔpere sɛ ɔbɛnya bebree, nanso ɔteneneeni deɛ, ɔma a ɔnnodo ho.
27 ౨౭ దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా.
Omumuyɛfoɔ afɔrebɔ yɛ akyiwadeɛ, ne titire ne sɛ ɔde adwemmɔne bata ho.
28 ౨౮ అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
Adansekurumdini bɛyera, na obiara a ɔtie noɔ no nso wɔbɛsɛe no.
29 ౨౯ దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు.
Amumuyɛfoɔ di akakabensɛm na ɔteneneeni deɛ, ɔdwene nʼakwan ho.
30 ౩౦ యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు.
Nyansa, nhunumu ne nhyehyɛeɛ biara nni hɔ a ɛbɛtumi ayɛ yie atia Awurade.
31 ౩౧ యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే.
Wɔsiesie apɔnkɔ ma ɔko da, nanso nkonimdie yɛ Awurade dea.

< సామెతలు 21 >