< సామెతలు 20 >
1 ౧ ద్రాక్ష మద్యం ఎగతాళి పాలు చేస్తుంది. సారాయి మనిషిని గిల్లికజ్జాలు పెట్టుకునేలా చేస్తుంది. తప్ప తాగి దారి తప్పేవాడు బుద్ధి లేని వాడు.
酒能使人亵慢,浓酒使人喧嚷; 凡因酒错误的,就无智慧。
2 ౨ రాజు వల్ల కలిగే భయం సింహగర్జన వంటిది. రాజుకు కోపం రేపే వాడు తన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టుకుంటాడు.
王的威吓如同狮子吼叫; 惹动他怒的,是自害己命。
3 ౩ కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.
远离纷争是人的尊荣; 愚妄人都爱争闹。
4 ౪ నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
懒惰人因冬寒不肯耕种, 到收割的时候,他必讨饭而无所得。
5 ౫ మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.
人心怀藏谋略,好像深水, 惟明哲人才能汲引出来。
6 ౬ నేను నమ్మదగిన వాణ్ణి అని చాలామంది చెప్పుకుంటారు. అయితే నమ్మదగిన వాడు ఎవరికి కనిపిస్తాడు?
人多述说自己的仁慈, 但忠信人谁能遇着呢?
7 ౭ యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
行为纯正的义人, 他的子孙是有福的!
8 ౮ న్యాయపీఠంపై కూర్చున్న రాజు తన కళ్ళతో చెడుతనాన్ని చెదరగొడతాడు.
王坐在审判的位上, 以眼目驱散诸恶。
9 ౯ నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. పాపమంతా వదిలించుకున్నాను అని ఎవరు అనగలరు?
谁能说,我洁净了我的心, 我脱净了我的罪?
10 ౧౦ వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
两样的法码,两样的升斗, 都为耶和华所憎恶。
11 ౧౧ చిన్నవాళ్ళను సైతం వారి చర్యలను బట్టి, వారి ప్రవర్తన శుద్ధమైనదా, యథార్థమైనదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పవచ్చు.
孩童的动作是清洁,是正直, 都显明他的本性。
12 ౧౨ వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.
能听的耳,能看的眼, 都是耶和华所造的。
13 ౧౩ అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
不要贪睡,免致贫穷; 眼要睁开,你就吃饱。
14 ౧౪ కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
买物的说:不好,不好; 及至买去,他便自夸。
15 ౧౫ బంగారం, విస్తారంగా రత్నాలు ఉన్నాయి. కానీ వివేకంగా మాట్లాడే పెదాలు అమూల్యమైన ఆభరణాలు.
有金子和许多珍珠, 惟有知识的嘴乃为贵重的珍宝。
16 ౧౬ పరాయివాడికి హామీగా ఉన్నవాడి బట్టలు తీసుకో. వ్యభిచారిణి కోసం పూచీ తీసుకున్న వాణ్ణి బాధ్యుడుగా ఎంచు.
谁为生人作保,就拿谁的衣服; 谁为外人作保,谁就要承当。
17 ౧౭ మోసం చేసి తెచ్చిన ఆహారం మనుషులకు మధురంగా ఉంటుంది. కానీ తరువాత నోరంతా మట్టిగొట్టుకు పోతుంది.
以虚谎而得的食物,人觉甘甜; 但后来,他的口必充满尘沙。
18 ౧౮ ఉద్దేశాలు ఆలోచనచేత స్థిరం అవుతాయి. వివేక పూరితమైన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చెయ్యి.
计谋都凭筹算立定; 打仗要凭智谋。
19 ౧౯ కొండేలు చెప్తూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయట పెడతాడు. కాబట్టి వాగుడు కాయల జోలికి పోవద్దు.
往来传舌的,泄漏密事; 大张嘴的,不可与他结交。
20 ౨౦ తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది.
咒骂父母的,他的灯必灭, 变为漆黑的黑暗。
21 ౨౧ నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు.
起初速得的产业, 终久却不为福。
22 ౨౨ కీడుకు ప్రతికీడు తలపెట్టవద్దు. యెహోవా కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.
你不要说,我要以恶报恶; 要等候耶和华,他必拯救你。
23 ౨౩ అన్యాయమైన తూకం రాళ్లు యెహోవాకు అసహ్యం. దొంగ త్రాసును ఆయన ఒప్పుకోడు.
两样的法码为耶和华所憎恶; 诡诈的天平也为不善。
24 ౨౪ మనిషి ప్రవర్తన యెహోవా వశంలో ఉంటుంది. తనకు జరగబోయేది అతనికి ఎలా తెలుస్తుంది?
人的脚步为耶和华所定; 人岂能明白自己的路呢?
25 ౨౫ తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.
人冒失说,这是圣物, 许愿之后才查问,就是自陷网罗。
26 ౨౬ జ్ఞానంగల రాజు భక్తిహీనులను చెల్లా చెదరు చేసేస్తాడు. అలాటి వాళ్ళ మీద బరువైన చక్రం దొర్లిస్తాడు.
智慧的王簸散恶人, 用碌碡滚轧他们。
27 ౨౭ మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది.
人的灵是耶和华的灯, 鉴察人的心腹。
28 ౨౮ కృప, సత్యం రాజుకు రక్ష. కృప మూలంగా అతడు తన సింహాసనాన్ని పదిలం చేసుకుంటాడు.
王因仁慈和诚实得以保全他的国位, 也因仁慈立稳。
29 ౨౯ యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం.
强壮乃少年人的荣耀; 白发为老年人的尊荣。
30 ౩౦ గాయాలు చేసే దెబ్బలు మనసు లోతుల్లోకి దూరి చెడుతనాన్ని పరిహరిస్తాయి.
鞭伤除净人的罪恶; 责打能入人的心腹。