< సామెతలు 2 >
1 ౧ కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.
Wuoda, ka iyie rwako wechena kendo kano chikena e chunyi;
2 ౨ జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు,
ka ichiko iti ni weche mag rieko kendo kiketo chunyi mondo iwinj tiend weche,
3 ౩ తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు,
to ka imanyo ngʼeyo malingʼ-lingʼ, kendo ikwayo ngʼeyo tiend wach,
4 ౪ పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు,
to ka idware ka fedha kendo imanye ka mwandu mopandi,
5 ౫ యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
eka iniwinj malongʼo tiend luoro Jehova Nyasaye, kendo iniyud rieko mar ngʼeyo Nyasaye.
6 ౬ యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.
Jehova Nyasaye chiwo rieko kendo ngʼeyo gi winjo aa e dhoge.
7 ౭ యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.
Oiko loch ni joma kare, en okumba ni jogo ma wuodhgi ler,
8 ౮ న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.
nimar en okumba mar joma kare kendo orito yor joge ma jo-adiera.
9 ౯ అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.
Ka iwinjo wachna, eka iningʼe gima kare, kendo mowinjore ma gin yore duto mabeyo.
10 ౧౦ జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.
Nimar rieko nodonj e chunyi, kendo ngʼeyo nomi ngimani bedo mamor.
11 ౧౧ తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.
Rieko mar pogo tiend wach noriti, kendo winjo tiend wach nobedni okumba.
12 ౧౨ అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.
Rieko noresi kuom yore mag joma mono, kuom jogo mawacho weche mochido,
13 ౧౩ దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.
jogo moweyo yore moriere mag bidhruok, mondo giwuothi e yore mag mudho,
14 ౧౪ కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.
joma mor kuom timo maricho kendo giil e duwruok mar richo,
15 ౧౫ తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.
jogo ma yoregi ogajore ogajore kendo gin jowuond e yoregi.
16 ౧౬ వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
Bende enoresi kuom dhako ma jachode, kuom dhako mabayo gi wechege maywayo ji,
17 ౧౭ అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది.
moseweyo chwore mane okende konyako, kendo oketho singruok mane otimo e nyim Nyasaye.
18 ౧౮ ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.
Nikech ode tero ji e tho to yorene tero ji e piny joma otho.
19 ౧౯ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు.
Onge ngʼato madhi ire maduogo kata yudo yor ngima.
20 ౨౦ నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు.
Kuom mano, iniluw yore joma beyo kendo irit yore joma kare.
21 ౨౧ నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు.
Nimar joma kare ema nodag e piny kendo jogo maonge bura ema nosiki e piny;
22 ౨౨ చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.
to joma timbegi mono nogol oko e piny kendo jogo ma ok jo-adiera ok nobedie ngangʼ.