< సామెతలు 19 >
1 ౧ బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప.
Сиромах који ходи у безазлености својој бољи је него опаки уснама својим, који је безуман.
2 ౨ ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు.
Кад је душа без знања, није добро; и ко је брзих ногу, спотиче се.
3 ౩ ఒకడి మూర్ఖత్వం వాడి బ్రతుకును ధ్వంసం చేస్తుంది. అలాటి వాడు యెహోవా మీద మండిపడతాడు.
Лудост човечија превраћа пут његов, а срце се његово гневи на Господа.
4 ౪ సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు.
Богатство прибавља много пријатеља, а сиромаха оставља пријатељ његов.
5 ౫ అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.
Лажан сведок неће остати без кара, и ко говори лаж, неће побећи.
6 ౬ ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే.
Многи угађају кнезу, и свак је пријатељ човеку податљивом.
7 ౭ పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.
На сиромаха мрзе сва браћа његова, још више се пријатељи његови удаљују од њега; виче за њима, али их нема.
8 ౮ బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు.
Ко прибавља разум, љуби душу своју; и ко пази на мудрост, наћи ће добро.
9 ౯ అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.
Сведок лажан неће остати без кара, и ко говори лаж, погинуће.
10 ౧౦ బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు.
Не доликују безумном милине, ни слузи да влада кнезовима.
11 ౧౧ విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత.
Разум задржава човека од гнева, и част му је мимоићи кривицу.
12 ౧౨ రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.
Царева је срдња као рика младог лава, и љубав је његова као роса трави.
13 ౧౩ మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం.
Безуман је син мука оцу свом, и свадљивост женина непрестано прокисивање.
14 ౧౪ ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే.
Кућа и имање наслеђује се од отаца; а од Господа је разумна жена.
15 ౧౫ సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.
Леност наводи тврд сан, и немарљива душа гладоваће.
16 ౧౬ ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు.
Ко држи заповести, чува душу своју; а ко не мари за путеве своје, погинуће.
17 ౧౭ పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.
Господу позаима ко поклања сиромаху, и платиће му за добро његово.
18 ౧౮ అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు.
Карај сина свог докле има надања и на погибао његову да не прашта душа твоја.
19 ౧౯ పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది.
Велик гнев показуј кад прашташ кар, и кад опростиш, после већма покарај.
20 ౨౦ సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు.
Слушај савет и примај наставу, да после будеш мудар.
21 ౨౧ మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.
Много има мисли у срцу човечијем, али шта Господ науми оно ће остати.
22 ౨౨ మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు.
Жеља човеку треба да је да чини милост, а бољи је сиромах него лажа.
23 ౨౩ యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.
Страх је Господњи на живот; у кога је он, борави сит, нити га походи зло.
24 ౨౪ సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు.
Лењивац крије руку своју у недра, ни к устима својим не приноси је.
25 ౨౫ హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు.
Удри подсмевача да луди омудра, и разумног накарај да разуме науку.
26 ౨౬ తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు, అపకీర్తి తెచ్చే కొడుకు.
Син срамотан и прекоран упропашћује оца и одгони матер.
27 ౨౭ కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు.
Немој, сине, слушати науке која одводи од речи разумних.
28 ౨౮ చెడిపోయిన సాక్షి న్యాయాన్ని గేలి చేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జుర్రుకుంటుంది.
Неваљао сведок подсмева се правди, и уста безбожника прождиру на неправду.
29 ౨౯ అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు.
Готови су подсмевачима судови и безумницима бој на леђа.