< సామెతలు 18 >
1 ౧ తనకు తానుగా ఉండే వాడు స్వార్థపరుడు. వాడు సరైన ఆలోచనకు వ్యతిరేకం.
Човек самовољан тражи шта је њему мило и меша се у свашта.
2 ౨ మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం.
Безумнику није мио разум него да се јавља срце његово.
3 ౩ దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి.
Кад дође безбожник, дође и руг, и прекор са срамотом.
4 ౪ మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం వంటివి. జ్ఞానపు ఊటలో నుండి పారే సెలయేరు వంటివి.
Речи су из уста човечијих дубока вода, извор је мудрости поток који се разлива.
5 ౫ దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు.
Није добро гледати безбожнику ко је, да се учини криво правом на суду.
6 ౬ బుద్ధి లేని వాడి పెదాలు కలహానికి కాచుకుని ఉంటాయి. వాడి మాటలు దెబ్బల కోసం వెంపర్లాతాయి.
Усне безумникове пристају у свађу, и уста његова дозивају бој.
7 ౭ మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి.
Безумнику су уста његова погибао, и усне његове пругло души његовој.
8 ౮ కొండేలు చెప్పే వాడి మాటలు చవులూరించే భక్ష్యాలు. అవి హాయిగా కడుపులోకి దిగిపోతాయి.
Речи су опадачеве као избијених, али силазе унутра у трбух.
9 ౯ పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న.
И ко је немаран у послу свом брат је распикући.
10 ౧౦ యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.
Тврда је кула име Господње. К Њему ће побећи праведник, и биће у високом заклону.
11 ౧౧ ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.
Богатство је богатом јак град и као висок зид у његовој мисли.
12 ౧౨ విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది.
Пред пропаст подиже се срце човека, а пре славе иде смерност.
13 ౧౩ సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.
Ко одговара пре него чује, томе је лудост и срамота.
14 ౧౪ వ్యాధి కలిగినా మనిషి ఆత్మ వైపుకుని నిలబడుతుంది. ఆత్మే నలిగిపోతే భరించడమెలా?
Дух човечији сноси бол свој; а дух оборен ко ће подигнути?
15 ౧౫ తెలివి గలవారి హృదయం జ్ఞానాన్ని అన్వేషిస్తుంది. వివేకి అస్తమానం దాని పైనే గురి పెట్టుకుంటాడు.
Срце разумног човека добавља знање, и ухо мудрих тражи знање.
16 ౧౬ ఒక మనిషి ఇచ్చే కానుక తలుపులు తెరుస్తుంది. దాని సాయంతో అతడు గొప్పవారిని కలుసుకుంటాడు.
Дар човеку шири место и води га пред властеље.
17 ౧౭ వ్యాజ్యంలో మొదట మాట్లాడిన వాడి మాటలు సరైనవిగా కనిపిస్తాయి. అయితే అతని ప్రత్యర్థి వచ్చాక గానీ విషయం తేట పడదు.
Праведан се чини ко је први у својој распри, али кад дође ближњи његов, испитује се.
18 ౧౮ చీట్లు వేస్తే వివాదం సమసిపోతుంది. బలమైన వారిని అది ఊరుకోబెడుతుంది.
Распре прекида жреб, и између силних расуђује.
19 ౧౯ పటిష్టమైన నగరాన్ని వశపరచుకోవడం కంటే అలిగిన సోదరుణ్ణి సముదాయించడం కష్టం. పోట్లాటలు కోట తలుపుల అడ్డగడియలంత గట్టివి.
Увређен је брат као тврд град, и свађа је као преворница на двору.
20 ౨౦ ఒకడి కడుపు నిండడం అతని నోటి మాటలను బట్టే ఉంటుంది. తన పెదవుల పంట కోత మూలంగా అతడు తృప్తిచెందుతాడు.
Сваком се трбух сити плодом уста његових, дохотком од усна својих сити се.
21 ౨౧ జీవన్మరణాలు నాలుక వశం. దాన్ని ఇష్టపడే వారు దాని ఫలం అనుభవిస్తారు.
Смрт је и живот у власти језику, и ко га милује, јешће плод његов.
22 ౨౨ భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.
Ко је нашао жену, нашао је добро и добио љубав од Господа.
23 ౨౩ నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.
Сиромах говори молећи, а богат одговара оштро.
24 ౨౪ ఎక్కువ మంది స్నేహితులున్న వాడికి నష్టం. అయితే సోదరుని కన్నా సన్నిహితంగా ఉండే మిత్రులు కూడా ఉంటారు.
Ко има пријатеља, ваља да поступа пријатељски, јер има пријатеља вернијих од брата.