< సామెతలు 15 >
1 ౧ సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.
answer tender to return: turn back rage and word toil to ascend: establish face: anger
2 ౨ జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.
tongue wise be good knowledge and lip fool to bubble folly
3 ౩ యెహోవా కళ్ళు లోకమంతా చూస్తూ ఉంటాయి. చెడ్డవాళ్ళని, మంచివాళ్ళని అవి చూస్తూ ఉంటాయి.
in/on/with all place eye LORD to watch bad: evil and pleasant
4 ౪ మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.
healing tongue tree life and crookedness in/on/with her breaking in/on/with spirit
5 ౫ మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.
fool(ish) to spurn discipline father his and to keep: look at argument be shrewd
6 ౬ నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.
house: home righteous wealth many and in/on/with produce wicked to trouble
7 ౭ జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.
lips wise to scatter knowledge and heart fool not right
8 ౮ భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.
sacrifice wicked abomination LORD and prayer upright acceptance his
9 ౯ దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.
abomination LORD way: conduct wicked and to pursue righteousness to love: lover
10 ౧౦ సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు.
discipline bad: harmful to/for to leave: forsake way to hate argument to die
11 ౧౧ మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా? (Sheol )
hell: Sheol and Abaddon before LORD also for heart son: child man (Sheol )
12 ౧౨ అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.
not to love: lover to mock to rebuke to/for him to(wards) wise not to go: went
13 ౧౩ ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
heart glad be good face and in/on/with injury heart spirit stricken
14 ౧౪ తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.
heart to understand to seek knowledge (and lip *Q(K)*) fool to pasture folly
15 ౧౫ దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.
all day afflicted bad: evil and pleasant heart feast continually
16 ౧౬ విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.
pleasant little in/on/with fear LORD from treasure many and tumult in/on/with him
17 ౧౭ ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
pleasant ration herb and love there from cattle to fatten and hating in/on/with him
18 ౧౮ ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.
man rage to stir up strife and slow face: anger to quiet strife
19 ౧౯ సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
way: conduct sluggish like/as hedge briar and way upright to build
20 ౨౦ జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.
son: child wise to rejoice father and fool man to despise mother his
21 ౨౧ బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.
folly joy to/for lacking heart and man understanding (to smooth *L(abh)*) to go: walk
22 ౨౨ సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.
to break plot in/on/with nothing counsel and in/on/with abundance to advise to arise: establish
23 ౨౩ సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!
joy to/for man in/on/with answer lip his and word in/on/with time his what? pleasant
24 ౨౪ వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు. (Sheol )
way life to/for above [to] to/for be prudent because to turn aside: depart from hell: Sheol beneath (Sheol )
25 ౨౫ గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.
house: home proud to pull LORD and to stand border: boundary widow
26 ౨౬ దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి.
abomination LORD plot bad: evil and pure word pleasantness
27 ౨౭ లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.
to trouble house: household his to cut off: to gain unjust-gain and to hate gift to live
28 ౨౮ నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.
heart righteous to mutter to/for to answer and lip wicked to bubble bad: evil
29 ౨౯ భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.
distant LORD from wicked and prayer righteous to hear: hear
30 ౩౦ కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.
light eye to rejoice heart tidings pleasant to prosper bone
31 ౩౧ జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.
ear to hear: hear argument life in/on/with entrails: among wise to lodge
32 ౩౨ క్రమశిక్షణ అంగీకరించని వాడు తనను తాను ద్వేషించు కుంటున్నాడు. దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకం గలవాడు.
to neglect discipline to reject soul: myself his and to hear: hear argument to buy heart
33 ౩౩ యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.
fear LORD discipline: instruction wisdom and to/for face: before glory humility