< సామెతలు 14 >
1 ౧ జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది.
智慧妇人建立家室; 愚妄妇人亲手拆毁。
2 ౨ యెహోవాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు.
行动正直的,敬畏耶和华; 行事乖僻的,却藐视他。
3 ౩ మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి.
愚妄人口中骄傲,如杖责打己身; 智慧人的嘴必保守自己。
4 ౪ ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది.
家里无牛,槽头干净; 土产加多乃凭牛力。
5 ౫ నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం.
诚实见证人不说谎话; 假见证人吐出谎言。
6 ౬ బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు.
亵慢人寻智慧,却寻不着; 聪明人易得知识。
7 ౭ బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు.
到愚昧人面前, 不见他嘴中有知识。
8 ౮ వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు.
通达人的智慧在乎明白己道; 愚昧人的愚妄乃是诡诈。
9 ౯ మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు.
愚妄人犯罪,以为戏耍; 正直人互相喜悦。
10 ౧౦ ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.
心中的苦楚,自己知道; 心里的喜乐,外人无干。
11 ౧౧ దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది.
奸恶人的房屋必倾倒; 正直人的帐棚必兴盛。
12 ౧౨ ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.
有一条路,人以为正, 至终成为死亡之路。
13 ౧౩ ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు.
人在喜笑中,心也忧愁; 快乐至极就生愁苦。
14 ౧౪ భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు.
心中背道的,必满得自己的结果; 善人必从自己的行为得以知足。
15 ౧౫ తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు.
愚蒙人是话都信; 通达人步步谨慎。
16 ౧౬ జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు.
智慧人惧怕,就远离恶事; 愚妄人却狂傲自恃。
17 ౧౭ తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు.
轻易发怒的,行事愚妄; 设立诡计的,被人恨恶。
18 ౧౮ బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు.
愚蒙人得愚昧为产业; 通达人得知识为冠冕。
19 ౧౯ చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు.
坏人俯伏在善人面前; 恶人俯伏在义人门口。
20 ౨౦ దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది.
贫穷人连邻舍也恨他; 富足人朋友最多。
21 ౨౧ పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే.
藐视邻舍的,这人有罪; 怜悯贫穷的,这人有福。
22 ౨౨ కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి.
谋恶的,岂非走入迷途吗? 谋善的,必得慈爱和诚实。
23 ౨౩ కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి.
诸般勤劳都有益处; 嘴上多言乃致穷乏。
24 ౨౪ ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది.
智慧人的财为自己的冠冕; 愚妄人的愚昧终是愚昧。
25 ౨౫ నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు.
作真见证的,救人性命; 吐出谎言的,施行诡诈。
26 ౨౬ యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది.
敬畏耶和华的,大有倚靠; 他的儿女也有避难所。
27 ౨౭ యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.
敬畏耶和华就是生命的泉源, 可以使人离开死亡的网罗。
28 ౨౮ జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం.
帝王荣耀在乎民多; 君王衰败在乎民少。
29 ౨౯ వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది.
不轻易发怒的,大有聪明; 性情暴躁的,大显愚妄。
30 ౩౦ సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది.
心中安静是肉体的生命; 嫉妒是骨中的朽烂。
31 ౩౧ దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు.
欺压贫寒的,是辱没造他的主; 怜悯穷乏的,乃是尊敬主。
32 ౩౨ కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది.
恶人在所行的恶上必被推倒; 义人临死,有所投靠。
33 ౩౩ తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు.
智慧存在聪明人心中; 愚昧人心里所存的,显而易见。
34 ౩౪ ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది.
公义使邦国高举; 罪恶是人民的羞辱。
35 ౩౫ తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడి పై రాజు కోప పడతాడు.
智慧的臣子蒙王恩惠; 贻羞的仆人遭其震怒。