< సామెతలు 13 >
1 ౧ తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు.
A bölcs fiú enged atyja intésének; de a csúfoló semmi dorgálásnak helyt nem ád.
2 ౨ మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు.
A férfi az ő szájának gyümölcséből él jóval; a hitetlenek lelke pedig bosszúságtétellel.
3 ౩ తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు.
A ki megőrzi az ő száját, megtartja önmagát; a ki felnyitja száját, romlása az annak.
4 ౪ సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
Kivánsággal felindul, de hiába, a restnek lelke; a gyorsak lelke pedig megkövéredik.
5 ౫ నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.
A hamis dolgot gyűlöli az igaz; az istentelen pedig gyűlölségessé tesz és megszégyenít.
6 ౬ నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు.
Az igazság megőrzi azt, a ki útjában tökéletes; az istentelenség pedig elveszíti a bűnöst.
7 ౭ తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు.
Van, a ki hányja gazdagságát, holott semmije sincsen; viszont tetteti magát szegénynek, holott sok marhája van.
8 ౮ ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు.
Az ember életének váltsága lehet az ő gazdagsága; a szegény pedig nem hallja a fenyegetést.
9 ౯ నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది.
Az igazak világossága vígassággal ég; de az istenteleneknek szövétneke kialszik.
10 ౧౦ గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.
Csak háborúság lesz a kevélységből: azoknál pedig, a kik a tanácsot beveszik, bölcseség van.
11 ౧౧ మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.
A hiábavalóságból keresett marha megkisebbül; a ki pedig kezével gyűjt, megőregbíti azt.
12 ౧౨ కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది.
A halogatott reménység beteggé teszi a szívet; de a megadatott kivánság életnek fája.
13 ౧౩ హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు.
Az igének megútálója megrontatik; a ki pedig féli a parancsolatot, jutalmát veszi.
14 ౧౪ జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు.
A bölcsnek tanítása életnek kútfeje, a halál tőrének eltávoztatására.
15 ౧౫ మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.
Jó értelem ád kedvességet; a hitetleneknek pedig útja kemény.
16 ౧౬ వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.
Minden eszes cselekszik bölcseséggel; a bolond pedig kijelenti az ő bolondságát.
17 ౧౭ దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు.
Az istentelen követ bajba esik; a hívséges követ pedig gyógyulás.
18 ౧౮ క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
Szegénység és gyalázat lesz azon, a ki a fenyítéktől magát elvonja; a ki pedig megfogadja a dorgálást, tiszteltetik.
19 ౧౯ కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.
A megnyert kivánság gyönyörűséges a léleknek, és útálatosság a bolondoknak eltávozniok a gonosztól.
20 ౨౦ జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
A ki jár a bölcsekkel, bölcs lesz; a ki pedig magát társul adja a bolondokhoz, megromol.
21 ౨౧ కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
A bűnösöket követi a gonosz; az igazaknak pedig jóval fizet Isten.
22 ౨౨ న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది.
A jó örökséget hágy unokáinak; a bűnösnek marhái pedig eltétetnek az igaz számára.
23 ౨౩ పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.
Bő étele lesz a szegényeknek az új törésen; de van olyan, a ki igazságtalansága által vész el.
24 ౨౪ బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు.
A ki megtartóztatja az ő vesszejét, gyűlöli az ő fiát; a ki pedig szereti azt, megkeresi őt fenyítékkel.
25 ౨౫ ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు.
Az igaz eszik az ő kivánságának megelégedéséig; az istentelenek hasa pedig szűkölködik.