< సామెతలు 12 >

1 జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.
喜愛管教的,就是喜愛知識; 恨惡責備的,卻是畜類。
2 నీతిమంతుణ్ణి యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు.
善人必蒙耶和華的恩惠; 設詭計的人,耶和華必定他的罪。
3 దుర్మార్గుల వలన అందరూ అల్లకల్లోలం అవుతారు. నీతిమంతుల పునాదులు స్థిరంగా ఉంటాయి.
人靠惡行不能堅立; 義人的根必不動搖。
4 యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిది. భర్తకు సిగ్గు కలిగించే ఇల్లాలు అతని ఎముకలకు పట్టిన కుళ్లు.
才德的婦人是丈夫的冠冕; 貽羞的婦人如同朽爛在她丈夫的骨中。
5 నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.
義人的思念是公平; 惡人的計謀是詭詐。
6 దుర్మార్గుల మాటలు హత్య చేయడానికి కాపు కాసి ఉన్న హంతకుల వంటివి. యథార్థపరుల మాట వల్ల వాళ్ళు విడుదల పొందుతారు.
惡人的言論是埋伏流人的血; 正直人的口必拯救人。
7 దుర్మార్గులు పాడైపోయి లోకంలో లేకుండా పోతారు. నీతిమంతుల నివాసం స్థిరంగా నిలుస్తుంది.
惡人傾覆,歸於無有; 義人的家必站得住。
8 ఒక్కొక్క మనిషి తన బుద్ధి కుశలతను బట్టి ఘనత పొందుతాడు. కపట వర్తనుడు తిరస్కారానికి గురౌతాడు.
人必按自己的智慧被稱讚; 心中乖謬的,必被藐視。
9 తినడానికి లేకపోయినా తన గురించి గొప్పలు చెప్పుకునేవాడి కంటే ఎదో ఒక చిన్న పని-సేవకుడుగా అయినా సరే-చేసుకుంటూ ఉండడం మంచిది.
被人輕賤,卻有僕人, 強如自尊,缺少食物。
10 ౧౦ ఉత్తముడు తమ పశువుల ప్రాణాల పట్ల దయ చూపుతాడు. దుష్టులు చూపించే ప్రేమ క్రూరత్వమే.
義人顧惜他牲畜的命; 惡人的憐憫也是殘忍。
11 ౧౧ తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.
耕種自己田地的,必得飽食; 追隨虛浮的,卻是無知。
12 ౧౨ దుర్మార్గులు చెడ్డవారికి దొరికిన దోపుడు సొమ్ము కోసం ఆశపడతారు. నీతిమంతుల ఉనికి వర్ధిల్లుతుంది.
惡人想得壞人的網羅; 義人的根得以結實。
13 ౧౩ వ్యర్ధమైన మాటల వల్ల కలిగే దోషం ప్రాణాంతకమైన ఉరి వంటిది. నీతిమంతులు ఆపదలను తప్పించుకుంటారు.
惡人嘴中的過錯是自己的網羅; 但義人必脫離患難。
14 ౧౪ మనిషి తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో తృప్తి పొందుతాడు. ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం దక్కుతుంది.
人因口所結的果子,必飽得美福; 人手所做的,必為自己的報應。
15 ౧౫ మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు.
愚妄人所行的,在自己眼中看為正直; 惟智慧人肯聽人的勸教。
16 ౧౬ మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు.
愚妄人的惱怒立時顯露; 通達人能忍辱藏羞。
17 ౧౭ సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు.
說出真話的,顯明公義; 作假見證的,顯出詭詐。
18 ౧౮ కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.
說話浮躁的,如刀刺人; 智慧人的舌頭卻為醫人的良藥。
19 ౧౯ నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.
口吐真言,永遠堅立; 舌說謊話,只存片時。
20 ౨౦ కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.
圖謀惡事的,心存詭詐; 勸人和睦的,便得喜樂。
21 ౨౧ నీతిమంతులకు ఎలాంటి హానీ జరగదు. దుర్మార్గులను కష్టాలు వెంటాడుతుంటాయి.
義人不遭災害;惡人滿受禍患。
22 ౨౨ అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.
說謊言的嘴為耶和華所憎惡; 行事誠實的,為他所喜悅。
23 ౨౩ వివేకం ఉన్నవాడు తన ప్రతిభను దాచిపెడతాడు. తెలివితక్కువ వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని బయట పెడతారు.
通達人隱藏知識; 愚昧人的心彰顯愚昧。
24 ౨౪ ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.
殷勤人的手必掌權; 懶惰的人必服苦。
25 ౨౫ విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
人心憂慮,屈而不伸; 一句良言,使心歡樂。
26 ౨౬ ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.
義人引導他的鄰舍; 惡人的道叫人失迷。
27 ౨౭ సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.
懶惰的人不烤打獵所得的; 殷勤的人卻得寶貴的財物。
28 ౨౮ నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు.
在公義的道上有生命; 其路之中並無死亡。

< సామెతలు 12 >