< సామెతలు 10 >

1 జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.
ソロモンの箴言 智慧ある子は父を欣ばす 愚なる子は母の憂なり
2 భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.
不義の財は益なし されど正義は救ひて死を脱かれしむ
3 ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.
ヱホバは義者の霊魂を餓ゑしめず 惡者にその欲するところを得ざらしむ
4 శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.
手をものうくして動くものは貧くなり 勤めはたらく者の手は富を得
5 బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.
夏のうちに斂むる者は智き子なり 収穫の時にねむる者は辱をきたす子なり
6 నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.
義者の首には福祉きたり 惡者の口は強暴を掩ふ
7 నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.
義者の名は讃られ 惡者の名は腐る
8 జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.
心の智き者は誡命を受く されど口の頑愚なる者は滅さる
9 నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.
直くあゆむ者はそのあゆむこと安し されどその途を曲ぐる者は知らるべし
10 ౧౦ కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.
眼をもて眴せする者は憂をおこし 口の頑愚なる者は亡さる
11 ౧౧ నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు.
義者の口は生命の泉なり 惡者の口は強暴を掩ふ
12 ౧౨ ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.
怨恨は爭端をおこし 愛はすべての愆を掩ふ
13 ౧౩ వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.
哲者のくちびるには智慧あり 智慧なき者の背のためには鞭あり
14 ౧౪ జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.
智慧ある者は知識をたくはふ 愚かなる者の口はいまにも滅亡をきたらす
15 ౧౫ ధనవంతుల ఆస్తి వారికి ఆశ్రయం కలిగించే కోట. దరిద్రుని పేదరికం వాడి నాశనానికి కారణం.
富者の資財はその堅き城なり 貧者のともしきはそのほろびなり
16 ౧౬ నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది.
義者が動作は生命にいたり 惡者の利得は罪にいたる
17 ౧౭ బుద్ధిగల మాటలకు లోబడేవాడు తనకు జీవం కలిగించుకుంటాడు. మందలింపుకు సమ్మతించని వాడు దారి తప్పి నాశనం అవుతాడు.
敎をまもる者は生命の道にあり懲戒をすつる者はあやまりにおちいる
18 ౧౮ అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.
怨をかくす者には虚偽のくちびるあり 誹謗をいだす者は愚かなる者なり
19 ౧౯ వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.
言おほけれぼ罪なきことあたはず その口唇を禁むるものは智慧あり
20 ౨౦ ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి.
義者の舌は精銀のごとし 惡者の心は値すくなし
21 ౨౧ నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.
義者の口唇はおほくの人をやしなひ 愚なる者は智慧なきに由て死ぬ
22 ౨౨ యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.
ヱホバの祝福は人を富す 人の勞苦はこれに加ふるところなし
23 ౨౩ మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు.
愚かなる者は惡をなすを戯れごとのごとくす 智慧のさとかる人にとりても是のごとし
24 ౨౪ మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.
惡者の怖るるところは自己にきたり 義者のねがふところはあたへらる
25 ౨౫ సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు.
狂風のすぐるとき惡者は無に歸せん 義者は窮なくたもつ基のごとし
26 ౨౬ సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.
惰る者のこれを遣すものに於るは酢の歯に於るが如く煙の目に於るが如し
27 ౨౭ యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం అధిక ఆయుష్షు ఇస్తుంది. భక్తిహీనుల జీవితకాలం తరిగిపోతూ ఉంటుంది.
ヱホバを畏るることは人の日を多くす されど惡者の年はちぢめらる
28 ౨౮ నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.
義者の望は喜悦にいたり惡者の望は絶べし
29 ౨౯ నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.
ヱホバの途は直者の城となり 惡を行ふものの滅亡となる
30 ౩౦ ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు.
義者は何時までも動かされず 惡者は地に住むことを得じ
31 ౩౧ ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.
義者の口は智慧をいだすなり 虚偽の舌は抜るべし
32 ౩౨ ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి.
義者のくちびるは喜ばるべきことをわきまへ 惡者の口はいつはりを語る

< సామెతలు 10 >