< ఫిలిప్పీయులకు 4 >
1 ౧ కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. నా ఆనందం, నా కిరీటంగా ఉన్న నా ప్రియ మిత్రులారా, ప్రభువులో స్థిరంగా ఉండండి.
Ngakho-ke bazalwane bami, lina engilithandayo lengilikhumbulayo, liyintokozo yami lomqhele wami, kumele liqine kanjalo eNkosini bangane abathandekayo!
2 ౨ ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.
Ngiyamncenga uYuwodiya loSintikhe ukuba bavumelane eNkosini.
3 ౩ అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.
Ngiyakucela mhlobo wami oqotho, siza abesifazane labo abasebenza lami kanzima ngenxa yevangeli, kanye loKlementi labanye engisebenza labo, abalamabizo abo asencwadini yokuphila.
4 ౪ ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
Thokozani eNkosini kokuphela. Ngiyatsho futhi ngithi: Thokozani!
5 ౫ మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.
Ukuthobeka kwenu kakubonakale kubo bonke. INkosi isiseduze.
6 ౬ దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.
Lingakhathazeki kodwa ngazo zonke izikhathi bikani izicelo zenu kuNkulunkulu ngokukhuleka, ngokuncenga langokubonga.
7 ౭ అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
Ukuthula kukaNkulunkulu okudlula ukuqedisisa konke kuzabusa inhliziyo zenu lezingqondo zenu kuKhristu uJesu.
8 ౮ చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.
Okokucina bazalwane, konke okuliqiniso, lokulesithunzi, lokulungileyo, lokuhlambulukileyo, lokuhle, lokubukekayo, nxa ulutho luluhle kakhulu loba lubongeka, cabangani ngezinto ezinje.
9 ౯ మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
Loba kuyini elikufundileyo loba elikwamukeleyo loba elikuzwileyo kuvela kimi, loba elikubonileyo kimi, kwenzeni. UNkulunkulu wokuthula uzakuba lani.
10 ౧౦ నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు.
Ngiyathokoza kakhulu eNkosini ngokuthi khathesi selize lavuselela ukungikhathalela kwenu. Impela kade likhathazeka kodwa lingelalo ithuba lokukubonakalisa.
11 ౧౧ నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను.
Kangitsho lokhu ngenxa yokuthi ngiyaswela ngoba sengafunda ukwaneliseka kuyo yonke imimo.
12 ౧౨ అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను.
Ngiyakwazi ukuba ukuswela kuyini njalo ngiyakwazi ukuba kuyini ukuba lokunengi. Sengafunda imfihlo yokwaneliseka kuzozonke izimo, langabe ngiyasutha loba ngilambile, loba ngilokunengi kumbe ngiswela.
13 ౧౩ నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
Ngingazenza zonke izinto ngaye onginika amandla.
14 ౧౪ అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు.
Kodwa kwakukuhle ukuthi lihlanganyele lami ekuhluphekeni kwami.
15 ౧౫ ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు.
Phezu kwalokho, lina bantu baseFiliphi liyakwazi ukuthi ensukwini elaqala ngazo ukwazi ivangeli ngesikhathi ngisuka eMasedoniya, akukho lalinye ibandla elahlanganyela lami endabeni yokupha lokwamukela ngaphandle kwenu kuphela;
16 ౧౬ ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు.
ngoba langesikhathi ngiseThesalonika langithumela usizo kanengi lapho ngidinga uncedo.
17 ౧౭ నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను.
Akusikuthi ngifuna isipho kodwa ngifuna okuzakuba yinzuzo kini.
18 ౧౮ నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి.
Sengamukele umvuzo ogcweleyo lodlulisileyo; ngiphiwe okwaneleyo njengoba khathesi sengamukele ku-Ephafrodithusi izipho elazithumelayo. Zingumnikelo wephunga elimnandi, umhlatshelo owamukelekayo lothokozisa uNkulunkulu.
19 ౧౯ కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.
UNkulunkulu wami uzakugcwalisa konke ukuswela kwenu ngenkazimulo yenotho yakhe kuKhristu uJesu.
20 ౨౦ ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగు గాక. ఆమేన్. (aiōn )
Udumo kalube kuNkulunkulu uBaba kuze kube nini lanini. Ameni. (aiōn )
21 ౨౧ పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో పాటు ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు.
Bingelelani bonke abangcwele abakuKhristu. Abazalwane abalami bayalibingelela.
22 ౨౨ పవిత్రులంతా, ముఖ్యంగా సీజర్ చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు.
Abangcwele bonke bayalibingelela, ikakhulu labo abangabendlu kaKhesari.
23 ౨౩ ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.
Umusa weNkosi uJesu Khristu kawube lomoya wenu.