< ఫిలేమోనుకు 1 >

1 మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు,
Paulo, prisioneiro de Cristo Jesus, e Timóteo nosso irmão, para Filemon, nosso amado companheiro de trabalho,
2 మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.
para a amada Áfia, para Arquipo nosso companheiro de soldado, e para a assembléia em sua casa:
3 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
Graça a vós e paz de Deus nosso Pai e do Senhor Jesus Cristo.
4 ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.
Agradeço sempre ao meu Deus, fazendo menção a você em minhas orações,
5
ouvir de seu amor e da fé que você tem para com o Senhor Jesus e para com todos os santos,
6 విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
para que a comunhão de sua fé se torne efetiva no conhecimento de cada coisa boa que há em nós em Cristo Jesus.
7 సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.
Pois temos muita alegria e conforto em teu amor, porque os corações dos santos foram refrescados através de ti, irmão.
8 అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ,
Portanto, embora eu tenha toda a ousadia em Cristo para ordenar-vos o que é apropriado,
9 ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.
ainda assim, por amor, eu prefiro apelar para vós, sendo um tal de Paulo, o idoso, mas também um prisioneiro de Jesus Cristo.
10 ౧౦ నేను నా బిడ్డ ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు.
eu vos peço por meu filho Onésimo, de quem me tornei o pai em minhas correntes,
11 ౧౧ గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు.
que outrora foi inútil para vós, mas agora é útil para vós e para mim.
12 ౧౨ నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను.
Estou enviando-o de volta. Portanto, recebei-o, isto é, meu próprio coração,
13 ౧౩ నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీ పక్షాన నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను
a quem desejei manter comigo, para que em vosso nome ele possa me servir nas minhas correntes para a Boa Nova.
14 ౧౪ అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనాన్ని బలవంతంగా కాక నీకు ఇష్టపూర్వకంగా ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం.
Mas eu não estava disposto a fazer nada sem seu consentimento, que sua bondade não seria por necessidade, mas por livre arbítrio.
15 ౧౫ బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు. (aiōnios g166)
Pois talvez ele tenha sido separado de você por um tempo para que você o tivesse para sempre, (aiōnios g166)
16 ౧౬ ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు.
não mais como escravo, mas mais do que escravo, um irmão amado - especialmente para mim, mas quanto mais para você, tanto na carne quanto no Senhor.
17 ౧౭ అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో.
Se então você me considerar um parceiro, receba-o como você me receberia.
18 ౧౮ ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి.
Mas se ele o enganou ou lhe deve alguma coisa, coloque isso na minha conta.
19 ౧౯ పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు.
Eu, Paul, escrevo isto com minha própria mão: Eu o reembolsarei (para não mencionar que você me deve até mesmo a si mesmo).
20 ౨౦ ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.
Sim, irmão, deixe-me ter alegria de você no Senhor. Refresque meu coração no Senhor.
21 ౨౧ నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.
Tendo confiança em sua obediência, escrevo-lhe, sabendo que você fará até mesmo além do que eu disser.
22 ౨౨ సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.
Também, prepare um quarto de hóspedes para mim, pois espero que através de suas orações eu seja restaurado a você.
23 ౨౩ క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా,
Epáfras, meu companheiro de prisão em Cristo Jesus, vos saúda,
24 ౨౪ అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.
como fazem Marcos, Aristarco, Demas e Lucas, meus companheiros de trabalho.
25 ౨౫ మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. ఆమెన్.
A graça de nosso Senhor Jesus Cristo esteja com seu espírito. Amém.

< ఫిలేమోనుకు 1 >