< ఫిలేమోనుకు 1 >
1 ౧ మా ప్రియ సోదరుడు, జతపనివాడు అయిన ఫిలేమోనుకు,
Paul a prisoner of Iesus Christ, and our brother Timotheus, vnto Philemon our deare friende, and fellowe helper,
2 ౨ మన సోదరి అప్ఫియకు, మన సాటి సైనికుడు అర్ఖిప్పుకు, నీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.
And to our deare sister Apphia, and to Archippus our fellowe souldier, and to the Church that is in thine house:
3 ౩ మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
Grace be with you, and peace from God our Father, and from the Lord Iesus Christ.
4 ౪ ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.
I giue thanks to my God, making mention alwaies of thee in my praiers,
(When I heare of thy loue and faith, which thou hast toward the Lord Iesus, and towarde all Saintes)
6 ౬ విశ్వాసంలో నీవు పాల్గొనడం క్రీస్తులో మనకు ఉన్న ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం లో మరింత చురుకుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
That the fellowship of thy faith may bee made effectuall, and that whatsoeuer good thing is in you through Christ Iesus, may be knowen.
7 ౭ సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద దీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.
For we haue great ioy and consolation in thy loue, because by thee, brother, the Saintes bowels are comforted.
8 ౮ అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ,
Wherefore, though I bee very bolde in Christ to commaund thee that which is conuenient,
9 ౯ ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.
Yet for loues sake I rather beseeche thee, though I be as I am, euen Paul aged, and euen nowe a prisoner for Iesus Christ.
10 ౧౦ నేను నా బిడ్డ ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు.
I beseeche thee for my sonne Onesimus, whome I haue begotten in my bondes,
11 ౧౧ గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు.
Which in times past was to thee vnprofitable, but nowe profitable both to thee and to me,
12 ౧౨ నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను.
Whome I haue sent againe: thou therefore receiue him, that is mine owne bowels,
13 ౧౩ నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీ పక్షాన నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను
Whom I woulde haue reteined with mee, that in thy steade he might haue ministred vnto me in the bondes of the Gospel.
14 ౧౪ అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనాన్ని బలవంతంగా కాక నీకు ఇష్టపూర్వకంగా ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం.
But without thy minde woulde I doe nothing, that thy benefite should not be as it were of necessitie, but willingly.
15 ౧౫ బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు. (aiōnios )
It may be that he therefore departed for a season, that thou shouldest receiue him for euer, (aiōnios )
16 ౧౬ ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు.
Not now as a seruant, but aboue a seruant, euen as a brother beloued, specially to me: howe much more then vnto thee, both in the flesh and in the Lord?
17 ౧౭ అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో.
If therefore thou count our thinges common, receiue him as my selfe.
18 ౧౮ ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి.
If he hath hurt thee, or oweth thee ought, that put on mine accounts.
19 ౧౯ పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు.
I Paul haue written this with mine owne hande: I will recompense it, albeit I doe not say to thee, that thou owest moreouer vnto me euen thine owne selfe.
20 ౨౦ ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.
Yea, brother, let mee obteine this pleasure of thee in the Lord: comfort my bowels in the Lord.
21 ౨౧ నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.
Trusting in thine obedience, I wrote vnto thee, knowing that thou wilt do eue more then I say.
22 ౨౨ సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.
Moreouer also prepare mee lodging: for I trust through your prayers I shall be freely giuen vnto you.
23 ౨౩ క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా,
There salute thee Epaphras my felowe prisoner in Christ Iesus,
24 ౨౪ అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.
Marcus, Aristarchus, Demas and Luke, my felowe helpers.
25 ౨౫ మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. ఆమెన్.
The grace of our Lord Iesus Christ be with your spirit, Amen. ‘Written from Rome to Philemon, and send by Onesimus a seruant.’