< సంఖ్యాకాండము 9 >
1 ౧ యెహోవా సీనాయి అరణ్యంలో మోషేతో మాట్లాడాడు. ఇది వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం మొదటి నెలలో జరిగింది. ఆయన ఇలా చెప్పాడు.
Szóla pedig az Úr Mózesnek, a Sinai pusztájában, az Égyiptom földéből való kijövetelöknek második esztendejében, az első hónapban, mondván:
2 ౨ “ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండగను దానికి నిర్ధారించిన తేదీల్లో ఆచరించాలి.
Izráel fiai pedig készítsék el a páskhát a maga idejében.
3 ౩ దాన్ని నిర్ధారించిన కాలం ఈ నెల పద్నాలుగో రోజు. ఆ రోజు సాయంత్రం మీరు పస్కా జరుపుకోవాలి. దాన్ని ఆచరించాలి. దానికి సంబంధించిన నియమాలను, ఆదేశాలను తప్పక పాటించాలి.”
E hónapnak tizennegyedik napján, estennen készítsék el azt a maga idejében. Minden ő rendtartása szerint, és minden ő szertartása szerint készítsétek el azt.
4 ౪ కాబట్టి మోషే పస్కా పండగను ఆచరించాలని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు.
Szóla azért Mózes Izráel fiainak, hogy készítsék el a páskhát.
5 ౫ దాంతో సీనాయి అరణ్యంలో ఆ మొదటి నెలలో పద్నాలుగో రోజు సాయంత్రం వారు పస్కా ఆచరించారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు.
És elkészíték a páskhát az első hónapban, a hónapnak tizennegyedik napján estennen, a Sinai pusztájában; mindent úgy cselekedének Izráel fiai, a mint az Úr parancsolta vala Mózesnek.
6 ౬ కొంతమంది చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకి అపవిత్రులయ్యారు. కాబట్టి ఆ రోజు వారు పస్కా ఆచరించలేక పోయారు.
Valának pedig némelyek, a kik tisztátalanok valának holtember illetése miatt, és nem készítheték meg a páskhát azon a napon: járulának azért Mózes elé és Áron elé azon a napon.
7 ౭ ఆ వ్యక్తులు మోషే దగ్గరకి వచ్చి “మేము చనిపోయిన వ్యక్తి కారణంగానే కదా అపవిత్రులమయ్యాం. ఈ సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు బలి అర్పించకుండా మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు?” అని అడిగారు.
És mondának azok az emberek néki: Mi tisztátalanok vagyunk holtember illetése miatt; miért tiltatunk meg, hogy ne vigyünk áldozatot az Úrnak a maga idejében Izráel fiai között?
8 ౮ దానికి మోషే “కాస్త ఆగండి. మీ గురించి యెహోవా ఏం చెబుతాడో విందాం.” అని జవాబిచ్చాడు.
És monda nékik Mózes: Legyetek veszteg, míglen megértem: mit parancsol az Úr ti felőletek?
9 ౯ అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
Szóla pedig az Úr Mózesnek, mondván:
10 ౧౦ “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ‘మీలో ఎవరైనా లేదా మీ సంతానంలో ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడైనా, లేదా దూర ప్రయాణంలో ఉన్నా ఆ వ్యక్తి పస్కాను ఆచరించ వచ్చు.’
Szólj Izráel fiainak, mondván: Ha valaki holtember illetése miatt tisztátalan, vagy messze úton leend közületek, vagy a ti utódaitok közül, mindazáltal készítsen páskhát az Úrnak.
11 ౧౧ వారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంత్రం పస్కా ఆచరించాలి. పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలు, చేదు ఆకు కూరలతో తినాలి.
A második hónapnak tizennegyedik napján, estennen, készítsék el azt; kovásztalan kenyérrel és keserű füvekkel egyék meg azt.
12 ౧౨ మర్నాటి ఉదయానికి దానిలో దేన్నీ మిగల్చకూడదు. దాని ఎముకల్లో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాకి సంబంధించిన నియమాలన్నిటినీ వారు పాటించాలి.
Ne hagyjanak meg abból semmit reggelig, és annak csontját meg ne törjék; a páskhának minden rendtartása szerint készítsék el azt.
13 ౧౩ అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే.
A mely ember pedig tiszta, vagy nincs útban, és elmulasztja a páskhát elkészíteni: irtassék ki az ilyen az ő népe közül; mert az Úrnak áldozatát nem vitte fel annak idejében; viselje az ilyen ember az ő bűnének terhét.
14 ౧౪ మీ మధ్య నివసించే విదేశీయుడు ఎవరైనా యెహోవా గౌరవం కోసం పస్కాని ఆచరించాలనుకుంటే అతడు ఆయన ఆదేశాలను అనుసరించాలి. నియమాలను అనుసరించే పస్కా ఆచరించాలి. పస్కా అనుసరించే విషయంలో మీ దేశంలో పుట్టిన వాడికీ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒకే విధానం ఉండాలి.”
Hogyha pedig jövevény tartózkodik köztetek, és páskhát készít az Úrnak, a páskhának rendtartása szerint és annak szertartásai szerint készítse azt; egy rendtartástok legyen néktek, mind a jövevénynek, mind a föld lakosának.
15 ౧౫ మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది.
A hajlék felállításának napján pedig befedezé a felhő a hajlékot, a bizonyság sátorát; és estve a hajlék felett vala, tűznek ábrázatjában reggelig.
16 ౧౬ అది ఎల్లప్పుడూ అలాగే కనిపించింది. మేఘం మందిరాన్ని కమ్మి రాత్రిలో అగ్నిలా కనిపించింది.
Úgy vala szüntelen: A felhő borítja vala azt; és tűznek ábrázatja éjjel.
17 ౧౭ గుడారం పైనుండి ఆ మేఘం పైకి వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించేవారు. ఆ మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నిలిచి గుడారాలు వేసుకునేవారు.
Mihelyt pedig felszáll vala a felhő a sátorról, azonnal elindulnak vala Izráel fiai; és azon a helyen, a hol a felhő megáll vala, ott ütnek vala tábort Izráel fiai.
18 ౧౮ యెహోవా ఆదేశాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం సాగించారు. ఆయన ఆదేశాల ప్రకారం గుడారాలు వేసుకుని నిలిచి పోయారు. మందిరం పైన మేఘం నిలిచినప్పుడు తమ శిబిరంలో ఉండే వారు.
Az Úr szava szerint mennek vala Izráel fiai, és az Úr szava szerint táboroznak vala; mind addig, míg a felhő áll vala a hajlékon, táborban maradnak vala.
19 ౧౯ ఆ మేఘం ఒకవేళ ఎక్కువ రోజులు మందిరం పైన ఉండిపోతే యెహోవా ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేవారు కాదు.
Még ha a felhő sok napig nyugszik vala a hajlékon, akkor is megtartják vala Izráel fiai az Úr rendelését, és nem indulának.
20 ౨౦ కొన్నిసార్లు మేఘం కొన్ని రోజులు మాత్రమే మందిరం పైన నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోయే వారు. యెహోవా ఆదేశాల మేరకు గుడారాలు వేసుకుని తిరిగి ఆయన ఆదేశాల ప్రకారం ప్రయాణమయ్యే వారు.
Megesék, hogy a felhő kevés napon át lőn a hajlékon: akkor is az Úr szava szerint maradnak vala táborban, és az Úr szava szerint indulnak vala.
21 ౨౧ కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి మర్నాటి ఉదయం వరకూ ఉండేది. అప్పుడు ఉదయం మేఘం వెళ్ళగానే ప్రయాణం మొదలు పెట్టేవారు. ఒకవేళ మేఘం ఒక పగలూ ఒక రాత్రీ ఉంటే ఆ మేఘం వెళ్ళిన తరువాత మాత్రమే ప్రయాణం చేసేవారు.
Megesék, hogy a felhő estvétől fogva ott lőn reggelig; mikor azért reggel a felhő felszáll vala, akkor indulnak vala el; vagy egy nap és egy éjjel lőn ott; mikor azért a felhő felszáll vala, ők is indulának.
22 ౨౨ ఆ మేఘం రెండు రోజులు గానీ, ఒక నెల గానీ, లేదా ఒక సంవత్సరం గానీ మందిరం పైన నిలిచి పొతే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయకుండా తమ గుడారాల్లో ఉండి పోయారు. ఆ మేఘం వెళ్లి పోయిన తరువాత మాత్రమే ప్రయాణం చేశారు.
Vagy két napig, vagy egy hónapig, vagy hosszabb ideig lőn ott; a meddig késik vala a felhő a hajlékon, vesztegelvén azon, táborban maradnak vala Izráel fiai is, és nem indulnak vala tovább; mikor pedig az felszáll vala, ők is indulnak vala.
23 ౨౩ యెహోవా ఆదేశాలకు విధేయులై వారు తమ గుడారాలు వేసుకున్నారు. యెహోవా ఆదేశాలకు విధేయులై ప్రయాణం చేశారు. యెహోవా మోషే ద్వారా తమకిచ్చిన ఆదేశాలకు వారు విధేయులయ్యారు.
Az Úr szava szerint járnak vala tábort, és az Úr szava szerint indulnak vala. Az Úrnak rendelését megtartják vala, az Úrnak Mózes által való szava szerint.