< సంఖ్యాకాండము 7 >
1 ౧ మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు.
2 ౨ ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజల నాయకులు, తమ పూర్వీకుల కుటుంబాల పెద్దలు బలులు అర్పించారు. వీరు తమ తమ గోత్రాల ప్రజలను నడిపిస్తున్నవారు. జనాభా లెక్కలను పర్యవేక్షించింది వీరే.
3 ౩ వీరు తమ అర్పణలను యెహోవా సమక్షంలోకి తీసుకు వచ్చారు. వీరు ఆరు గూడు బళ్ళూ, పన్నెండు ఎద్దులను తీసుకు వచ్చారు. ఇద్దరు నాయకులకు ఒక బండినీ, ఒక్కొక్కరికీ ఒక ఎద్దునీ తీసుకు వచ్చారు. వీటిని మందిరం ఎదుటికి వారు తీసుకు వచ్చారు.
4 ౪ అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
5 ౫ “వారి దగ్గర నుండి ఈ కానుకలు స్వీకరించు. వాటిని సన్నిధి గుడారంలో సేవకై ఉపయోగించు. ఈ కానుకలను లేవీ వారికప్పగించు. వారిలో ప్రతి వాడి సేవకు తగినట్టుగా వాటిని వాళ్లకివ్వు.”
6 ౬ మోషే ఆ బళ్లనూ ఎద్దులను తీసుకుని వాటిని లేవీ వారికి ఇచ్చాడు.
7 ౭ వాటిలో గెర్షోను వంశం వారికి వారు చేసే సేవ ప్రకారం రెండు బళ్లనూ నాలుగు ఎద్దులను ఇచ్చాడు.
8 ౮ యాజకుడు అహరోను కొడుకు ఈతామారు పర్యవేక్షణ లో పనిచేసే మెరారి వంశస్తులకి వారు చేసే సేవను బట్టి నాలుగు బళ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు.
9 ౯ అయితే కహాతు వాళ్లకి ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే వారి సేవ అంతా మందిరంలోని సామగ్రికీ వస్తువులకీ సంబంధించింది. వాటిని వారు తమ భుజాలపై మోసుకు వెళ్ళాలి. కాబట్టి వారికి బళ్ళు ఇవ్వలేదు.
10 ౧౦ మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.
11 ౧౧ యెహోవా మోషేకి “బలిపీఠం అభిషేకం కోసం అర్పణలు తీసుకు రావడానికి ప్రతి నాయకుడికీ ఒక్కో రోజు కేటాయించు” అని ఆదేశించాడు.
12 ౧౨ మొదటి రోజు అర్పణం తెచ్చింది యూదా గోత్రం వాడూ, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.
13 ౧౩ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ, 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.
14 ౧౪ వీటితో పాటు పది తులాల బరువున్న పాత్రను సాంబ్రాణితో నింపి అర్పించాడు.
15 ౧౫ ఇంకా అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.
16 ౧౬ పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు.
17 ౧౭ రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక ఏడాది వయసున్న ఐదు గొర్రె పిల్లలను శాంతిబలిగా సమర్పించాడు. ఇవి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను తెచ్చిన అర్పణం.
18 ౧౮ రెండో రోజు అర్పణం తెచ్చింది ఇశ్శాఖారు వంశంలో నాయకుడూ, సూయారు కొడుకూ అయిన నెతనేలు.
19 ౧౯ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన సన్నని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.
20 ౨౦ అతడింకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను ఇచ్చాడు.
21 ౨౧ దహన బలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న గొర్రె పిల్లనూ ఇచ్చాడు.
22 ౨౨ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.
23 ౨౩ అలాగే అతడు శాంతిబలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది సూయారు కొడుకు నెతనేలు తెచ్చిన అర్పణం.
24 ౨౪ మూడో రోజు జెబూలూను వంశస్తులకు నాయకుడూ హేలోను కొడుకూ అయిన ఏలీయాబు తన అర్పణ తీసుకు వచ్చాడు.
25 ౨౫ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
26 ౨౬ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
27 ౨౭ ఇంకా దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ ఇచ్చాడు.
28 ౨౮ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును ఇచ్చాడు.
29 ౨౯ శాంతి బలిగా రెండు ఎద్దులను, ఐదు పోట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను తీసుకు వచ్చాడు. ఇది హేలోను కొడుకు ఏలీయాబు తెచ్చిన అర్పణం.
30 ౩౦ నాలుగో రోజు రూబేను వంశస్తుల నాయకుడూ, షెదేయూరు కొడుకూ అయిన ఏలీసూరు తన అర్పణ తీసుకు వచ్చాడు.
31 ౩౧ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండా నూనెతో కలిపిన మెత్తని పిండిని నైవేద్య అర్పణగా ఉంచాడు.
32 ౩౨ ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
33 ౩౩ అతడు దహనబలిగా ఒక ఎద్దునూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక మగ గొర్రెపిల్లనూ తీసుకువచ్చాడు.
34 ౩౪ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు.
35 ౩౫ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్ళనూ ఐదు మేకపోతులను, ఐదు మగ గొర్రెపిల్లలను శాంతిబలి అర్పణగా తీసుకువచ్చాడు. ఇది షెదేయూరు కొడుకు ఏలీసూరు అర్పణం.
36 ౩౬ ఐదో రోజు షిమ్యోను వంశస్తుల నాయకుడూ, సూరీషదాయి కొడుకూ అయిన షెలుమీయేలు తన అర్పణం తీసుకు వచ్చాడు.
37 ౩౭ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెను, 70 తులాల బరువున్న వెండి పాత్రను, సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
38 ౩౮ ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
39 ౩౯ ఇతడు దహనబలిగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రె పిల్లనూ తీసుకువచ్చాడు.
40 ౪౦ ఒక మేకపోతును పాపం కోసం చేసే బలిగా ఇచ్చాడు.
41 ౪౧ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది సూరీషదాయి కొడుకు షెలుమీయేలు అర్పణం.
42 ౪౨ ఆరో రోజు గాదు వంశస్తులకు నాయకుడూ, దెయూవేలు కొడుకు ఎలీయాసాపా తన అర్పణ తీసుకువచ్చాడు.
43 ౪౩ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
44 ౪౪ ఇంకా సాంబ్రాణితో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
45 ౪౫ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.
46 ౪౬ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
47 ౪౭ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది దెయూవేలు కొడుకు ఎలీయాసాపా అర్పణం.
48 ౪౮ ఏడో రోజు ఎఫ్రాయిము వంశస్తులకు నాయకుడూ, అమీహూదు కొడుకూ అయిన ఎలీషామా తన అర్పణ తీసుకువచ్చాడు.
49 ౪౯ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
50 ౫౦ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
51 ౫౧ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లను తీసుకు వచ్చాడు.
52 ౫౨ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
53 ౫౩ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణం.
54 ౫౪ ఎనిమిదో రోజు మనష్శే వంశస్తుల నాయకుడూ, పెదాసూరు కొడుకూ అయిన గమలీయేలు తన అర్పణ తీసుకువచ్చాడు.
55 ౫౫ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
56 ౫౬ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్ర ఒకదాన్ని తీసుకువచ్చాడు.
57 ౫౭ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
58 ౫౮ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
59 ౫౯ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది పెదాసూరు కొడుకు గమలీయేలు అర్పణం.
60 ౬౦ తొమ్మిదో రోజు బెన్యామీను వంశస్తులకి నాయకుడూ, గిద్యోనీ కొడుకూ అయిన అబీదాను తన అర్పణ తీసుకు వచ్చాడు.
61 ౬౧ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
62 ౬౨ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
63 ౬౩ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
64 ౬౪ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
65 ౬౫ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణం.
66 ౬౬ పదో రోజు దాను వంశస్తులకి నాయకుడూ, అమీషదాయి కొడుకూ అయిన అహీయెజెరు తన అర్పణ తీసుకు వచ్చాడు.
67 ౬౭ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
68 ౬౮ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
69 ౬౯ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
70 ౭౦ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
71 ౭౧ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లను, ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణం.
72 ౭౨ పదకొండో రోజు ఆషేరు వంశస్తుల నాయకుడూ, ఒక్రాను కొడుకూ అయిన పగీయేలు తన అర్పణ తీసుకు వచ్చాడు.
73 ౭౩ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
74 ౭౪ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు.
75 ౭౫ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
76 ౭౬ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
77 ౭౭ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఒక్రాను కొడుకు పగీయేలు అర్పణం.
78 ౭౮ పన్నెండో రోజు నఫ్తాలీ వంశస్తులకి నాయకుడూ, ఏనాను కొడుకూ అయిన అహీరా.
79 ౭౯ అతడు పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం 130 తులాల బరువున్న వెండి గిన్నెనూ 70 తులాల బరువున్న వెండి పళ్ళేన్నీ సమర్పించాడు. ఈ రెంటి నిండుగా నైవేద్య అర్పణ కోసం నూనె కలిపిన మెత్తని గోదుమ పిండిని తెచ్చాడు.
80 ౮౦ ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకువచ్చాడు.
81 ౮౧ అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు.
82 ౮౨ పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు.
83 ౮౩ ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది ఏనాను కొడుకు అహీరా అర్పణం. బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణలు ఇవి. వెండి గిన్నెలు పన్నెండు, వెండి ప్రోక్షణపాత్రలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు, ప్రతి వెండి గిన్నె నూట ముప్ఫై తులాల బరువు ఉంది.
84 ౮౪ మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలు నాయకులు వీటన్నిటినీ ప్రతిష్టించారు. వారు పన్నెండు వెండి గిన్నెలను, పన్నెండు వెండి పాత్రలను, పన్నెండు బంగారు పాత్రలను ప్రతిష్టించారు. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్భై తులాల బరువున్నది. ఆ ఉపకరణాల వెండి అంతా పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం రెండు వేల నాలుగువందల తులాల బరువు.
85 ౮౫ ప్రతి వెండి గిన్నే 130 తులాలు, ప్రతి పాత్రా 70 తులాల బరువైనవి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం మొత్తం వెండి పాత్రలన్నీ 2, 400 తులాల బరువు ఉన్నాయి.
86 ౮౬ సాంబ్రాణితో నిండిన బంగారు పాత్రలు పన్నెండు ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం ఒక్కొక్కటి పది తులాల బరువుంది. మొత్తం బంగారం 120 తులాలుంది.
87 ౮౭ దహనబలి కింద వారు పన్నెండు ఎద్దులను, పన్నెండు పొట్టేళ్లనూ ఒక సంవత్సరం వయసున్న పన్నెండు మగ గొర్రెలను ప్రతిష్టించారు. తమ నైవేద్య అర్పణ అర్పించారు. పాపం కోసం బలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. పశువులన్నీ పన్నెండు కోడెలు, పొట్టేళ్లు పన్నెండు, ఏడాది గొర్రెపిల్లలు పన్నెండు, వాటి నైవేద్యాలు పాపపరిహారం కోసం మగ మేక పిల్లలు పన్నెండు, సమాధానబలి పశువులు ఇరవై నాలుగు కోడెలు,
88 ౮౮ వారి పశువులన్నిటిలో నుండి 24 ఎద్దులను, 60 పొట్టేళ్లనూ 60 మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న 60 మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా అర్పించారు.
89 ౮౯ యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.