< సంఖ్యాకాండము 35 >
1 ౧ యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.
The Lord spoke to Moses on the plains of Moab beside the Jordan opposite Jericho. He told him,
2 ౨ “తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.
“Order the Israelites to provide from their land allocation towns for the Levites to live in and pastures around the towns.
3 ౩ అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి.
The towns are for them to live in, and the pastures will be for their herds and their flocks—for all their livestock.
4 ౪ మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు,
The pastures around the towns you give to the Levites are to extend out from the wall a thousand cubits on all sides.
5 ౫ ఆ పట్టణాల బయట నుండి తూర్పున రెండు వేల మూరలు, దక్షిణాన రెండు వేల మూరలు, పడమర రెండు వేల మూరలు, ఉత్తరాన రెండు వేల మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి.
Measure two thousand cubits outside the town on the east, two thousand on the south, two thousand on the west, and two thousand on the north, with the town in the middle. These areas will be their pastures around the towns.
6 ౬ మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి.
Six of the towns you give the Levites are to be sanctuary towns, where a person who kills someone can run for protection. As well as these towns, give the Levites forty-two more.
7 ౭ వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
The total number of towns you are to give the Levites is forty-eight, along with their pastures.
8 ౮ మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి.”
The towns that you allocate to be given to the Levites from the territory of the Israelites will be more from a larger tribe and less from a smaller one. The number will be in proportion to the size of the land allocation of each tribe.”
9 ౯ యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
The Lord told Moses,
10 ౧౦ మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్లిన తరవాత
“Tell the Israelites: ‘When you cross over the Jordan into Canaan,
11 ౧౧ ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి.
choose towns as your sanctuary towns, so a person who kills someone by mistake may run there.
12 ౧౨ పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.
These towns will be for you places of sanctuary from those seeking revenge, so that the killer will not die until they are tried in court.
13 ౧౩ మీరు ఆరు పట్టణాలను ఆశ్రయ పురాలుగా ఇవ్వాలి.
The towns you choose will be your six sanctuary towns.
14 ౧౪ వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలు, కనాను దేశంలో మూడు పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి.
Choose three cities on the other side of the Jordan and three in Canaan as cities of refuge.
15 ౧౫ ఎవరినైనా పొరబాటున చంపిన వాడు వాటిలోకి పారిపోయేలా ఆ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి.
These six cities will be places of sanctuary for the Israelites and for foreigners or settlers among them, so that anyone who kills a person by mistake may run there.
16 ౧౬ ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
But if anyone deliberately hits someone with something made of iron and kills them, that person is a murderer and must be executed.
17 ౧౭ ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
If anyone picks up something made of stone that could be used as a weapon and hits someone with it, and kills them, that person is a murderer and must be executed.
18 ౧౮ అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతి కర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి.
If anyone picks up something made of wood that could be used as a weapon and hits someone with it, and kills them, that person is a murderer and must be executed.
19 ౧౯ హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.
The avenger is to execute the murderer. When he finds the murderer, he is to kill him.
20 ౨౦ ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి.
Similarly, if anyone hates someone and knocks them down or deliberately throws something at them, and they're killed;
21 ౨౧ ప్రతికారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు.
or if someone hits another with his hand and they die, the one who hit him must be executed because he is a murderer. When the avenger finds the murderer, he is to kill him.
22 ౨౨ అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా, పొంచి ఉండకుండాా వాడిమీద ఏ ఆయుధమైనా విసిరినా ఒకడు చనిపోయేలా వాడిమీద రాయి విసిరినా,
But if anyone knocks someone else down without meaning to and without hating them, or throws something at them not meaning to hurt them,
23 ౨౩ దెబ్బతిన్న వాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగపట్ట లేదు, వాడికి హాని చేసే ఉద్దేశం లేదు.
or carelessly drops a heavy stone that kills them, but not as an enemy or intending to harm them,
24 ౨౪ కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి.
then the community must judge between the killer and the avenger following these regulations.
25 ౨౫ ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్ళీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అక్కడే నివసించాలి.
The court is to protect the killer from being attacked by the avenger and must return him to the sanctuary town that he ran to, and he must stay there until the death of the high priest, who was anointed with holy oil.
26 ౨౬ అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే
But if the killer ever leaves the limits of sanctuary town where they ran to,
27 ౨౭ నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు.
and the avenger finds him them outside his sanctuary town and kills him, then the avenger will not be guilty of murder,
28 ౨౮ ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.
because the killer has to stay in his sanctuary town until the death of the high priest. Only after the death of the high priest are they allowed to return to the land they own.
29 ౨౯ ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ.
These regulations apply to all future generations wherever you live.
30 ౩౦ ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.
If anyone kills a person, the murderer is to be executed based on the evidence given by witnesses, plural. No one is to be executed based on the evidence given by a single witness.
31 ౩౧ హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి.
You are not to accept payment instead of executing a murderer who has been found guilty—they must be executed.
32 ౩౨ ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించకూడదు.
Also you are not allowed to accept payment for a person who runs to a sanctuary town and permit them to return and live on their own land before the death of the high priest.
33 ౩౩ మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.
Don't pollute the land where you live because bloodshed pollutes the land, and the land where blood is shed can't be purified except by the blood of the one who shed it.
34 ౩౪ కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు. ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.”
Don't make the land impure where you live because I live there too. I am the Lord, and I live with the Israelites.”