< సంఖ్యాకాండము 34 >

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
Potem PAN powiedział do Mojżesza:
2 ‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.
Rozkaż synom Izraela i powiedz im: Gdy wejdziecie do ziemi Kanaan, to jest ziemia, która wam przypadnie jako dziedzictwo, ziemia Kanaan w swoich granicach;
3 మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.
Wasza południowa granica będzie od pustyni Syn wzdłuż granic Edomu, a granica południowa pobiegnie od brzegu Morza Słonego, od wschodu.
4 మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.
Granica ta skręci od południa ku Maale-Akrabbim i pobiegnie aż do Syn, i dojdzie od południa do Kadesz-Barnea. Stamtąd pobiegnie do Chasar-Addar i przejdzie aż do Asmon.
5 అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.
A ta granica skręci od Asmon aż do rzeki Egiptu, a skończy się przy morzu.
6 మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
Jako zachodnią granicę będziecie mieli Morze Wielkie – ono będzie waszą zachodnią granicą.
7 మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,
A to będzie wasza północna granica: od Morza Wielkiego wymierzycie sobie do góry Hor.
8 హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,
Potem od góry Hor wymierzycie granicę aż do wejścia do Hemat; a krańce tej granicy sięgną do Sedada.
9 అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
Następnie granica ta pobiegnie aż do Zifronu, a skończy się w Chasar-Enan. To będzie wasza północna granica.
10 ౧౦ తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.
A wschodnią granicę wymierzycie od Chasar-Enan do Szefam.
11 ౧౧ అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.
Granica ta pobiegnie od Szefam aż do Ribla, od wschodu Ain; i ta granica zejdzie w dół, i dosięgnie brzegu morza Kinneret od wschodu.
12 ౧౨ అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”
Następnie ta granica zejdzie ku Jordanowi, a zakończy się przy Morzu Słonym. To będzie wasza ziemia ze swymi granicami wokoło.
13 ౧౩ మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.
Wtedy Mojżesz rozkazał synom Izraela: To jest ziemia, którą odziedziczycie przez losowanie, którą PAN rozkazał dać dziewięciu i pół pokoleniu.
14 ౧౪ ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.
Bo pokolenie synów Rubena według domów swych ojców i pokolenie synów Gada według domów swych ojców już otrzymały swoje dziedzictwo i połowa pokolenia Manassesa już otrzymała swoje dziedzictwo.
15 ౧౫ అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు.
Te dwa i pół pokolenia otrzymały swoje dziedzictwo po tej stronie Jordanu, naprzeciw Jerycha, na wschodzie.
16 ౧౬ అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
I PAN powiedział do Mojżesza:
17 ౧౭ “ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.
Oto imiona mężczyzn, którzy rozdzielą wam ziemię: kapłan Eleazar i Jozue, syn Nuna.
18 ౧౮ వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
Weźmiecie też po jednym naczelniku z każdego pokolenia do rozdzielenia ziemi w dziedzictwo.
19 ౧౯ వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,
A oto imiona tych mężczyzn: z pokolenia Judy – Kaleb, syn Jefunnego.
20 ౨౦ షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,
Z pokolenia synów Symeona – Samuel, syn Ammihuda.
21 ౨౧ బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.
Z pokolenia Beniamina – Eliad, syn Kislona.
22 ౨౨ దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.
Z pokolenia synów Dana – naczelnik Bukki, syn Jogliego.
23 ౨౩ యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
Z synów Józefa, z pokolenia synów Manassesa – naczelnik Channiel, syn Efoda;
24 ౨౪ ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,
A z pokolenia synów Efraima – naczelnik Kemuel, syn Sziftana.
25 ౨౫ జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,
Z pokolenia Zebulona – naczelnik Elisafan, syn Parnacha.
26 ౨౬ ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
Z pokolenia synów Issachara – naczelnik Paltiel, syn Azzana.
27 ౨౭ ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.
Z pokolenia synów Aszera – naczelnik Achihud, syn Szelomiego.
28 ౨౮ నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”
A z pokolenia synów Neftalego – naczelnik Pedahel, syn Ammihuda.
29 ౨౯ వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.
To są ci, którym PAN rozkazał rozdzielić dziedzictwo synom Izraela w ziemi Kanaan.

< సంఖ్యాకాండము 34 >