< సంఖ్యాకాండము 34 >
1 ౧ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
2 ౨ ‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.
Pavēli Israēla bērniem un saki tiem: kad jūs uz Kanaāna zemi nākat, tad šī būs tā zeme, kas jums kritīs par īpašumu: Kanaāna zeme pēc savām robežām.
3 ౩ మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.
Tad nu dienvidu mala lai jums ir no Cin tuksneša pie Edoma sāniem, un dienvidu robeža lai jums ir no sāls jūras gala pret rītiem.
4 ౪ మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.
Un lai tā robeža iet apkārt no dienvidiem(Negebas) uz Akrabu kalniem un lai iet pāri uz Cin, un lai iziet uz Kādeš Barneas dienvidu pusi, un lai iet uz Acar Adaru un iet cauri līdz Acmonam.
5 ౫ అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.
Un tad šai robežai būs iet apkārt no Acmona uz Ēģiptes upi, un viņas gals lai ir pie jūras.
6 ౬ మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
Vakara pusē lai tā lielā jūra jums ir par robežu, - šī lai jums ir tā vakaru robeža.
7 ౭ మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,
Un šī lai jums ir tā ziemeļu robeža: no tās lielās jūras jums būs mērot līdz Hora kalnam.
8 ౮ హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,
No Hora kalna jums būs mērot, kamēr nāk uz Amatu, un tā robeža lai noiet uz Cedadu.
9 ౯ అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
Un tā robeža lai stiepjas uz Zifronu, un viņas gals lai ir Enana ciems; šī lai jums ir tā ziemeļu robeža.
10 ౧౦ తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.
Un par robežu pret rītiem jums būs mērot no Enana ciema līdz Šefamam.
11 ౧౧ అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.
Un šī robeža lai nostiepjas no Šefama uz Riblu, Aīnam pret rītiem; pēc lai tā robeža nostiepjas un iet gar Ķinneretes jūras malu pret rītiem.
12 ౧౨ అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”
Un šī robeža lai nostiepjas gar Jardāni, un viņas gals lai ir sāls jūra. Šī nu lai jums ir tā zeme pēc savām robežām visapkārt.
13 ౧౩ మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.
Un Mozus pavēlēja Israēla bērniem un sacīja: šī ir tā zeme, ko jums caur meslošanu būs par īpašumu dabūt, ko Tas Kungs ir pavēlējis dot tām deviņām ciltīm un tai pusciltij.
14 ౧౪ ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.
Jo Rūbena bērnu cilts pēc saviem tēvu namiem un Gada bērnu cilts pēc saviem tēvu namiem un Manasus puscilts savu daļu ir dabūjušas.
15 ౧౫ అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు.
Divas ciltis un viena puscilts savu īpašumu ir dabūjušas šaipus Jardānes, no Jērikus pret rītiem, pret austrumu.
16 ౧౬ అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
Un Tas Kungs runāja uz Mozu un sacīja:
17 ౧౭ “ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.
Šie ir to vīru vārdi, kas to zemi jums lai izdala: Eleazars, tas priesteris, un Jozuas, Nuna dēls.
18 ౧౮ వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
Un no ikvienas cilts jums būs ņemt vienu virsnieku pie zemes izdalīšanas.
19 ౧౯ వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,
Un šie ir to vīru vārdi: no Jūda cilts Kālebs, Jefunna dēls,
20 ౨౦ షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,
Un no Sīmeana bērnu cilts Šemuēls, Amiuda dēls,
21 ౨౧ బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.
Un no Benjamina cilts Elidus, Ķislona dēls,
22 ౨౨ దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.
Un no Dana bērnu cilts virsnieks Būkus, Jagla dēls,
23 ౨౩ యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
No Jāzepa bērniem, no Manasus cilts virsnieks Hanniēls, Efoda dēls,
24 ౨౪ ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,
Un no Efraīma bērnu cilts virsnieks Ķemuēls, Šiftana dēls,
25 ౨౫ జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,
Un no Zebulona bērnu cilts virsnieks Elicafans, Parnaka dēls,
26 ౨౬ ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
Un no Īsašara bērnu cilts virsnieks Paltiēls, Asana dēls,
27 ౨౭ ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.
Un no Ašera bērnu cilts virsnieks Aķiuds, Zelona dēls,
28 ౨౮ నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”
Un no Naftalus bērnu cilts virsnieks Pedaēls, Amiuda dēls.
29 ౨౯ వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.
Šie ir tie, kam Tas Kungs pavēlējis Israēla bērniem izdalīt to īpašumu Kanaāna zemē.