< సంఖ్యాకాండము 33 >
1 ౧ మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
Wọ̀nyí ni ìrìnàjò àwọn ọmọ Israẹli ní ẹsẹẹsẹ, nígbà tí wọ́n tí ilẹ̀ Ejibiti jáde wá pẹ̀lú àwọn ogun wọn, nípa ọwọ́ Mose àti Aaroni.
2 ౨ యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
Mose sì kọ̀wé ìjáde lọ wọn ní ẹsẹẹsẹ gẹ́gẹ́ bí ìrìnàjò wọn, nípa àṣẹ Olúwa, wọ̀nyí sì ni ìrìnàjò wọn gẹ́gẹ́ bí ìjáde lọ wọn.
3 ౩ మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
Àwọn ọmọ Israẹli jáde kúrò láti Ramesesi ní ọjọ́ kẹ́ẹ̀dógún oṣù kìn-ín-ní, ọjọ́ kan lẹ́yìn àjọ ìrékọjá. Wọ́n yan jáde pẹ̀lú ìgboyà níwájú gbogbo àwọn ará Ejibiti.
4 ౪ ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
Tí wọ́n sì ń sin gbogbo àkọ́bí wọn, ẹni tí Olúwa ti gbé lulẹ̀ láàrín wọn; nítorí tí Olúwa ti mú ẹ̀san wá sórí àwọn òrìṣà wọn.
5 ౫ ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
Àwọn ọmọ Israẹli kúrò ní Ramesesi wọ́n sì pàgọ́ sí Sukkoti.
6 ౬ సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
Wọ́n kúrò ní Sukkoti, wọ́n sì pàgọ́ sí Etamu, ní ẹ̀bá aginjù.
7 ౭ ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
Wọ́n kúrò ní Etamu, wọ́n padà sí Pi-Hahirotu sí ìlà-oòrùn Baali-Ṣefoni, wọ́n sì pàgọ́ sí ẹ̀bá Migdoli.
8 ౮ పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
Wọ́n sì dìde láti lọ kúrò ní iwájú Pi-Hahirotu, wọ́n sì la àárín òkun kọjá lọ sí aginjù. Wọ́n sì rin ìrìn ọjọ́ mẹ́ta ní aginjù Etamu, wọ́n sì pàgọ́ sí Mara.
9 ౯ ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
Wọ́n kúrò ní Mara wọ́n sì lọ sí Elimu, níbi tí orísun omi méjìlá àti igi ọ̀pẹ àádọ́rin gbé wà, wọ́n sì pàgọ́ níbẹ̀.
10 ౧౦ ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
Wọ́n kúrò ní Elimu wọ́n sì pàgọ́ sí ẹ̀bá Òkun Pupa.
11 ౧౧ అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
Wọ́n kúrò ní ẹ̀bá Òkun Pupa wọ́n sì pàgọ́ sínú aginjù Sini.
12 ౧౨ సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
Wọ́n kúrò nínú aginjù Sini wọ́n sì pàgọ́ sí aginjù Dofka.
13 ౧౩ దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
Wọ́n kúrò ní Dofka wọ́n sì pàgọ́ ní Aluṣi.
14 ౧౪ ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
Wọ́n kúrò ní Aluṣi wọ́n sì pàgọ́ ní Refidimu níbi tí kò sí omi fún àwọn ènìyàn náà láti mu.
15 ౧౫ రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
Wọ́n kúrò ní Refidimu wọ́n sì pàgọ́ ní aginjù Sinai.
16 ౧౬ అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
Wọ́n kúrò ní aginjù Sinai wọ́n sì pàgọ́ ní Kibirotu-Hattaafa.
17 ౧౭ కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
Wọ́n kúrò ní Kibirotu-Hattaafa wọ́n sì pàgọ́ ní Haserotu.
18 ౧౮ హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
Wọ́n kúrò ní Haserotu wọ́n sì pàgọ́ ní Ritma.
19 ౧౯ రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
Wọ́n kúrò ní Ritma wọ́n sì pàgọ́ ní Rimoni-Peresi.
20 ౨౦ రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
Wọ́n kúrò ní Rimoni-Peresi wọ́n sì pàgọ́ ní Libina.
21 ౨౧ లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
Wọ́n kúrò ní Libina wọ́n sì pàgọ́ ní Rissa.
22 ౨౨ రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
Wọ́n kúrò ní Rissa wọ́n sì pàgọ́ ní Kehelata.
23 ౨౩ కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
Wọ́n kúrò ní Kehelata wọ́n sì pàgọ́ ní orí òkè Ṣeferi.
24 ౨౪ షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
Wọ́n kúrò lórí òkè Ṣeferi wọ́n sì pàgọ́ ní Harada.
25 ౨౫ హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
Wọ́n kúrò ní Harada wọ́n sì pàgọ́ ní Makhelotu.
26 ౨౬ మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
Wọ́n kúrò ní Makhelotu wọ́n sì pàgọ́ ní Tahati.
27 ౨౭ తాహతు నుండి తారహుకు వచ్చారు.
Wọ́n kúrò ní Tahati wọ́n sì pàgọ́ ní Tẹra.
28 ౨౮ తారహు నుండి మిత్కాకు వచ్చారు.
Wọ́n kúrò ní Tẹra wọ́n sì pàgọ́ ní Mitka.
29 ౨౯ మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
Wọ́n kúrò ní Mitka wọ́n pàgọ́ ní Haṣmona.
30 ౩౦ హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
Wọ́n kúrò ní Haṣmona wọ́n sì pàgọ́ ní Moserotu.
31 ౩౧ మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
Wọ́n kúrò ní Moserotu wọ́n sì pàgọ́ ní Bene-Jaakani.
32 ౩౨ బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
Wọ́n kúrò ní Bene-Jaakani wọ́n sì pàgọ́ ní Hori-Haggidgadi.
33 ౩౩ హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
Wọ́n kúrò ní Hori-Haggidgadi wọ́n sí pàgọ́ ní Jotbata.
34 ౩౪ యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
Wọ́n kúrò ní Jotbata wọ́n sì pàgọ́ ní Abrona.
35 ౩౫ ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
Wọ́n kúrò ní Abrona wọ́n sì pàgọ́ ní Esioni-Geberi.
36 ౩౬ ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
Wọ́n kúrò ní Esioni-Geberi wọ́n sì pàgọ́ ní Kadeṣi nínú aginjù Sini.
37 ౩౭ కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
Wọ́n kúrò ní Kadeṣi wọ́n sì pàgọ́ ní orí òkè Hori, lẹ́bàá Edomu.
38 ౩౮ యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
Nípa àṣẹ Olúwa, Aaroni àlùfáà gùn orí òkè Hori, níbẹ̀ ni ó kú. Ní ọjọ́ kìn-ín-ní oṣù karùn-ún, ọdún ogójì, lẹ́yìn tí àwọn ọmọ Israẹli ti ilẹ̀ Ejibiti jáde wá.
39 ౩౯ అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
Aaroni jẹ́ ẹni ọgọ́fà ọdún ó lé mẹ́ta ní ìgbà tí ó kú sí orí òkè Hori.
40 ౪౦ అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
Àwọn ará Kenaani, ọba Aradi, tí ń gbé ìhà gúúsù ní ilẹ̀ Kenaani gbọ́ pé àwọn ọmọ Israẹli ń bọ̀.
41 ౪౧ వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
Wọ́n kúrò ní orí òkè Hori, wọ́n sì pàgọ́ ní Salmona.
42 ౪౨ సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
Wọ́n kúrò ní Salmona wọ́n sì pàgọ́ ní Punoni.
43 ౪౩ పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
Wọ́n kúrò ní Punoni wọ́n sì pàgọ́ ní Obotu.
44 ౪౪ ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
Wọ́n kúrò ní Obotu wọ́n sì pàgọ́ ní Iye-Abarimu, ní agbègbè Moabu.
45 ౪౫ ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
Wọ́n kúrò ní Iyimu, wọ́n sì pàgọ́ ní Diboni-Gadi.
46 ౪౬ దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
Wọ́n kúrò ní Diboni-Gadi wọ́n sì pàgọ́ ní Alimon-Diblataimu.
47 ౪౭ అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
Wọ́n kúrò ní Alimon-Diblataimu wọ́n sì pàgọ́ sí orí òkè Abarimu lẹ́bàá Nebo.
48 ౪౮ అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
Wọ́n kúrò ní orí òkè Abarimu wọ́n sì pàgọ́ ní pẹ̀tẹ́lẹ̀ Moabu lẹ́bàá Jordani ní ìkọjá Jeriko.
49 ౪౯ వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
Níbí ní pẹ̀tẹ́lẹ̀ Moabu wọ́n pàgọ́ lẹ́gbẹ́ Jordani láti Beti-Jeṣimoti títí dé Abeli-Ṣittimu.
50 ౫౦ యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
Ní pẹ̀tẹ́lẹ̀ Moabu, lẹ́bàá Jordani, létí Jeriko, Olúwa sọ fún Mose pé,
51 ౫౧ “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
“Sọ fún àwọn ọmọ Israẹli kí o sì wí fún wọn pé, ‘Ní ìgbà tí ẹ̀yin bá ń rékọjá odò Jordani lọ sí Kenaani,
52 ౫౨ ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
lé gbogbo àwọn ará ilẹ̀ náà kúrò níwájú yín. Run gbogbo àwòrán ère wọn àti gbogbo ère dídá wọn, kí ẹ sì wó gbogbo ibi gíga wọn palẹ̀.
53 ౫౩ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
Ẹ gba ilẹ̀ náà, kí ẹ̀yin sì máa gbé inú rẹ̀, nítorí èmi ti fi ilẹ̀ náà fún yín gẹ́gẹ́ bí ìní yín.
54 ౫౪ మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
Ẹ̀yin pín ilẹ̀ náà pẹ̀lú kèké, gẹ́gẹ́ bí ìdílé yín. Fún ọ̀pọ̀ ni kí ẹ̀yin ó fi ilẹ̀ ìní púpọ̀ fún, àti fún díẹ̀, ni kí ẹ̀yin kí ó fi ilẹ̀ ìní díẹ̀ fún. Ohunkóhun tí ó bá bọ́ sí ọ̀dọ̀ wọn nípa kèké yóò jẹ́ tiwọn. Pín wọn gẹ́gẹ́ bí ẹ̀yà ìran wọn.
55 ౫౫ అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
“‘Ṣùgbọ́n bí ẹ kò bá lé àwọn ará ilẹ̀ náà kúrò níwájú yín, àwọn tí ẹ bá jẹ́ kí ó kù yóò di ọfà nínú ojú yín, àti ẹ̀gún ní ìhà yín. Wọn yóò fún yín ní wàhálà ní ilẹ̀ náà tí ẹ̀yin yóò gbé.
56 ౫౬ అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”
Nígbà náà, èmi yóò ṣe sí yín, ohun tí mo ti rò láti ṣe sí wọn.’”