< సంఖ్యాకాండము 33 >

1 మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
אלה מסעי בני ישראל אשר יצאו מארץ מצרים לצבאתם ביד משה ואהרן׃
2 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
ויכתב משה את מוצאיהם למסעיהם על פי יהוה ואלה מסעיהם למוצאיהם׃
3 మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
ויסעו מרעמסס בחדש הראשון בחמשה עשר יום לחדש הראשון ממחרת הפסח יצאו בני ישראל ביד רמה לעיני כל מצרים׃
4 ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
ומצרים מקברים את אשר הכה יהוה בהם כל בכור ובאלהיהם עשה יהוה שפטים׃
5 ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
ויסעו בני ישראל מרעמסס ויחנו בסכת׃
6 సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
ויסעו מסכת ויחנו באתם אשר בקצה המדבר׃
7 ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
ויסעו מאתם וישב על פי החירת אשר על פני בעל צפון ויחנו לפני מגדל׃
8 పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
ויסעו מפני החירת ויעברו בתוך הים המדברה וילכו דרך שלשת ימים במדבר אתם ויחנו במרה׃
9 ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
ויסעו ממרה ויבאו אילמה ובאילם שתים עשרה עינת מים ושבעים תמרים ויחנו שם׃
10 ౧౦ ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
ויסעו מאילם ויחנו על ים סוף׃
11 ౧౧ అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
ויסעו מים סוף ויחנו במדבר סין׃
12 ౧౨ సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
ויסעו ממדבר סין ויחנו בדפקה׃
13 ౧౩ దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
ויסעו מדפקה ויחנו באלוש׃
14 ౧౪ ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
ויסעו מאלוש ויחנו ברפידם ולא היה שם מים לעם לשתות׃
15 ౧౫ రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
ויסעו מרפידם ויחנו במדבר סיני׃
16 ౧౬ అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
ויסעו ממדבר סיני ויחנו בקברת התאוה׃
17 ౧౭ కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
ויסעו מקברת התאוה ויחנו בחצרת׃
18 ౧౮ హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
ויסעו מחצרת ויחנו ברתמה׃
19 ౧౯ రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
ויסעו מרתמה ויחנו ברמן פרץ׃
20 ౨౦ రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
ויסעו מרמן פרץ ויחנו בלבנה׃
21 ౨౧ లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
ויסעו מלבנה ויחנו ברסה׃
22 ౨౨ రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
ויסעו מרסה ויחנו בקהלתה׃
23 ౨౩ కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
ויסעו מקהלתה ויחנו בהר שפר׃
24 ౨౪ షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
ויסעו מהר שפר ויחנו בחרדה׃
25 ౨౫ హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
ויסעו מחרדה ויחנו במקהלת׃
26 ౨౬ మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
ויסעו ממקהלת ויחנו בתחת׃
27 ౨౭ తాహతు నుండి తారహుకు వచ్చారు.
ויסעו מתחת ויחנו בתרח׃
28 ౨౮ తారహు నుండి మిత్కాకు వచ్చారు.
ויסעו מתרח ויחנו במתקה׃
29 ౨౯ మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
ויסעו ממתקה ויחנו בחשמנה׃
30 ౩౦ హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
ויסעו מחשמנה ויחנו במסרות׃
31 ౩౧ మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
ויסעו ממסרות ויחנו בבני יעקן׃
32 ౩౨ బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
ויסעו מבני יעקן ויחנו בחר הגדגד׃
33 ౩౩ హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
ויסעו מחר הגדגד ויחנו ביטבתה׃
34 ౩౪ యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
ויסעו מיטבתה ויחנו בעברנה׃
35 ౩౫ ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
ויסעו מעברנה ויחנו בעציון גבר׃
36 ౩౬ ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
ויסעו מעציון גבר ויחנו במדבר צן הוא קדש׃
37 ౩౭ కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
ויסעו מקדש ויחנו בהר ההר בקצה ארץ אדום׃
38 ౩౮ యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
ויעל אהרן הכהן אל הר ההר על פי יהוה וימת שם בשנת הארבעים לצאת בני ישראל מארץ מצרים בחדש החמישי באחד לחדש׃
39 ౩౯ అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
ואהרן בן שלש ועשרים ומאת שנה במתו בהר ההר׃
40 ౪౦ అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
וישמע הכנעני מלך ערד והוא ישב בנגב בארץ כנען בבא בני ישראל׃
41 ౪౧ వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
ויסעו מהר ההר ויחנו בצלמנה׃
42 ౪౨ సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
ויסעו מצלמנה ויחנו בפונן׃
43 ౪౩ పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
ויסעו מפונן ויחנו באבת׃
44 ౪౪ ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
ויסעו מאבת ויחנו בעיי העברים בגבול מואב׃
45 ౪౫ ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
ויסעו מעיים ויחנו בדיבן גד׃
46 ౪౬ దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
ויסעו מדיבן גד ויחנו בעלמן דבלתימה׃
47 ౪౭ అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
ויסעו מעלמן דבלתימה ויחנו בהרי העברים לפני נבו׃
48 ౪౮ అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
ויסעו מהרי העברים ויחנו בערבת מואב על ירדן ירחו׃
49 ౪౯ వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
ויחנו על הירדן מבית הישמת עד אבל השטים בערבת מואב׃
50 ౫౦ యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
וידבר יהוה אל משה בערבת מואב על ירדן ירחו לאמר׃
51 ౫౧ “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
דבר אל בני ישראל ואמרת אלהם כי אתם עברים את הירדן אל ארץ כנען׃
52 ౫౨ ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
והורשתם את כל ישבי הארץ מפניכם ואבדתם את כל משכיתם ואת כל צלמי מסכתם תאבדו ואת כל במתם תשמידו׃
53 ౫౩ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
והורשתם את הארץ וישבתם בה כי לכם נתתי את הארץ לרשת אתה׃
54 ౫౪ మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
והתנחלתם את הארץ בגורל למשפחתיכם לרב תרבו את נחלתו ולמעט תמעיט את נחלתו אל אשר יצא לו שמה הגורל לו יהיה למטות אבתיכם תתנחלו׃
55 ౫౫ అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
ואם לא תורישו את ישבי הארץ מפניכם והיה אשר תותירו מהם לשכים בעיניכם ולצנינם בצדיכם וצררו אתכם על הארץ אשר אתם ישבים בה׃
56 ౫౬ అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”
והיה כאשר דמיתי לעשות להם אעשה לכם׃

< సంఖ్యాకాండము 33 >