< సంఖ్యాకాండము 25 >

1 ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు.
Mikor pedig Sittimben lakozik vala Izráel, kezde a nép paráználkodni Moáb leányaival.
2 ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.
Mert hívogaták a népet az ő isteneik áldozataira; és evék a nép, és imádá azoknak isteneit.
3 ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.
És odaszegődék Izráel Bál-Peórhoz; az Úr haragja pedig felgerjede Izráel ellen.
4 అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట, పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది” అని చెప్పాడు.
És monda az Úr Mózesnek: Vedd elő e népnek minden főemberét, és akasztasd fel őket az Úrnak fényes nappal; hogy elforduljon az Úr haragjának gerjedezése Izráeltől.
5 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో “మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి” అన్నాడు.
Monda azért Mózes Izráel bíráinak: Kiki ölje meg az ő embereit, a kik odaszegődtek Bál-Peórhoz.
6 అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు.
És ímé eljöve valaki Izráel fiai közül, és hoza az ő atyjafiai felé egy midiánbeli asszonyt, Mózes szeme láttára, és Izráel fiai egész gyülekezetének láttára; ők pedig sírnak vala a gyülekezet sátorának nyilásánál.
7 యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి,
És mikor látta vala Fineás, Eleázár fia, Áron papnak unokája, felkele a gyülekezet közül, és dárdáját vevé kezébe.
8 సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.
És beméne az izráelita férfi után a sátorba, és általdöfé mindkettőjöket, mind az izráelita férfit, mind az asszonyt hason. És megszünék a csapás Izráel fiai között.
9 ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.
De meghaltak vala a csapás miatt huszonnégy ezeren.
10 ౧౦ అప్పుడు యెహోవా మోషేతో “యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు,
Akkor szóla az Úr Mózesnek, mondván:
11 ౧౧ వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.
Fineás, Eleázár fia, Áron pap unokája, elfordította az én haragomat Izráel fiaitól, mivelhogy az én bosszúmat megállotta ő közöttök; ezért nem pusztítom ki bosszúmban Izráel fiait.
12 ౧౨ కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను.
Mondd azért: Ímé én az én szövetségemet, a békesség szövetségét adom ő néki.
13 ౧౩ అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు” అన్నాడు.
És lészen ő nála és az ő magvánál ő utána az örökkévaló papságnak szövetsége; mivelhogy bosszút állott az ő Istenéért, és engesztelést végze Izráel fiaiért.
14 ౧౪ ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు.
A megöletett izráelita férfinak neve pedig, a ki a midiánbeli asszonynyal együtt öletett meg, Zimri, a Szálu fia vala, a Simeon-nemzetség háznépének fejedelme.
15 ౧౫ ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.
A megöletett midiánbeli asszony neve pedig Kozbi, Czúr leánya, a ki a Midiániták között az ő atyja háza nemzetségeinek fejedelme vala.
16 ౧౬ ఇంకా యెహోవా మోషేతో “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.
És szóla az Úr Mózesnek, mondván:
17 ౧౭ వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు.
Támadjátok meg a Midiánitákat, és verjétek meg őket,
18 ౧౮ పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.”
Mert ők megtámadtak titeket az ő cselszövéseikkel, a melyeket Peórért és az ő hugokért Kozbiért, a midián fejedelem leányáért szőttek ellenetek, a ki megöletett a Peór miatt való csapásnak napján.

< సంఖ్యాకాండము 25 >