< సంఖ్యాకాండము 25 >
1 ౧ ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు.
Ug mipuyo ang Israel sa Sitim; ug ang katawohan mingsugod sa pagpakighilawas uban sa mga anak nga babaye ni Moab:
2 ౨ ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.
Kay ilang gitawag ang katawohan ngadto sa mga halad sa ilang mga dios; ug ang katawohan mingkaon, ug mingyukbo sa ilang mga dios.
3 ౩ ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.
Ug ang Israel mikuyog sa iyang kaugalingon ngadto kang Baal-Peor: ug ang kaligutgut ni Jehova misilaub batok sa Israel.
4 ౪ అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట, పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది” అని చెప్పాడు.
Ug si Jehova miingon kang Moises: Kuhaon mo ang tanang mga dagkung tawo sa katawohan, ug sila bitayon mo kang Jehova sa atubangan sa nawong sa adlaw, aron ang mabangis nga kaligutgut ni Jehova magapahalayo gikan sa Israel.
5 ౫ కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో “మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి” అన్నాడు.
Ug si Moises miingon sa mga maghuhukom sa Israel: Pamatyon ninyo ang tanan nga mingtipon ngadto kang Baal-Peor, ang tagsatagsa sa iyang kaugalingong tawo.
6 ౬ అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు.
Ug ania karon, usa sa mga anak sa Israel miabut ug nagdala sa usa ka babaye nga Madianhon ngadto sa iyang mga igsoon, diha sa mga mata ni Moises, ug diha sa mga mata sa tibook nga katilingban sa mga anak sa Israel, samtang sila nanagbakho pa didto sa pultahan sa balong-balong nga pagatiguman.
7 ౭ యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి,
Ug sa nakita siya ni Pineas, ang anak nga lalake ni Eleazar, ang anak nga lalake ni Aaron ang sacerdote, mitindog siya sa taliwala sa katilingban ug mikuha ug usa ka bangkaw sa iyang kamot;
8 ౮ సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.
Ug misunod siya sa paglakaw niadtong tawo sa Israel ngadto sa pabiyon, ug giduslak niya silang duruha, ang tawo sa Israel, ug ang babaye nga Madianhon nga gilapsan sa iyang lawas. Sa ingon niana mihunong ang kamatay sa mga anak sa Israel.
9 ౯ ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.
Ug kadtong mga nangamatay pinaagi sa hampak may kaluhaan ug upat ka libo.
10 ౧౦ అప్పుడు యెహోవా మోషేతో “యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు,
Ug si Jehova misulti kang Moises, nga nagaingon:
11 ౧౧ వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.
Si Pineas, ang anak nga lalake ni Eleazar, ang anak nga lalake ni Aaron ang sacerdote, nagpahilayo sa akong kaligutgut gikan sa mga anak sa Israel, nga niana siya nangabugho uban sa akong pangabugho sa taliwala nila, sa ingon niana mao nga wala ko pag-ut-uta ang mga anak sa Israel sa akong pagpangabugho.
12 ౧౨ కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను.
Busa iingon mo: Ania karon, nagahatag ako kaniya sa akong tugon sa pakigdait.
13 ౧౩ అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు” అన్నాడు.
Ug kini mahimo alang kaniya, ug sa iyang kaliwat nga mosunod kaniya, ang tugon sa pagka-sacerdote nga walay katapusan; tungod kay siya adunay kasilag alang sa Dios, ug nagbuhat ug pagtabon sa sala alang sa mga anak sa Israel.
14 ౧౪ ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు.
Karon ang ngalan niadtong tawo sa Israel nga gipatay, siya nga gipatay uban sa babaye nga Madianhon, mao si Simri, ang anak nga lalake ni Salu, usa ka principe sa usa ka balay sa amahan sa taliwala sa banay ni Simeon.
15 ౧౫ ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.
Ug ang ngalan sa babaye nga Madianhon nga gipatay, mao si Cozbi, ang anak nga babaye ni Zur; si Cozbi punoan sa katawohan sa usa ka panimalay sa Madian.
16 ౧౬ ఇంకా యెహోవా మోషేతో “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.
Ug si Jehova misulti kang Moises, nga nagaingon:
17 ౧౭ వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు.
Sakiton ninyo ang mga Madianhon, ug pamatyon ninyo sila;
18 ౧౮ పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.”
Kay sila nanagpalagut kaninyo uban sa ilang mga lalang, nga pinaagi niini sila nanaglimbong kaninyo mahatungod sa butang ni Peor, ug mahatungod sa butang ni Cozbi, ang anak nga babaye sa principe sa Madian, ilang igsoon nga babaye, nga gipatay sa adlaw sa kamatay mahitungod sa butang ni Peor.