< సంఖ్యాకాండము 24 >
1 ౧ ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు ఇంతకు ముందు లాగా శకునం చూడడానికి వెళ్ళకుండా ఎడారి వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు.
Kad opazi Bileam da je Jahvi drago što on blagoslivlja Izraela, ne htjede više ni ići kao prije u potragu za znamenjima, nego se licem okrenu prema pustari.
2 ౨ బిలాము కళ్ళెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల ప్రకారం శిబిరంలో ఉండడం చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చాడు.
Bileam podiže oči i vidje Izraela utaborena po njegovim plemenima. Na nj siđe Duh Božji
3 ౩ అతడు ఇలా ప్రవచించాడు. “బెయోరు కొడుకు బిలాముకు పలుకబోతున్నాడు. కళ్ళు బాగా తెరుచుకున్నవాడు పలకబోతున్నాడు.
i on poče svoju pjesmu te reče: “Proročanstvo Bileama, sina Beorova, proročanstvo čovjeka pronicava pogleda,
4 ౪ అతడు దేవుని మాటలు మాట్లాడతాడు, దేవుని మాటలు వింటాడు. అతడు సర్వశక్తుని దగ్గర నుంచి వచ్చే దర్శనం చూస్తాడు, ఆయన ఎదుట అతడు తన కళ్ళు తెరిచి వంగి నమస్కరిస్తాడు.
proročanstvo onoga koji riječi Božje sluša, koji vidi viđenja Svesilnoga, koji pada i oči mu se otvaraju.
5 ౫ యాకోబూ, నీ గుడారాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఇశ్రాయేలూ, నీ నివాసస్థలాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!
Kako su lijepi ti šatori, Jakove, i stanovi tvoji, Izraele!
6 ౬ అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా, యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి.
Kao dolovi što se steru, kao vrtovi uz obalu rijeke, kao aloje što ih Jahve posadi, kao cedri pokraj voda!
7 ౭ అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది.
Iz potomstva junak mu izlazi, nad mnogim on vlada narodima. Kralj će njegov nadvisit' Agaga, uzdiže se kraljevstvo njegovo.
8 ౮ దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు.
Iz Egipta Bog ga izveo, on je njemu k'o rozi bivola. On proždire narode dušmanske, on njihove kosti drobi.
9 ౯ అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు. అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు? అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక, అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక” అన్నాడు.
Skupio se, polegao poput lava, poput lavice: tko ga podići smije? Blagoslovljen bio tko te blagoslivlje, proklet da je tko tebe proklinje!”
10 ౧౦ అప్పుడు బాలాకు కోపం బిలాము మీద రగిలింది గనక అతడు తన చేతులు చరిచి బిలాముతో “నా శత్రువులను శపించడానికి నిన్ను పిలిపించాను కాని నీవు ఈ మూడుసార్లు వారిని దీవించావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ స్థలానికి తొందరగా వెళ్లు.
I usplamtje srdžbom Balak na Bileama i udari rukom o ruku. “Pozvao sam te da prokuneš moje neprijatelje”, reče Balak Bileamu, “a kad tamo, ti ih blagoslovi evo triput!
11 ౧౧ నేను నిన్ను ఎంతో గొప్పవాణ్ణి చేస్తానని చెప్పాను గాని, నీకు అది దక్కకుండా యెహోవా నిన్ను ఆటంకపరిచాడు” అన్నాడు.
Nosi se odmah u svoj kraj. Bio sam rekao: dostojno ću te počastiti! A eto, Jahve te liši časti.”
12 ౧౨ అందుకు బిలాము బాలాకుతో “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా నా ఇష్టప్రకారం మేలైనా కీడైనా చెయ్యడానికి యెహోవా చెప్పిన మాట మీరలేను,
Nato Bileam odgovori Balaku: “Zar nisam rekao i tvojim glasnicima koje si k meni poslao:
13 ౧౩ యెహోవా ఏం చెప్తాడో అదే పలుకుతానని నువ్వు నా దగ్గరికి పంపించిన నీ వర్తమానికులతో నేను చెప్పలేదా?
'Da mi Balak dadne svoju kuću punu srebra i zlata, ne bih mogao prestupiti zapovijed Jahvinu i po svojoj volji činiti bilo dobro, bilo zlo; ono što kaže Jahve, to ću i ja reći.'
14 ౧౪ కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి” అన్నాడు.
A sada, kad, evo, odlazim k svome narodu, hajde da ti objavim što će ovaj narod učiniti tvome narodu u budućnosti!”
15 ౧౫ బిలాము ప్రవచనం చెప్పాడు. “బెయోరు కొడుకు బిలాము మాట్లాడుతున్నాడు, కనువిప్పు కలిగినవాడు మాట్లాడుతున్నాడు.
I poče svoju pjesmu i reče: “Proročanstvo Bileama, sina Beorova, proročanstvo čovjeka pronicava pogleda,
16 ౧౬ ఇది దేవుని వాక్కులను విన్నవాడి ప్రవచనం. మహాన్నతుని జ్ఞానం తెలిసినవాడి ప్రవచనం. సర్వశక్తుని దర్శనాలు చూసినవాడి ప్రవచనం. ఆయన ఎదుట తెరిచిన కళ్ళతో అతడు వంగి నమస్కారం చేస్తున్నాడు.
proročanstvo onoga koji riječi Božje sluša, koji poznaje mudrost Svevišnjega, koji vidi viđenja Svesilnoga, koji pada i oči mu se otvaraju.
17 ౧౭ నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు. ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది. అతడు మోయాబు నాయకులను పడగొడతాడు. అతడు షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.
Vidim ga, ali ne sada: motrim ga, al' ne iz blizine: od Jakova zvijezda izlazi, od Izraela žezlo se diže. On Moabu razbija bokove i svu djecu Šetovu zatire!
18 ౧౮ ఎదోము, శేయీరు, ఇశ్రాయేలు శత్రువులు స్వాధీనం అవుతారు. వారిని ఇశ్రాయేలీయులు తమ బలం చేత జయిస్తారు.
Edom će njegovim postati posjedom, a Seir zemljom osvojenom. Razvija snagu svoju Izrael,
19 ౧౯ యాకోబు సంతానంలోనుంచి రాజ్యాధికారం వస్తుంది. అతడు వారి పట్టణాల్లో మిగిలిన వారిని నాశనం చేస్తారు” అన్నాడు.
Jakov vlada nad neprijateljima i uništava preživjele iz Ira.”
20 ౨౦ ఇంకా బిలాము అమాలేకీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం. కాని దాని అంతం నాశనమే” అన్నాడు.
Bileam se zagleda u Amaleka te poče svoju pjesmu i reče: “Amalek je prvenac među narodima, ali vječna propast njegov je svršetak.”
21 ౨౧ తరువాత బిలాము కేనీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “నువ్వు నివాసం ఉన్న స్థలం బలమైనది. నీ గూడు బండరాళ్ళల్లో ఉంది.
Onda se zagleda u Kenijce te poče svoju pjesmu i reče: “Tvrd je stan tvoj, Kajine, na timoru ti gnijezdo savijeno!
22 ౨౨ కాని అష్షూరు నిన్ను బందీగా పట్టుకున్నప్పుడు కయీను నాశనమౌతుంది” అన్నాడు.
Al' gnijezdo pripada Beoru; dokle ćeš Ašuru robovati?”
23 ౨౩ అప్పుడు అతడు ప్రవచనంగా చెప్తూ “అయ్యో! దేవుడు ఇలా చేసినప్పుడు ఎవరు బతుకుతారు?
Opet poče svoju pjesmu i reče: “Narodi pomorski sabiru se sa sjevera,
24 ౨౪ కిత్తీము తీరం నుంచి ఓడలు వస్తాయి. అవి అష్షూరు, ఏబెరుల మీద దాడి చేస్తాయి. కిత్తీయులు కూడా నాశనమౌతారు” అన్నాడు.
a brodovlje od strane Kitima. Podjarmljuju Ašur, podjarmljuju Heber, pa i njega će propast stići vječita.”
25 ౨౫ అప్పుడు బిలాము లేచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. బాలాకు కూడా వెళ్ళిపోయాడు.
Potom ustade Bileam te se uputi natrag u svoj kraj. A i Balak ode svojim putem.