< సంఖ్యాకాండము 23 >
1 ౧ అప్పుడు బిలాము బాలాకుతో “ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అన్నాడు.
Balaam dit à Balak: « Construis ici sept autels pour moi, et prépare ici sept taureaux et sept béliers pour moi. »
2 ౨ బిలాము చెప్పినట్టు బాలాకు చేసినప్పుడు, బాలాకు, బిలాము ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతునూ ఒక పొట్టేలునూ దహనబలిగా అర్పించారు.
Balak fit ce que Balaam avait dit; Balak et Balaam offrirent sur chaque autel un taureau et un bélier.
3 ౩ ఇంకా బిలాము బాలాకుతో “బలిపీఠం మీద నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. ఒకవేళ నన్ను కలవడానికి యెహోవా వస్తాడేమో. ఆయన నాకు ఏమి చూపిస్తాడో అది నీకు తెలియజేస్తాను” అని చెప్పి చెట్లు లేని కొండ ఎక్కి వెళ్ళాడు.
Balaam dit à Balak: « Reste près de ton holocauste, et je m'en irai. Peut-être Yahvé viendra-t-il à ma rencontre. Je te dirai tout ce qu'il me montrera. » Il alla jusqu'à une hauteur nue.
4 ౪ దేవుడు బిలామును కలుసుకున్నప్పుడు, బిలాము ఆయనతో “నేను ఏడు బలిపీఠాలు కట్టి, ప్రతి దాని మీద ఒక దున్నపోతు, ఒక పొట్టేలును అర్పించాను” అని చెప్పాడు.
Dieu rencontra Balaam, qui lui dit: « J'ai préparé les sept autels, et j'ai offert un taureau et un bélier sur chaque autel. »
5 ౫ యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు” అన్నాడు.
Yahvé mit une parole dans la bouche de Balaam, et dit: « Retourne chez Balak, et tu parleras ainsi. »
6 ౬ అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు.
Il revint vers lui, et voici, il se tenait près de son holocauste, lui et tous les princes de Moab.
7 ౭ అప్పుడు బిలాము ప్రవచనరీతిగా, “అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి, ‘వచ్చి, నాకోసం యాకోబును శపించు’ అన్నాడు, ‘వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు’ అన్నాడు.
Il reprit sa parabole, et dit, « Balak m'a amené d'Aram, le roi de Moab, depuis les montagnes de l'Orient. Viens, maudis Jacob pour moi. Venez, défiez Israël.
8 ౮ దేవుడు శపించనివారిని నేనెలా శపించను? దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను?
Comment maudirais-je celui que Dieu n'a pas maudit? Comment pourrais-je défier celui que Yahvé n'a pas défié?
9 ౯ రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను. కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను. చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది. వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.
Car, du haut des rochers, je le vois. Depuis les collines, je le vois. C'est un peuple qui habite seul, et ne sera pas répertorié parmi les nations.
10 ౧౦ యాకోబు రేణువులను ఎవరు లెక్కించ గలరు? ఇశ్రాయేలులో నాల్గోవంతునైనా ఎవరు లేక్కించ గలరు? నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు రానివ్వండి. నా జీవిత అంతం ఆయన జనంలా ఉండనివ్వండి” అన్నాడు.
Qui peut compter la poussière de Jacob, ou compter la quatrième partie d'Israël? Laissez-moi mourir de la mort des justes! Que ma dernière fin soit comme la sienne! »
11 ౧౧ బాలాకు బిలాముతో “నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. కాని నువ్వు వారిని దీవించావు” అన్నాడు.
Balak dit à Balaam: « Que m'as-tu fait? Je t'ai pris pour maudire mes ennemis, et voici que tu les as bénis tous. »
12 ౧౨ బిలాము జవాబిస్తూ “యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?” అన్నాడు.
Il prit la parole et dit: « Ne dois-je pas prendre garde de dire ce que Yahvé met dans ma bouche? »
13 ౧౩ అప్పుడు బాలాకు అతనితో “దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి” అని చెప్పి
Balak lui dit: « Viens avec moi dans un autre lieu, où tu pourras les voir. Tu n'en verras qu'une partie, et tu ne les verras pas tous. Maudis-les de là pour moi. »
14 ౧౪ పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి, ఏడు బలిపీఠాలు కట్టించి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.
Il l'emmena dans le champ de Zophim, au sommet du Pisga, bâtit sept autels, et offrit un taureau et un bélier sur chaque autel.
15 ౧౫ అప్పుడు బిలాము బాలాకుతో “నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను” అన్నాడు.
Il dit à Balak: « Reste ici près de ton holocauste, pendant que je rencontre Dieu là-bas. »
16 ౧౬ యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు” అన్నాడు.
L'Éternel rencontra Balaam, lui mit une parole dans la bouche et dit: « Retourne chez Balak, et dis ceci. »
17 ౧౭ అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని అడిగాడు.
Il s'approcha de lui, et voici, il se tenait près de son holocauste, et les princes de Moab avec lui. Balak lui dit: « Qu'a dit Yahvé? »
18 ౧౮ బిలాము ప్రవచనంగా “బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు.
Il reprit sa parabole, et dit, « Lève-toi, Balak, et écoute! Écoute-moi, fils de Zippor.
19 ౧౯ అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు. మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
Dieu n'est pas un homme, pour qu'il mente, ni un fils d'homme, pour qu'il se repente. A-t-il dit, et il ne le fera pas? Ou bien il a parlé, et il ne le fera pas bien?
20 ౨౦ చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది. దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.
Voici, j'ai reçu l'ordre de bénir. Il a béni, et je ne peux pas l'inverser.
21 ౨౧ ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు. వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
Il n'a pas vu d'iniquité en Jacob. Il n'a pas non plus vu de perversité en Israël. Yahvé son Dieu est avec lui. Le cri d'un roi est parmi eux.
22 ౨౨ అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు.
Dieu les fait sortir d'Égypte. Il a pour ainsi dire la force du bœuf sauvage.
23 ౨౩ యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు. ఏ శకునం హాని చెయ్యదు. దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ ‘దేవుడు ఏం చేశాడో చూడు’ అని చెప్పుకోవాలి.
Certes, il n'y a pas d'enchantement chez Jacob; il n'y a pas non plus de divination avec Israël. Il sera dit de Jacob et d'Israël, « Qu'a fait Dieu?
24 ౨౪ చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు, ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది. చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు.
Voici qu'un peuple se lève comme une lionne. Comme un lion, il se soulève. Il ne se couchera pas avant d'avoir mangé la proie, et boit le sang de ceux qui ont été tués. »
25 ౨౫ అప్పుడు బాలాకు బిలాముతో “వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు” అన్నాడు.
Balak dit à Balaam: « Ne les maudis pas du tout et ne les bénis pas du tout. »
26 ౨౬ కాని బిలాము “యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?” అని బాలాకుకు జవాబిచ్చాడు.
Balaam répondit à Balak: « Ne t'ai-je pas dit: Tout ce que l'Éternel dit, je le ferai? »
27 ౨౭ బాలాకు బిలాముతో “నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో” అన్నాడు.
Balak dit à Balaam: « Viens, je vais te conduire dans un autre lieu; peut-être plaira-t-il à Dieu que, de là, tu les maudisses pour moi. »
28 ౨౮ బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి బిలామును తీసుకు పోయాడు.
Balak emmena Balaam au sommet du Peor, qui regarde le désert.
29 ౨౯ బిలాము “ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు.
Balaam dit à Balak: « Construis-moi ici sept autels, et prépare-moi ici sept taureaux et sept béliers. »
30 ౩౦ బిలాము చెప్పినట్టు బాలాకు చేసి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.
Balak fit ce que Balaam avait dit, et il offrit un taureau et un bélier sur chaque autel.