< సంఖ్యాకాండము 2 >

1 యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
上主訓示梅瑟和亞郎說:「
2 “ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.
以色列子民每人應隨自己的旗幟,在自己宗族的標誌下紮營,都向著會幕,在四周稍遠的地方紮營。
3 యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.
在前面,即東方,是猶大軍團紮營的旗幟:猶大子孫的首領是阿米納達布的兒子納赫雄;
4 యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు.
他的部隊登記的,是七萬四千六百。
5 యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.
在其傍紮營的是依撒加爾支派;依撒加爾子孫的首領是族阿爾的兒子乃塔乃耳;
6 నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు.
他的部隊登記的,是五萬四千四百。
7 ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.
隨後是則步隆支派;則步隆子孫的首領是赫隆的兒子厄里雅布;
8 అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు.
他的部隊登記的,是五萬七千四百。
9 యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.
猶大軍團登記的,共計十八萬六千四百;他們應首先出發。
10 ౧౦ దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.
南方是勒烏本軍團紮營的旗幟:勒烏本子孫的首領是舍德烏爾的兒子厄里族爾;
11 ౧౧ అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు.
他的部隊登記的,是四萬六千五百。
12 ౧౨ రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.
在其傍紮營的,是西默盎支派;西默盎子孫的首領是族黎沙待的兒子舍路米耳;
13 ౧౩ అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు.
他的部隊登記的,是五萬九千三百。
14 ౧౪ తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.
隨後是加得支派;加得子孫的首領是勒烏本的兒子厄肋雅撒夫;
15 ౧౫ అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు.
他的部隊登記的,是四萬五千六百五十。
16 ౧౬ కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.
勒烏本軍團登記的,共計十五萬一千四百五十;他們其次出發。
17 ౧౭ సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.
隨後,會幕與肋未營在各營中心啟程前行;各營怎樣紮營,就怎樣出發前行,各依自己的位置,各隨自己的旗幟。
18 ౧౮ ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.
西方是厄弗辣因軍團紮營的旗幟:厄弗辣因子孫的首領是阿米胡得的兒子厄里沙瑪;
19 ౧౯ ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.
他的部隊登記的,是四萬五百。
20 ౨౦ మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
在其傍是默納協支派;默納協子孫的首領是培達族爾的兒子加默里耳;
21 ౨౧ అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.
他的部隊登記的,是三萬二千二百。
22 ౨౨ మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.
隨後是本雅明支派;本雅明子孫的首領是基德敖尼的兒子阿彼丹;
23 ౨౩ అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.
他的部隊登記的,是三萬五千四百。
24 ౨౪ కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.
厄弗辣因軍團登記的,共計十萬八千一百;他們作第三隊出發。
25 ౨౫ దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.
北方是丹軍團紮營的旗幟:丹子孫的首領是阿米沙待的兒子阿希厄則爾;
26 ౨౬ దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు.
他的部隊登記的,是六萬二千七百。
27 ౨౭ అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.
在其傍紮營的是阿協爾支派;阿協爾子孫的首領是敖革蘭的兒子帕革厄耳;
28 ౨౮ అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు.
他的部隊登記的,是四萬一千五百。
29 ౨౯ ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.
隨後是納斐塔里支派;納斐榙里子孫的首領是厄南的兒子阿希辣;
30 ౩౦ నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు.
他的部隊登記的,是五萬三千四百。
31 ౩౧ కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.”
丹軍團登記的,共計十五萬七千六百;他們隨著自己的旗幟,最後出發。」
32 ౩౨ ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.
這就是以色列子民依照家系登記的數目;各營的部隊登記的總數,共六十萬三千五百五十。
33 ౩౩ అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.
照上主對梅瑟所吩咐的,肋未人沒有在以色列子民中登記。
34 ౩౪ ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.
以色列子民全照上主吩咐梅瑟的做了,都隨著自己的旗幟紮營,各隨宗族和家系出發進行。

< సంఖ్యాకాండము 2 >