< సంఖ్యాకాండము 19 >
1 ౧ యెహోవా మోషే అహరోనులతో,
І Господь промовляв до Мойсея та до Аарона, говорячи:
2 ౨ “యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదంటే, ఇశ్రాయేలీయులు కళంకం లేనిదీ, మచ్చ లేనిదీ, ఎప్పుడూ కాడి మోయ్యని ఎర్ర ఆవును నీ దగ్గరికి తీసుకురావాలని వారితో చెప్పు.
„Промовляй до Ізраїлевих синів, і нехай вони ві́зьмуть для тебе безвадну руду ялівку, — що в ній нема вади, що на неї не накладали ярма́.
3 ౩ మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు పాళెం బయటికి దాన్ని తోలుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి.
І дасте її до священика Елеаза́ра, а він виведе її поза та́бір. І заріжуть її перед ним.
4 ౪ యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట ఆ రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి.
І візьме Елеаза́р пальцем своїм її кро́ви, та й покро́пить кров'ю її пе́ред скинії заповіту сім раз.
5 ౫ అతని కళ్ళ ఎదుట ఒకడు ఆ ఆవును కాల్చాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా కాల్చెయ్యాలి.
І спа́литься та я́лівка на його оча́х, — шкура її, і м'ясо її, і кров її з її нечистостями спа́литься.
6 ౬ ఇంకా ఆ యాజకుడు దేవదారు కర్ర, హిస్సోపు, ఎర్రరంగు నూలు తీసుకుని, ఆ ఆవును కాలుస్తున్న మంటల్లో వాటిని వెయ్యాలి.
І ві́зьме священик ке́дрове дерево, і ісо́п та че́рвень, та й кине до сере́дини погорі́лища тієї ялівки.
7 ౭ అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుకుకుని, నీళ్లతో తలస్నానం చేసిన తరువాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
І випере той священик шати свої та обмиє тіло своє в воді, а потім уві́йде до табо́ру. І буде той священик нечистий аж до ве́чора.
8 ౮ దాన్ని కాల్చినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుకుకుని నీళ్లతో తలస్నానం చేసి సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
А той, хто палить її, випере одежу свою в воді й обмиє тіло своє в воді, та й буде нечистий аж до вечора.
9 ౯ ఇంకా శుద్ధుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేసి పాలెం బయట ఒక శుద్ధమైన స్థలంలో పెట్టాలి. ఆ బూడిదను ఇశ్రాయేలీయుల సమాజం కోసం భద్రం చెయ్యాలి. ఆ బూడిద పాపపరిహారార్ధ అర్పణ నుంచి వచ్చింది గనక, పాపం నుంచి శుద్ధీకరణ కోసం వారు ఆ బూడిదను నీళ్ళతో కలుపుతారు.
І збере чистий чоловік по́піл тієї я́лівки, і покладе поза табо́ром в чистому місці, — і буде це для громади Ізраїлевих синів на сховок для очища́льної води, — це жертва за гріх.
10 ౧౦ ఆ ఆవు బూడిదను పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని, సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకూ, వారిల్లో నివాసం ఉంటున్న పరదేశులకూ శాశ్వతమైన శాసనం.
А той, хто збирає попіл тієї ялівки, випере одежу свою, і буде нечистий аж до вечора. І це буде на вічну постанову для Ізраїлевих синів та для прихо́дька, що мешкає серед них тимчасо́во.
11 ౧౧ మానవ శవాన్ని ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
А той, хто доторкається до всякого мертвого тіла люди́ни, то буде нечистий сім день.
12 ౧౨ అతడు మూడో రోజు ఆ నీళ్ళతో పాపశుద్ధి చేసుకుని, ఏడో రోజు శుద్ధుడౌతాడు. అయితే అతడు మూడో రోజు పాపశుద్ధి చేసుకోకపోతే ఏడో రోజు శుద్ధుడు కాడు.
Він очи́ститься тим попелом дня третього та дня сьомого, — і буде чистий. А якщо він не очиститься дня третього та дня сьомого, — не буде чистий.
13 ౧౩ మనిషి శవాన్ని ముట్టుకున్నవాడు ఆ విధంగా పాపశుద్ధి చేసుకోకపోతే అతడు యెహోవా మందిరాన్ని అపవిత్రం చేసినవాడౌతాడు. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక ఆ వ్యక్తిని ఇశ్రాయేలీయుల్లో లేకుండా చెయ్యాలి. అతడు అశుద్ధుడుగానే ఉండిపోతాడు. అతని అశుద్ధత అతని మీద ఉంటుంది.
Кожен, хто дото́ркується до померлого, до тіла люди́ни, що померла, і не очиститься, — він занечи́стив Господню скинію, і буде винищена душа та з Ізраїля, бо очища́льна вода не була покро́плена на нього, — нечистий він буде, нечистість його в ньому.
14 ౧౪ ఎవరైనా ఒక గుడారంలో చనిపోతే, దాని గురించిన చట్టం ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడూ, ఆ గుడారంలో ఉన్నవారూ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటారు.
Оце той зако́н: коли в наметі помре люди́на, то кожен, хто входить до того намету, та все, що в наметі, — буде нечисте сім день.
15 ౧౫ మూత వేయకుండా తెరచి ఉన్న పాత్రలన్నీ అశుద్ధం ఔతాయి.
І кожна відкрита посу́дина, що на ній нема міцно прив'язаного накриття́, нечиста вона.
16 ౧౬ గుడారం బయట కత్తితో నరికిన వాడినైనా, శవాన్నైనా, మనిషి ఎముకనైనా, సమాధినైనా ముట్టుకున్నవాడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు.
А кожен, хто доторкне́ться на поверхні поля до трупа від меча́, або до померлого, або до костей люди́ни, або до гро́бу, — буде нечистий сім день.
17 ౧౭ అశుద్ధుడైన వ్యక్తి కోసం, పాప పరిహారార్థమైన కాలిన బూడిద కొంచెం తీసుకుని ఒక కూజాలో ఉన్న మంచినీళ్ళతో కలపాలి.
І ві́зьмуть для того нечистого — по́роху з погорі́лища жертви за гріх, і наллю́ть на нього живої води до по́суду.
18 ౧౮ తరువాత ఒక శుద్ధుడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళల్లో ముంచి, ఆ గుడారం మీద, దానిలోని ఉపకరణాలు అన్నిటి మీదా, అక్కడున్న మనుషుల మీదా చల్లాలి. ఎముకనుగాని, కత్తితో నరికిన వాణ్ణి గాని, శవాన్నిగాని, సమాధినిగాని ముట్టుకున్న వాడి మీద కూడా దాన్ని చల్లాలి.
А чистий чоловік ві́зьме ісо́пу, і вмочить у ту воду, та й покро́пить на того намета, і на всі посудини, і на душі ті, що були там, та на того, хто дото́ркується до тієї кістки, або до трупа, або до померлого, або до гро́бу.
19 ౧౯ మూడో రోజు, ఏడో రోజూ, శుద్ధుడు అశుద్ధుని మీద దాన్ని చల్లాలి. ఏడో రోజు అతడు పాపశుద్ధి చేసుకుని, తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి, సాయంకాలానికి శుద్ధుడౌతాడు.
І покро́пить той чистий на нечистого дня третього та дня сьомого, та й очистить його сьомого дня. І випере він одежу свою й обмиє в воді, — і стане чистий увечері.
20 ౨౦ ఎవరైనా అశుద్ధుడుగానే ఉండి పాపశుద్ధి చేసుకోడానికి నిరాకరిస్తే, అతడు యెహోవా పరిశుద్ధ స్థలాన్ని అశుద్ధం చేశాడు గనక అలాంటి వాణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. పాపపరిహార జలం అతని మీద చల్ల లేదు గనక అతడు అశుద్ధుడుగానే ఉంటాడు.
А чоловік, що стане нечистим і не очиститься, то буде знищена душа та з-посеред збору, бо він занечи́стив Господню святиню, — очища́льна вода не була кро́плена на нього, нечистий він.
21 ౨౧ ఈ పరిస్థితులకు సంబంధించిన శాశ్వతమైన శాసనం ఏదంటే-పాపపరిహార జలం చల్లేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. పాపపరిహార జలం ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అశుద్ధుడు ముట్టుకున్నదంతా అశుద్ధం
І буде це для них на вічну постанову, а той, хто кропить очища́льну воду, випере одежу свою, а хто доторка́ється до очища́льної води, буде нечистий аж до вечора.
22 ౨౨ దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు.”
А кожен, до кого доторкне́ться нечистий, буде нечистий, а особа, що дото́ркується, буде нечиста аж до вечора“.