< సంఖ్యాకాండము 18 >
1 ౧ యెహోవా అహరోనుతో “పవిత్ర స్థలంలో సేవలో జరిగే పాపాలకు నువ్వూ, నీ కొడుకులూ, నీ వంశం జవాబుదారులు. నువ్వూ, నీ కొడుకులూ మీ యాజకత్వపు పాపాలకు జవాబుదారులు.
Και είπε Κύριος προς τον Ααρών, Συ και οι υιοί σου και ο οίκος του πατρός σου μετά σου θέλετε βαστάζει την ανομίαν του αγιαστηρίου· και συ και οι υιοί σου μετά σου θέλετε βαστάζει την ανομίαν της ιερατείας σας.
2 ౨ ఇంకా, నీ తండ్రి గోత్రం, అంటే లేవీ వంశస్తులైన నీ సహోదరులను నువ్వు దగ్గరికి తీసుకు రావాలి. నువ్వూ నీ కొడుకులూ నిబంధన శాసనాల గుడారం ఎదుట పరిచర్య చేస్తున్నప్పుడు వారు నీతో కలిసి నీకు సాయం చేస్తారు.
Και έτι τους αδελφούς σου, την φυλήν του Λευΐ, την φυλήν του πατρός σου, φέρε μετά σου, διά να ήναι ηνωμένοι μετά σου και να σε υπηρετώσι· συ όμως και οι υιοί σου μετά σου θέλετε υπηρετεί έμπροσθεν της σκηνής του μαρτυρίου.
3 ౩ వారు నీకూ, గుడారం అంతటికీ సేవ చెయ్యాలి. కాని వారూ, మీరూ చనిపోకుండా ఉండాలంటే వారు పవిత్ర స్థలపు ఉపకరణాల దగ్గరకైనా, బలిపీఠం దగ్గరకైనా రాకూడదు.
Και θέλουσι φυλάττει τας φυλακάς σου και τας φυλακάς όλης της σκηνής· μόνον εις τα σκεύη του αγιαστηρίου και εις το θυσιαστήριον δεν θέλουσι πλησιάζει, διά να μη αποθάνωσι μήτε αυτοί μήτε σεις.
4 ౪ వారు నీతో కలిసి సన్నిధి గుడారంలోని సేవంతటి విషయంలో శ్రద్ధ వహించాలి.
Και θέλουσιν είσθαι ηνωμένοι μετά σου και θέλουσι φυλάττει τας φυλακάς της σκηνής του μαρτυρίου κατά πάσας τας υπηρεσίας της σκηνής· και ξένος δεν θέλει σας πλησιάζει.
5 ౫ ఒక బయటి వాడు మీ దగ్గరికి రాకూడదు. ఇకముందు ఇశ్రాయేలీయుల మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్రస్థలం పట్ల, బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి.
Και θέλετε φυλάττει τας φυλακάς του αγιαστηρίου και τας φυλακάς του θυσιαστηρίου, και δεν θέλει είσθαι πλέον οργή εις τους υιούς Ισραήλ.
6 ౬ చూడండి, ఇశ్రాయేలీయుల మధ్య నుంచి లేవీయులైన మీ సహోదరులను నేనే ఎంపిక చేసుకున్నాను. సన్నిధి గుడారపు సేవ చెయ్యడానికి వారిని యెహోవా కోసం మీకు ఒక బహుమానంగా ఇచ్చాను.
Και εγώ, ιδού, έλαβον τους αδελφούς σας τους Λευΐτας εκ μέσου των υιών Ισραήλ· ούτοι είναι δεδομένοι εις εσάς δώρον διά τον Κύριον, διά να εκτελώσι τας υπηρεσίας της σκηνής του μαρτυρίου.
7 ౭ కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి” అన్నాడు.
Συ δε και οι υιοί σου μετά σου θέλετε φυλάττει την ιερατείαν σας εις πάντα τα του θυσιαστηρίου και τα εντός του παραπετάσματος, και θέλετε κάμνει την υπηρεσίαν. Δώρον έδωκα την υπηρεσίαν της ιερατείας σας· και όστις ξένος πλησιάση, θέλει θανατόνεσθαι.
8 ౮ ఇంకా యెహోవా అహరోనుతో “చూడు, ఇశ్రాయేలీయులు నాకు తెచ్చే కానుకలు, పవిత్ర అర్పణల బాధ్యత నీకిచ్చాను. ఈ అర్పణల్లో నీకూ, నీ కొడుకులకూ శాశ్వతంగా భాగం దక్కుతుంది.
Και είπε Κύριος προς τον Ααρών, Ιδού, εγώ έδωκα έτι εις σε την επιστασίαν των υψουμένων προσφορών μου από πάντων των ηγιασμένων παρά των υιών Ισραήλ· εις σε έδωκα αυτά διά το χρίσμα και εις τους υιούς σου εις νόμιμον αιώνιον.
9 ౯ అతి పవిత్రమైన వాటిలో అగ్నిలో పూర్తిగా కాలనివి నీకు చెందుతాయి. వారి నైవేద్యాలన్నిట్లో, వారి పాప పరిహారార్థ బలులన్నిట్లో, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిట్లో, వారు నాకు చెల్లించే పవిత్ర అర్పణలన్నీ నీకు, నీ కొడుకులకూ చెందుతాయి. మీరు వాటిని అతి పవిత్రమైనవిగా ఎంచి తినాలి.
Τούτο θέλει είσθαι σου από των αγιωτάτων εκ των διά πυρός προσφερομένων· πάντα τα δώρα αυτών, πάσαι αι εξ αλφίτων προσφοραί αυτών και πάσαι αι περί αμαρτίας προσφοραί αυτών και πάσαι αι περί ανομίας προσφοραί αυτών, τας οποίας θέλουσιν αποδίδει εις εμέ, αγιώτατα θέλουσιν είσθαι διά σε και διά τους υιούς σου.
10 ౧౦ మీలో ప్రతి మగవాడు ఈ అర్పణలు తినాలి. అవి నాకు ప్రత్యేకించిన అర్పణలుగా మీరు పరిగణించాలి.
Εν τω αγίω των αγίων θέλετε τρώγει αυτά· παν αρσενικόν θέλει τρώγει αυτά· άγια θέλουσιν είσθαι εις σε.
11 ౧౧ ఇంకా వారి దానాల్లో ప్రతిష్టించిందీ, ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి. నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.
Και τούτο είναι σου, η υψουμένη προσφορά εκ των δώρων αυτών, μετά πασών των κινητών προσφορών των υιών Ισραήλ· εις σε έδωκα αυτά και εις τους υιούς σου και εις τας θυγατέρας σου μετά σου εις νόμιμον αιώνιον· πας καθαρός εν τω οίκω σου θέλει τρώγει αυτά.
12 ౧౨ వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను.
Παν το εξαίρετον του ελαίου, και παν το εξαίρετον του οίνου και του σίτου, τας απαρχάς αυτών, όσα προσφέρωσιν εις τον Κύριον, εις σε έδωκα αυτά·
13 ౧౩ వారు తమ దేశపు పంటలన్నిట్లో యెహోవాకు తెచ్చే మొదటి ఫలాలు నీకు చెందుతాయి. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.
Πάντα τα πρωτογεννήματα της γης, όσα φέρωσι προς τον Κύριον, σου θέλουσιν είσθαι πας καθαρός εν τω οίκω σου θέλει τρώγει αυτά.
14 ౧౪ ఇశ్రాయేలీయులు ప్రతిష్ట చేసిన ప్రతిదీ నీకు చెందుతుంది.
Παν καθιέρωμα του Ισραήλ θέλει είσθαι σου.
15 ౧౫ మనుష్యుల్లోగాని, పశువుల్లోగాని, వారు యెహోవాకు అర్పించే ప్రాణులన్నిట్లో ప్రతి తొలిచూలు నీకు చెందుతుంది. అయితే, ప్రజలు తొలిచూలు మగబిడ్డను వెల చెల్లించి తిరిగి సంపాదించుకోవాలి.
Παν διανοίγον μήτραν εκ πάσης σαρκός, το οποίον προσφέρωσι προς τον Κύριον, από ανθρώπου έως κτήνους, σου θέλει είσθαι πλην τα πρωτότοκα των ανθρώπων θέλουσιν εξάπαντος εξαγοράζεσθαι και τα πρωτότοκα των κτηνών των ακαθάρτων θέλουσιν εξαγοράζεσθαι.
16 ౧౬ అపవిత్ర పశువుల తొలిచూలు మగపిల్లను వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాలి. వెల చెల్లించి మళ్ళీ కొనుక్కోవాల్సిన వాటిని పుట్టిన నెల రోజులకు నువ్వు నియమించిన వెల ప్రకారం పవిత్ర మందిరపు తూకంతో ఐదు తులాల వెండి ఇచ్చి వాటిని తిరిగి కొనుక్కోవాలి. అంటే 55 గ్రాములు.
Και όσα πρέπει να εξαγορασθώσιν από ηλικίας ενός μηνός, θέλουσιν εξαγοράζεσθαι κατά την εκτίμησίν σου, διά πέντε σίκλους αργυρίου, κατά τον σίκλον τον άγιον, όστις είναι είκοσι γερά.
17 ౧౭ కాని ఆవు తొలి చూలుని, గొర్రె తొలి చూలుని, మేక తొలి చూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి. కాని వాటి మాంసం నీకు చెందుతుంది.
Τα πρωτότοκα όμως των βοών ή τα πρωτότοκα των προβάτων ή τα πρωτότοκα των αιγών δεν θέλουσιν εξαγοράζεσθαι· άγια είναι· το αίμα αυτών θέλεις ραντίζει επί το θυσιαστήριον, και το πάχος αυτών θέλεις καίει διά προσφοράν γινομένην διά πυρός εις οσμήν ευωδίας προς τον Κύριον.
18 ౧౮ అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది.
Και το κρέας αυτών θέλει είσθαι σου, καθώς το κινητόν στήθος και ο δεξιός ώμος είναι σου.
19 ౧౯ ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన ప్రతిష్ఠార్పణలన్నీ నేను నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా ఇచ్చాను. అది నీకూ, నీతో పాటు నీ సంతానానికీ యెహోవా సన్నిధిలో స్థిరమైన శాశ్వత నిబంధన” అన్నాడు.
Πάσας τας υψουμένας προσφοράς των αγίων πραγμάτων, τας οποίας οι υιοί Ισραήλ προσφέρωσιν εις τον Κύριον, έδωκα εις σε και εις τους υιούς σου και εις τας θυγατέρας σου μετά σου εις νόμιμον αιώνιον. Αύτη είναι διαθήκη άλατος παντοτεινή ενώπιον του Κυρίου εις σε και εις το σπέρμα σου μετά σου.
20 ౨౦ ఇంకా యెహోవా అహరోనుతో “ప్రజల భూమిలో నీకు స్వాస్థ్యం ఉండకూడదు. వారి మధ్య నీకు ఆస్తిగాని భాగం గాని ఉండకూడదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ భాగం, నీ స్వాస్థ్యం నేనే.
Και είπε Κύριος προς τον Ααρών, Εν τη γη αυτών δεν θέλεις έχει κληρονομίαν ουδέ θέλεις έχει μερίδα μεταξύ αυτών· εγώ είμαι η μερίς σου και η κληρονομία σου εν μέσω των υιών Ισραήλ.
21 ౨౧ చూడు, లేవీయులు చేసే సేవకు, అంటే, సన్నిధి గుడారపు సేవకు ప్రతిగా నేను ఇశ్రాయేలీయుల పదోవంతును వాళ్లకు వారసత్వంగా ఇచ్చాను.
Και ιδού, έδωκα εις τους υιούς Λευΐ πάντα τα δέκατα του Ισραήλ εις κληρονομίαν, διά την υπηρεσίαν αυτών την οποίαν υπηρετούσι, την υπηρεσίαν της σκηνής του μαρτυρίου·
22 ౨౨ ఇశ్రాయేలీయులు ఇకముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు. అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు.
και δεν θέλουσι πλησιάζει του λοιπού οι υιοί Ισραήλ εις την σκηνήν του μαρτυρίου, διά να μη λάβωσιν εφ' εαυτούς αμαρτίαν και αποθάνωσιν·
23 ౨౩ అయితే లేవీయులు సన్నిధి గుడారం సేవ చేసి, వారి సేవలో పాపాలకు వారే జవాబుదారులుగా ఉంటారు. మీ ప్రజల తరతరాలకు ఇది శాశ్వతమైన శాసనం. ఇశ్రాయేలీయుల మధ్య వాళ్లకు ఏ స్వాస్థ్యం ఉండకూడదు.
αλλ' οι Λευΐται, ούτοι θέλουσιν υπηρετεί την υπηρεσίαν της σκηνής του μαρτυρίου και ούτοι θέλουσι βαστάζει την ανομίαν αυτών· τούτο θέλει είσθαι νόμιμον αιώνιον εις τας γενεάς σας· και δεν θέλουσιν έχει μεταξύ των υιών Ισραήλ ουδεμίαν κληρονομίαν·
24 ౨౪ అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను” అన్నాడు.
διότι τα δέκατα των υιών Ισραήλ, τα οποία προσφέρωσιν υψουμένην προσφοράν προς τον Κύριον, έδωκα κληρονομίαν εις τους Λευΐτας· διά τούτο είπα περί αυτών, Εν μέσω των υιών Ισραήλ δεν θέλουσιν έχει ουδεμίαν κληρονομίαν.
25 ౨౫ ఇంకా యెహోవా మోషేతో,
Και ελάλησε Κύριος προς τον Μωϋσήν λέγων,
26 ౨౬ “నువ్వు లేవీయులతో ఇలా చెప్పు, ‘నేను ఇశ్రాయేలీయుల ద్వారా మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన పదోవంతు భాగాలు మీరు వారి దగ్గర తీసుకున్నప్పుడు మీరు దానిలో, అంటే ఆ పదోవంతు భాగంలో పదోవంతు భాగం యెహోవాకు ప్రతిష్ఠార్పణగా చెల్లించాలి.
Λάλησον και προς τους Λευΐτας και ειπέ προς αυτούς, Όταν λαμβάνητε παρά των υιών Ισραήλ το δέκατον, το οποίον έδωκα εις εσάς παρ' αυτών διά κληρονομίαν σας, τότε θέλετε προσφέρει εξ αυτών προσφοράν υψουμένην εις τον Κύριον, δέκατον από του δεκάτου.
27 ౨౭ మీకు వచ్చే ప్రతిష్ఠార్పణను కళ్లపు పంటలా, ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి.
Και αύται αι υψούμεναι προσφοραί σας θέλουσι λογίζεσθαι εις εσάς ως σίτος του αλωνίου και ως αφθονία του ληνού.
28 ౨౮ ఆ విధంగా మీరు ఇశ్రాయేలీయుల దగ్గర పొందిన మీ పదోవంతు భాగాలు అన్నిట్లోనుంచి మీరు ప్రతిష్ఠార్పణ యెహోవాకు చెల్లించాలి. దానిలోనుంచి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణ యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.
Ούτω και σεις θέλετε προσφέρει προσφοράν υψουμένην εις τον Κύριον από πάντων των δεκάτων σας, τα οποία λαμβάνετε παρά των υιών Ισραήλ· και από τούτων θέλετε δίδει την υψουμένην προσφοράν του Κυρίου εις τον Ααρών τον ιερέα.
29 ౨౯ మీరు పొందిన బహుమానాల్లో ప్రశస్తమైన వాటిలోనుంచి యెహోవాకు శ్రేష్ఠమైన అర్పణ ఇవ్వాలి.’
Από πάντων των δώρων σας θέλετε προσφέρει πάσαν υψουμένην προσφοράν του Κυρίου, από παντός του εξαιρέτου αυτών το ηγιασμένον μέρος εξ αυτών.
30 ౩౦ ఇంకా నువ్వు వారితో, మీరు పొందిన వాటిలో నుంచి ప్రశస్తభాగం అర్పించినప్పుడు, లేవీయులు దాన్ని కళ్ళం నుంచీ, ద్రాక్షగానుగ నుంచీ వచ్చిన ఫలంలా పరిగణించాలి.
Και θέλεις ειπεί προς αυτούς, Όταν προσφέρητε εξ αυτών το εξαίρετον αυτών, τούτο θέλει λογίζεσθαι διά τους Λευΐτας ως προϊόν του αλωνίου και ως προϊόν του ληνού·
31 ౩౧ మీరూ, మీ కుటుంబాలూ ఏ స్థలంలోనైనా వాటిని తినొచ్చు. ఎందుకంటే సన్నిధి గుడారంలో మీరు చేసే సేవకు అది మీకు జీతం.
και θέλετε τρώγει αυτά εν παντί τόπω, σεις και αι οικογένειαί σας· διότι τούτο είναι μισθός εις εσάς διά την υπηρεσίαν σας εν τη σκηνή του μαρτυρίου·
32 ౩౨ మీరు పొందిన వాటిలోనుంచి ప్రశస్తమైనవి యెహోవాకు అర్పించి ఉంటే, దాన్ని తిని, తాగినందుకు మీకు ఏ పాపశిక్ష ఉండదు. మీరు చనిపోకుండా ఉండాలంటే ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రం చెయ్యకూడదని చెప్పు” అన్నాడు.
και δεν θέλετε φέρει εφ' εαυτούς αμαρτίαν δι' αυτά, όταν προσφέρητε απ' αυτών το εξαίρετον αυτών· και δεν θέλετε βεβηλώσει τα άγια των υιών Ισραήλ, διά να μη αποθάνητε.