< సంఖ్యాకాండము 17 >

1 యెహోవా మోషేతో మాట్లాడుతూ,
Tad Tas Kungs runāja uz Mozu un sacīja:
2 “నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.
Runā uz Israēla bērniem un ņem no tiem priekš ikviena tēva nama vienu zizli, no visiem viņu virsniekiem pēc viņu tēvu namiem divpadsmit zižļus; tev ikviena vārdu būs rakstīt uz viņa zizli.
3 లేవీ చేతికర్ర మీద అహరోను పేరు రాయాలి. ఎందుకంటే ఒక్కొక్క పితరుల వంశాల నాయకునికి ఒక్క చేతికర్రే ఉండాలి.
Bet Ārona vārdu tev būs rakstīt uz Levja cilts zizli, jo ikvienam zizlim būs būt priekš sava tēva nama galvas.
4 నేను మిమ్మల్ని కలుసుకునే సన్నిధి గుడారంలోని నిబంధన శాసనాల ముందు వాటిని ఉంచాలి.
Un tev tos būs nolikt saiešanas teltī liecības priekšā, kur Es ar jums sanāku.
5 అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో, అతని కర్ర చిగురిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా చేస్తున్న ఫిర్యాదులు నాకు వినిపించకుండా ఆపేస్తాను” అన్నాడు.
Un tad tā vīra zizlis, ko Es izvēlēšu, zaļos, un Es klusināšu Israēla bērnu kurnēšanu pret Mani, ar ko tie pret jums kurn.
6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారి నాయకులందరూ తమ తమ పితరుల వంశాల్లో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క కర్ర ప్రకారం 12 కర్రలు అతనికిచ్చారు. అహరోను కర్ర కూడా వారి కర్రల మధ్యలో ఉంది.
Un Mozus runāja uz Israēla bērniem. Tad visi viņu virsnieki viņam deva ikviens virsnieks vienu zizli, pēc saviem tēvu namiem divpadsmit zižļus; tur arī Ārona zizlis bija starp viņu zižļiem.
7 మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు.
Un Mozus nolika tos zižļus Tā Kunga priekšā liecības teltī.
8 తరువాత రోజు మోషే నిబంధన శాసనాల గుడారంలోకి వెళ్లి చూసినప్పుడు లేవీ వంశానికి చెందిన అహరోను కర్ర మొగ్గ తొడిగి ఉంది. అది మొగ్గలు తొడిగి, పూలు పూసి, పండిన బాదం కాయలు కాసింది.
Un otrā ritā, kad Mozus iegāja liecības teltī, tad redzi, Ārona zizlis priekš Levja nama zaļoja, un ziedi bija izplaukuši un bija nesuši mandeles.
9 మోషే యెహోవా సన్నిధిలోనుంచి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తెచ్చినప్పుడు వారు వాటిని చూసి ఒక్కొక్కరూ ఎవరి కర్ర వారు తీసుకున్నారు.
Un Mozus iznesa visus šos zižļus no Tā Kunga priekšas pie visiem Israēla bērniem, un tie to redzēja, un ikviens ņēma savu zizli.
10 ౧౦ అప్పుడు యెహోవా మోషేతో “అహరోను కర్రను నిబంధన శాసనాల ఎదుట శాశ్వతంగా ఉంచు. అలా చేస్తే, అది తిరుగుబాటు చేసిన వారి అపరాధానికి గుర్తుగానూ, నాకు విరోధంగా సణిగి ఎవ్వరూ చనిపోకుండా ఉండడానికీ వీలౌతుంది” అన్నాడు.
Tad Tas Kungs sacīja uz Mozu: nes Ārona zizli atpakaļ liecības priekšā, to paglabāt par zīmi pārgalvjiem; tā tev to kurnēšanu pret Mani būs apklusināt, ka tiem nav jāmirst.
11 ౧౧ అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, అతడు కచ్చితంగా అలాగే చేశాడు.
Un Mozus tā darīja; itin kā Tas Kungs tam bija pavēlējis, tā viņš darīja.
12 ౧౨ అయితే ఇశ్రాయేలీయులు మోషేతో “మేము ఇక్కడ చనిపోతాం. మేమందరం నశించిపోతాం!
Tad Israēla bērni runāja uz Mozu: redzi, mēs mirstam, mēs ejam bojā, mēs visi ejam bojā.
13 ౧౩ యెహోవా మందిరాన్ని సమీపించిన ప్రతిఒక్కరూ చనిపోతారు. మేమందరం చావాల్సిందేనా?” అన్నారు.
Ikviens, kas pie Tā Kunga dzīvokļa pieiet, tam jāmirst; vai tad mums patiesi būs iet bojā?

< సంఖ్యాకాండము 17 >