< సంఖ్యాకాండము 13 >
1 ౧ ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
Un Tas Kungs runāja uz Mozu sacīdams:
2 ౨ నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి.
Izsūti vīrus, kas izlūko Kanaāna zemi, ko Es Israēla bērniem dodu; no ikvienas cilts tev būs sūtīt vienu vīru, kas visi ir virsnieki viņu starpā.
3 ౩ మోషే యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యేలా వారిని పారాను అరణ్యం నుండి పంపించాడు. వెళ్ళిన వారంతా ఇశ్రాయేలు ప్రజల్లో నాయకులు.
Tad Mozus tos izsūtīja no Pārana tuksneša pēc Tā Kunga vārda; visi tie vīri bija Israēla bērnu virsnieki.
4 ౪ వారి పేర్లు ఇవి. రూబేను గోత్రం నుండి జక్కూరు కొడుకు షమ్మూయ,
Un šie ir viņu vārdi: no Rūbena cilts Šamuūs, Zakura dēls,
5 ౫ షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,
No Sīmeana cilts Sāfats, Horija dēls,
6 ౬ యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు,
No Jūda cilts Kālebs, Jefunna dēls,
7 ౭ ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు.
No Īsašara cilts Jiģeāls, Jāzepa dēls,
8 ౮ ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ.
No Efraīma cilts Hošejs, Nuna dēls,
9 ౯ బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ,
No Benjamina cilts Paltus, Rapus dēls,
10 ౧౦ జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,
No Zebulona cilts Gadiēls, Sodija dēls,
11 ౧౧ యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,
No Jāzepa cilts, (tas ir) no Manasus cilts Gadus, Susus dēls,
12 ౧౨ దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,
No Dana cilts Amiēls, Ģemalus dēls,
13 ౧౩ ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు,
No Ašera cilts Seturs, Mihaēla dēls,
14 ౧౪ నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ,
No Naftalus cilts Nakbus, Vafsus dēls,
15 ౧౫ గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.
No Gada cilts Geuēls, Māhus dēls.
16 ౧౬ ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.
Šie ir to vīru vārdi, ko Mozus sūtīja, to zemi izlūkot. Un Mozus nosauca Hošeju, Nuna dēlu, (par) Jozua.
17 ౧౭ వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.
Un Mozus tos sūtīja, Kanaāna zemi izlūkot, un tiem sacīja: ceļaties šeit no dienvidu(Negeba) puses un ejat augšām uz tiem kalniem.
18 ౧౮ ఆ దేశం ఎలాంటిదో పరీక్షించండి. అక్కడ నివసించే ప్రజలను పరిశీలించండి. ఆ ప్రజలు బలవంతులా లేక బలహీనులా అన్నది చూడండి. అక్కడి ప్రజల జనాభా కొద్దిమందే ఉన్నారా లేక అధికంగా ఉన్నారా అనేది చూడండి.
Un apraugāt to zemi, kāda tā ir, un tos ļaudis, kas tur dzīvo, vai tie ir stipri, vai vāji, vai maz, vai daudz;
19 ౧౯ వారు నివసించే నేల ఎలాంటిదో చూడండి. అది మంచిదా, చెడ్డదా? ఎలాంటి పట్టణాలు అక్కడ ఉన్నాయి? వారి నివాసాలు శిబిరాల్లా ఉన్నాయా లేక ప్రాకారాలున్న కోటల్లో నివసిస్తున్నారా?
Un kāda tā zeme, kur tie dzīvo, vai tā laba vai nelaba, un kādas pilsētas tur ir, kur tie dzīvo, vai tie dzīvo lēģeros vai stiprās pilīs;
20 ౨౦ అక్కడి భూమి లక్షణం ఎలాంటిదో చూడండి. అది సారవంతమైనదా లేక నిస్సారమైనదా? అక్కడ చెట్లు ఉన్నాయో లేవో చూడండి. ధైర్యంగా ఉండండి. అక్కడి భూమి మీద పండే ఉత్పత్తుల్లో ఏవైనా రకాలు తీసుకు రండి.” అది ద్రాక్ష పళ్ళు పక్వానికి వచ్చే కాలం.
Un kāda tā zeme, vai tauka, vai liesa, vai koki tur ir, vai ne. Esiet droši un ņemat līdz no zemes augļiem; jo tas notika pašā pirmo vīna ogu laikā.
21 ౨౧ కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.
Un tie aizgāja un izlūkoja to zemi no Cin tuksneša līdz Rehobai, kur iet uz Amatu.
22 ౨౨ వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.
Un tie aizgāja no dienvidu(Negeba) puses un nāca Hebronē, un tur bija Aķimans, Zezaūs un Talmaūs, Enaka bērni. Bet Hebrones pilsēta bija celta septiņus gadus priekš Coana Ēģiptes zemē.
23 ౨౩ వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు.
Un tie nāca pie Eškoles upes un nogrieza tur vienu zaru ar vīna ķekaru, to divi nesa uz nesamās kārts, - arī granātābolus un vīģes.
24 ౨౪ ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతంలో కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ ప్రాంతానికి “ఎష్కోలు లోయ” అనే పేరు పెట్టారు.
Šī vieta tapa nosaukta Eškoles upe, pēc tā vīna ķekara, ko Israēla bērni tur bija nogriezuši.
25 ౨౫ వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు.
Un tie griezās atpakaļ no tās zemes izlūkošanas pēc četrdesmit dienām.
26 ౨౬ పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు.
Un tie gāja un nāca pie Mozus un pie Ārona un pie visas Israēla bērnu draudzes, Pārana tuksnesī uz Kādešu, un atnesa vēsti viņam un visai draudzei un rādīja tās zemes augļus.
27 ౨౭ వారు మోషేకి ఇలా చెప్పారు. “నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి.
Un tie viņam teica un sacīja: mēs tai zemē esam nākuši, kurp tu mūs esi sūtījis, un patiesi, tur tek piens un medus, un šis ir viņas auglis.
28 ౨౮ కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం.
Bet tik stipri ļaudis tai zemē dzīvo un tās pilsētas ir stipras un ļoti lielas; mēs tur arī Enaka bērnus esam redzējuši.
29 ౨౯ దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.”
Amalekieši dzīvo tai zemē pret dienvidiem, bet Hetieši un Jebusieši un Amorieši dzīvo kalnos, un Kanaānieši dzīvo pie jūras un Jardānes malā.
30 ౩౦ అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. “మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది” అన్నాడు.
Tad Kālebs apklusināja tos ļaudis Mozus priekšā un sacīja: iedami iesim augšup un mēs to ieņemsim, jo mēs to tiešām uzvarēsim.
31 ౩౧ కాని అతనితో వెళ్ళిన మిగతా వారు “అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.” అన్నారు.
Bet tie vīri, kas viņam bija līdz gājuši, sacīja: mēs nevaram iet pret šiem ļaudīm, jo tie ir stiprāki nekā mēs.
32 ౩౨ ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు.
Tā tie izpauda nelabu slavu no tās zemes, ko tie bija izlūkojuši, pie Israēla bērniem, sacīdami: tā zeme, ko esam pārstaigājuši izlūkot, ir tāda zeme, kas savus iedzīvotājus aprij, un visi ļaudis, ko mēs tur esam redzējuši, ir vīri no liela garuma.
33 ౩౩ అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు.
Mēs tur arī milžu ļaudis esam redzējuši, tos Enaka dēlus no milžu cilts; mēs bijām savās acīs tā kā siseņi, un tādi paši mēs bijām viņu acīs.