< సంఖ్యాకాండము 11 >
1 ౧ ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది.
Ie añe, le niñeoñeoñe hoe mpitoreo an-kasotriañe, an-dravembia’ Iehovà ondatio, aa ie jinanji’ Iehovà, le niviañe ty haviñera’e, naho nisolebotse am’ iareo ty afo’ Iehovà, namorototo ty añ’ olo’ i tobey.
2 ౨ అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి.
Aa le nikaikaik’ amy Mosè ondatio naho nihalaly am’ Iehovà t’i Mosè vaho nakipeke i afoy.
3 ౩ యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది.
Aa le natao’e ty hoe Taberà i taney amy te niforehetse am’iareo ty afo’ Iehovà.
4 ౪ కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?
Teo te nivariñe an-kasijý o piaroteñe am’iareoo; mbore nibabababa ka o ana’ Israeleo ami’ty hoe: Ia ty hanjotso hena ama’ay?
5 ౫ ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి.
Tiahi’ay o fiañe nikamae’ay tsy amam-bili’e e Mitsraime añeo naho ty kiseny, ty vazavo, ty foti-voly, ty tangolo vaho o tangolo-laio;
6 ౬ ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు.
fe mifoezapoezake henaneo; tsy ino ty aolom-pihaino’ay, naho tsy ty màne tiañ’ avao!
7 ౭ ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది.
Nanahake voan’ ahepoty i maney fe nimena hoe vañemba.
8 ౮ ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.
Namory aze mbeo’ mbeo ondatio, le ke dinemodemo’e am-bato fandisañañe, he nilisane’e an-deoñe, naho nahandroeñe am-balàñe vaho namboareñe mofo-vonga’e; ty hafiri’e le hoe mofo natoñak’ ami’ty menake.
9 ౯ రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.
Nivotrak’ amy tobey ty zono te haleñe le nindre nihintsañe ama’e i maney.
10 ౧౦ ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.
Ie jinanji’ i Mosè ty fangoihoi’ ondatio, nanitsike o hasavereña’eo, songa lahilahy an-dalan-kiboho’e eo, le nisolebotse ty haviñera’ Iehovà; toe niboseke ka t’i Mosè.
11 ౧౧ అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.
Aa le hoe t’i Mosè am’ Iehovà, Ino ty nanotria’o i mpitoro’oy? Le manao akore t’ie tsy nahaonim-pañisohañe am-pivazohoa’o, kanao nampijinia’o o kilanka’ ondaty iaby retiañe?
12 ౧౨ ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?
Izaho hao ty nampitsonkèreñe ondatio? Izaho hao ty rae’ iareo, kanao anoa’o ty hoe: Otroño añ’araña’o ao manahake ty fiotroña’ ty mpiatrak’ ajaja, pak’an-tane nifanta’o aman-droae’ iareo?
13 ౧౩ ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు.
Aia ty hahatreavako hena hazotsoko am’ ondatio? Ami’ty fitoreova’ iareo ty hoe, Meo hena ho kamae’ay!
14 ౧౪ ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.
Tsy leoko vavèñe ondaty retia, izaho raike, fa loho mavesatse amako.
15 ౧౫ నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”
Aa naho zao ty anoa’o ahy le ehe avetraho am-pañohofan-doza, naho toe nahatrea fañisohañe am-pivazohoa’o, fa ko apo’o ho treako o faloviloviakoo!
16 ౧౬ అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు.
Aa le hoe t’Iehovà amy Mosè: Anontoño ondaty fitompolo amo roandria’ Israeleo, ze fohi’o te mpiaolo’ ondatio naho mpameleke iareo; le ampihovao mb’ an-kibohom-pamantañam-beo, hitrao-pijohañe ama’o.
17 ౧౭ అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.
Le hizotso mb’eo iraho hifanaontsy ama’o, le handivako am’ iereo i Arofo ama’oy vaho hitrao-pivave ama’o ondatio, soa te tsy ihe avao ty hivave.
18 ౧౮ నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.
Le ano ty hoe amy màroy, Miefera vatañe ho ami’ ty hamaray, fa hikama hena amy niroveta’ areo am-pijanjiña’ Iehovà ami’ty hoe, Ia ty hanjotso hena ama’ay? Ie nierañerañe’ e Mitsraime añe. Aa le hanjotsoa’ Iehovà hena, vaho hikama nahareo.
19 ౧౯ ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు.
Tsy indraik’ andro ty hikama’areo, tsy roe andro, tsy lime andro, tsy folo andro, tsy roapolo andro,
20 ౨౦ ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.”
fa volañe raike, ampara’ te miakatse am-piantsona’ areo vaho hampangorý anahareo, amy te nisirikae’ areo t’Iehovà añivo’ areo ao, ie nangololoike añatrefa’e ami’ty hoe, Ino ty niavotan-tika amy Mitsraime?
21 ౨౧ దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు.
Aa hoe t’i Mosè, Lahin-defo enen-ketse o mañariseho ahio; Ihe manao amako ty hoe, Hanjotsoako hena hikama’ iareo volañe raike.
22 ౨౨ ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు.
Handentàñe añondry naho añombe hao, hahatsake iareo? Ke hanontonañe ze hene fiañe an-driak’ ao?
23 ౨౩ అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
Le hoe t’Iehovà amy Mosè, Nitomoreñe hao ty fità’ Iehovà? Mbe ho oni’o aniany ke ho tafetetse i rehakoy ke tsie.
24 ౨౪ మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు.
Aa le niakatse añe t’i Mosè naho sinaontsi’e am’ iereo i tsara’ Iehovày, le natonto’e t’indaty fitompolo amo roandria’ ondatio vaho najado’e añariari’ i kivohoy.
25 ౨౫ అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.
Le nizotso amy rahoñey t’Iehovà nangalak’ amy Arofo ama’ey vaho natolo’e amy roandriañe fitompolo rey; ie nivotraha’ i Arofoy le nitoky, fe tsy ho nainai’e.
26 ౨౬ ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు.
Toe mbe nitambatse an-tobe ao t’indaty roe ama’e: i Eldade ty tahina ty raike naho i Medade ty tahina’ ty raike, vaho nivotrak’ am’iereo i Arofoy. Toe sinokitse iereo fe tsy nañavelo mb’ amy kivohoy mb’eo, fa nitoky an-tobe ao.
27 ౨౭ అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
Le nihitrihitry mb’amy Mosè mb’eo ty ajalahy nitalily ama’e ty hoe: Mitoky an-tobe ao t’i Eldade naho i Medade.
28 ౨౮ మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు.
Aa le hoe ty natoi’ Iehosoa ana’ i None, mpiamy Mosè ampara’ ty nahaajalahy aze: O talèko, rarao iereo!
29 ౨౯ దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు.
Le hoe t’i Mosè ama’e, Mamarahy ahy v-iheo? Ee te songa nimpitoky ondati’ Iehovào, naho sindre nampivotraha’ Iehovà i Arofo’ey!
30 ౩౦ అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.
Aa le nimpoly mb’an-tobe mb’eo t’i Mosè naho o roandria’ Israeleo.
31 ౩౧ అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.
Aa le boak’ am’ Iehovà ty tioke ninday hatrakatrake hirik’ an-driak’ añe, le nampipoha’e marine i tobey ie nahatakatse lia’ andro raike mb’atia vaho lia’andro raike mb’eroa añariari’ i tobey; ni-roe kiho ambone’ i taney varañe ty fitoabo’e.
32 ౩౨ కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.
Aa le nifanehak’ amy àndroy naho amy haleñey naho amy loakandroy ondatio nijohañe ey nanontoñe o hatrakatrakeo le ze nanontoñe tsy ampe mbe nahatsake folo homere; vaho songa nandafike ty aze marine i tobey.
33 ౩౩ ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు.
Fe mbe añivom-pamotsi’e ao i henay ie mbe tsy nitotoe’e, le nisolebotse am’ iereo ty haviñera’ Iehovà vaho pinao’ Iehovà ami’ty angorosy loza.
34 ౩౪ మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది.
Aa le natao’e Kibrate Hata’avà i taney amy te eo ty nandentehañe ondaty aman-kadrao.
35 ౩౫ ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.
Boake Kibrate Hata’avà ao ondatio ro nangovovòke imb’e Katserote mb’eo vaho nitobe e Katserote añe.