< నెహెమ్యా 8 >
1 ౧ అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు రమ్మని ఎజ్రాశాస్త్రితో చెప్పారు.
ɔmanfoɔ no nyinaa hyiaa wɔ wɔn nsuseneeɛ ɛpono no ano. Ɔmanfoɔ no ka kyerɛɛ Ɛsra a ɔyɛ mmara no kyerɛkyerɛni sɛ ɔnkenkan Mose mmara a Awurade ahyɛ sɛ Israelfoɔ nni so no.
2 ౨ ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు.
Enti, bosome Tisri (bɛyɛ Ahinime) da a ɛtɔ so nwɔtwe no, ɔsɔfoɔ Ɛsra de krataa mmobɔeɛ a mmara no wɔ mu no baa badwa no a mmarima ne mmaa ne mmɔfra a wɔanyini te asɛm ase no anim.
3 ౩ అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు.
Ɔde nʼani kyerɛɛ adwaberem wɔ nsuseneeɛ ɛpono no ano, firi anɔpahema kɔsii owigyinaeɛ kenkanee mmara no den, maa obiara a ɔte aseɛ no teeɛ. Ɔmanfoɔ no nyinaa wɛnee wɔn aso, tiee mmara no.
4 ౪ ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు.
Ɛsra a ɔyɛ mmara no kyerɛkyerɛni no gyinaa apa tenten bi a wɔsi maa saa da no so. Nnipa a na wɔgyinagyina ne nifa so no no din de Matitia, Sema, Anaia, Uria, Hilkia ne Maaseia. Wɔn a na wɔgyinagyina ne benkum so no no din de Pedaia, Misael, Malkia, Hasum, Hasbadana, Sakaria ne Mesulam.
5 ౫ అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు.
Ɛsra gyinaa apa no so a nnipa dɔm no nyinaa hunu no. Ɛberɛ a wɔhunuu sɛ wabue nwoma no mu no, wɔn nyinaa sɔresɔre gyinaa wɔn nan so.
6 ౬ ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.
Na Ɛsra kamfoo Awurade, Otumfoɔ Onyankopɔn, na ɔmanfoɔ no bɔ gyee so sɛ, “Amen! Amen!” wɔ ɛberɛ a wɔmemaa wɔn nsa so kyerɛɛ ɔsoro. Afei, wɔkotokotoeɛ, somm Awurade a wɔn anim butubutu fam.
7 ౭ ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు.
Afei, Lewifoɔ a wɔn din de Yesua, Bani, Serebia, Yamin, Akub, Sabetai, Hodia, Maaseia, Kelita, Asaria, Yosabad, Hanan ne Pelaia kyerɛɛ ɔmanfoɔ a wɔgyinagyina hɔ no deɛ wɔnyɛ.
8 ౮ ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు.
Wɔkenkan firii Onyankopɔn mmara nwoma no mu kyerɛɛ wɔn deɛ wɔkenkan no ase, boaa ɔmanfoɔ no ma wɔtee twerɛpɛn biara ase.
9 ౯ ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు.
Na amrado Nehemia, ɔsɔfoɔ Ɛsra a ɔyɛ mmara no kyerɛkyerɛni ne Lewifoɔ a na wɔrekyerɛkyerɛ aseɛ akyerɛ ɔmanfoɔ no ka kyerɛɛ wɔn sɛ, “Monnsu ɛda a ɛte sɛ yei! Ɛfiri sɛ, ɛnnɛ yɛ ɛda kronkron wɔ Awurade, mo Onyankopɔn, anim.” Nnipa no tee mmara no mu nsɛm no, wɔn nyinaa suiɛ.
10 ౧౦ అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు.
Na Nehemia toaa so sɛ, “Momfa nnuane pa ne anonneɛ a ɛyɛ dɛ nkɔdi afahyɛ no na mo ne wɔn a wɔnni nnuane pa a wɔanoa no nnidi. Ɛnnɛ yɛ da kronkron wɔ Awurade anim. Monnni abooboo ne awerɛhoɔ, na Awurade mu anigyeɛ no yɛ ahoɔden.”
11 ౧౧ ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు.
Na Lewifoɔ no nso kasaa sɛ, “Hwɛ! Monnsu. Ɛfiri sɛ, ɛnnɛ yɛ ɛda kronkron” de dwodwoo wɔn.
12 ౧౨ ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు.
Na nnipa no kɔdidiiɛ, kyɛɛ nnuane, nomeeɛ, dii dapɔnna no anigyeɛ so, ɛfiri sɛ, wɔtee Onyankopɔn nsɛm, tee aseɛ.
13 ౧౩ రెండవ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు.
Na bosome Tisri (bɛyɛ Ahinime) a ɛtɔ so nkron no, mmusua ntuanofoɔ no ne asɔfoɔ no ne Lewifoɔ no ne Ɛsra hyiaeɛ sɛ, wɔrekɔ mmara no mu fekɔfekɔ.
14 ౧౪ యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు.
Wɔkɔɔ mmara no mu no, wɔhunuu sɛ, Awurade nam Mose so ahyɛ sɛ, ɛsɛ sɛ Israelfoɔ no tena asese mu afahyɛ a wɔrebɛdi no saa bosome no mu no.
15 ౧౫ వాళ్ళు యెరూషలేంలో, తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. “గ్రంథంలో రాసి ఉన్నట్టు, మీరు కొండలకు వెళ్లి ఒలీవచెట్ల కొమ్మలు, అడవి ఒలీవచెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈతచెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి.”
Waka sɛ, ɛsɛ sɛ wɔbɔ nhyɛ no ho dawuro wɔ wɔn nkuro nyinaa so, ne titire no, Yerusalem nam so aka akyerɛ ɔmanfoɔ no sɛ, wɔnkɔ nkokoɔ so nkɔpɛ ngo dua mman, kranku mman, ohwannua mman, ɛberɛ ne nnua kusukusuu mman, na wɔmfa mmɛbobɔ asese ntena mu, sɛdeɛ wɔatwerɛ no mmara no mu no.
16 ౧౬ కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ళ మీద, వాకిళ్ళలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయీం ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు.
Enti, nnipa no kɔtwitwaa mman, na wɔde sisii asese wɔ wɔn afie, wɔn adihɔ, Onyankopɔn asɔredan adihɔ anaa adwaberem a ɛwowɔ asutene apono no ne Efraim apono no mu.
17 ౧౭ చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు.
Enti, obiara a wafiri nneduasom mu aba no kɔtenaa saa asese yi mu afahyɛberɛ no nnanson mu, na obiara ani gyee yie. Ɛfiri Nun babarima Yosua berɛ so no, Israelfoɔ anni afahyɛ no saa ɛkwan yi so.
18 ౧౮ అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.
Ɛsra kenkan firii Onyankopɔn mmara nwoma no mu wɔ afahyɛ no mu nnanson no mu da biara. Afei, Tisri bosome (bɛyɛ Ahinime) da a ɛtɔ so dunum no, wɔyɛɛ nhyiamu anibereɛ so, sɛdeɛ Mose mmara hwehwɛ no.