< నెహెమ్యా 7 >
1 ౧ నేను సరిహద్దు గోడలు కట్టి, తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను.
প্রাচীর গাঁথা হয়ে যাবার পর আমি দরজাগুলি ঠিক জায়গায় লাগালাম, এবং দ্বাররক্ষী, গায়ক ও লেবীয়দের নিযুক্ত করা হল।
2 ౨ తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి.
আমার ভাই হনানিকে ও দুর্গের শাসনকর্তা হনানিয়কে জেরুশালেমের উপর নিযুক্ত করলাম, কেননা হনানি বিশ্বস্ত লোক ছিলেন এবং ঈশ্বরকে অনেকের চেয়ে বেশি ভয় করতেন।
3 ౩ అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.
আমি তাদের বললাম, “যতক্ষণ না প্রচণ্ড রোদ হয় ততক্ষণ জেরুশালেমের দ্বার যেন খোলা না হয়। রক্ষীরা থাকার সময় তাদের দিয়ে যেন দ্বার বন্ধ করা ও হুড়কা লাগানো হয়। এবং জেরুশালেমের নিবাসীদের মধ্যে থেকে যেন প্রহরী নিযুক্ত হয়, তাদের কেউ কেউ থাকুক পাহারা দেবার জায়গায় আর কেউ কেউ নিজের বাড়ির কাছে।”
4 ౪ ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇళ్ళు కట్టుకోలేదు.
সেই সময় জেরুশালেম নগর ছিল বড়ো ও অনেক জায়গা জুড়ে, কিন্তু তার মধ্যে অল্প সংখ্যক লোক ছিল, এবং সব বাড়িও তখন তৈরি করা হয়নি।
5 ౫ ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాల వారీగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి.
পরে ঈশ্বর আমার মনে ইচ্ছা দিলেন যেন আমি গণ্যমান্য লোকদের, উচ্চপদস্থ কর্মচারীদের ও সাধারণ লোকদের একত্র করে তাদের বংশাবলি লেখা হয়। যারা প্রথমে ফিরে এসেছিল সেই লোকদের বংশতালিকা পেলাম। তার মধ্যে আমি এই কথা লেখা পেলাম:
6 ౬ బబులోను రాజు నెబుకద్నెజరు చెరలోకి తీసుకు పోగా తిరిగి యెరూషలేం, యూదా దేశంలోని తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చిన జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనే వాళ్ళతోపాటు
ব্যাবিলনের রাজা নেবুখাদনেজার যাদের বন্দি করে নিয়ে গিয়েছিলেন, তাদের মধ্যে সেই প্রদেশের এইসব লোকজন নির্বাসন কাটিয়ে জেরুশালেম ও যিহূদায় নিজের নিজের নগরে ফিরে এসেছিল।
7 ౭ తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల జనసంఖ్య యిదే.
তারা সরুব্বাবিল, যেশূয়, নহিমিয়, অসরিয়, রয়মিয়া, নহমানি, মর্দখয়, বিল্শন, মিস্পরৎ, বিগ্বয়, নহূম ও বানার সঙ্গে ফিরে এসেছিল। ইস্রায়েলী পুরুষদের তালিকা:
8 ౮ పరోషు వంశం వారు 2, 172 మంది.
পরোশের বংশধর 2,172 জন,
9 ౯ షెఫట్య వంశం వారు 372 మంది.
শফটিয়ের বংশধর 372 জন,
10 ౧౦ ఆరహు వంశం వారు 652 మంది.
আরহের বংশধর 652 জন,
11 ౧౧ యేషూవ, యోవాబు వంశాల్లోని పహత్మోయాబు కుటుంబీకులు 2, 818 మంది.
পহৎ-মোয়াবের বংশধর (যেশূয় ও যোয়াবের সন্তানদের মধ্যে) 2,818 জন,
12 ౧౨ ఏలాము వంశం వారు 1, 254 మంది.
এলমের বংশধর 1,254 জন,
13 ౧౩ జత్తూ వంశం వారు 845 మంది.
সত্তূরের বংশধর 845 জন,
14 ౧౪ జక్కయి వంశం వారు 760 మంది.
সক্কয়ের বংশধর 760 জন,
15 ౧౫ బిన్నూయి వంశం వారు 648 మంది.
বিন্নূয়ীর বংশধর 648 জন,
16 ౧౬ బేబై వంశం వారు 628 మంది.
বেবয়ের বংশধর 628 জন,
17 ౧౭ అజ్గాదు వంశం వారు 2, 322 మంది.
অস্গদের বংশধর 2,322 জন,
18 ౧౮ అదోనీకాము వంశం వారు 667 మంది.
অদোনীকামের বংশধর 667 জন,
19 ౧౯ బిగ్వయి వంశం వారు 2,067 మంది.
বিগ্বয়ের বংশধর 2,067 জন,
20 ౨౦ ఆదీను వంశం వారు 655 మంది.
আদীনের বংশধর 655 জন,
21 ౨౧ హిజ్కియా బంధువైన అటేరు వంశం వారు 98 మంది.
(হিষ্কিয়ের বংশজাত) আটেরের বংশধর 98 জন,
22 ౨౨ హాషుము వంశం వారు 328 మంది.
হশুমের বংশধর 328 জন,
23 ౨౩ జేజయి వంశం వారు 324 మంది.
বেৎসয়ের বংশধর 324 জন,
24 ౨౪ హారీపు వంశం వారు 112 మంది.
হারীফের বংশধর 112 জন,
25 ౨౫ గిబియోను వంశం వారు 95 మంది.
গিবিয়োনের বংশধর 95 জন,
26 ౨౬ బేత్లెహేముకు చెందిన నెటోపా వంశం వారు 188 మంది.
বেথলেহেম এবং নটোফার লোকেরা 188 জন,
27 ౨౭ అనాతోతు గ్రామం వారు 128 మంది.
অনাথোতের লোকেরা 128 জন,
28 ౨౮ బేతజ్మావెతు గ్రామం వారు 42 మంది.
বেৎ-অস্মাবতের লোকেরা 42 জন,
29 ౨౯ కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతు గ్రామాల వారు 743 మంది.
কিরিয়ৎ-যিয়ারীম, কফীরা ও বেরোতের লোকেরা 743 জন,
30 ౩౦ రమా, గెబ గ్రామాల వారు 621 మంది.
রামার ও গেবার লোকেরা 621 জন,
31 ౩౧ మిక్మషు గ్రామం వారు 122 మంది.
মিক্মসের লোকেরা 122 জন,
32 ౩౨ బేతేలు, హాయి గ్రామాల వారు 123 మంది.
বেথেল ও অয়ের লোকেরা 123 জন,
33 ౩౩ రెండవ నెబో గ్రామం వారు 52 మంది.
অন্য নেবোর লোকেরা 52 জন,
34 ౩౪ రెండవ ఏలాము గ్రామం వారు 1, 254 మంది.
অন্য এলমের লোকেরা 1,254 জন,
35 ౩౫ హారిము వంశం వారు 320 మంది.
হারীমের লোকেরা 320 জন,
36 ౩౬ యెరికో వంశం వారు 345 మంది.
যিরীহোর লোকেরা 345 জন,
37 ౩౭ లోదు, హదీదు, ఓనో వంశాల వారు 721 మంది.
লোদ, হাদীদ, ও ওনোর লোকেরা 721 জন,
38 ౩౮ సెనాయా వంశం వారు 3, 930 మంది.
সনায়ার লোকেরা 3,930 জন।
39 ౩౯ యాజకుడు యేషూవ కుటుంబీకుడైన యెదాయా వంశం వారు 973 మంది.
যাজকবর্গ: (যেশূয়ের বংশের মধ্যে) যিদয়িয়ের বংশধর 973 জন,
40 ౪౦ ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
ইম্মেরের বংশধর 1,052 জন,
41 ౪౧ పషూరు వంశం వారు 1, 247 మంది.
পশ্হূরের বংশধর 1,247 জন,
42 ౪౨ హారిము వంశం వారు 1,017 మంది.
হারীমের বংশধর 1,017 জন।
43 ౪౩ లేవీ గోత్రికులైన యేషూవ, హోదవ్యా, కద్మీయేలు వంశాల వారు 74 మంది.
লেবীয়বর্গ: (হোদবিয়ের বংশে কদ্মীয়েলের মাধ্যমে) যেশূয়ের বংশধর 74 জন।
44 ౪౪ పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.
গায়কবৃন্দ: আসফের বংশধর 148 জন।
45 ౪౫ ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి వంశాల వారు 138 మంది.
মন্দিরের দ্বাররক্ষীবর্গ: শল্লুম, আটের, টল্মোন, অক্কূব, হটীটা ও শোবয়ের বংশধর 138 জন।
46 ౪౬ నెతీనీయులైన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
মন্দিরের পরিচারকবৃন্দ: সীহ, হসূফা, টব্বায়োত,
47 ౪౭ కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
কেরোস, সীয়, পাদোন,
48 ౪౮ లెబానా, హగాబా, షల్మయి వంశాల వారు.
লবানা, হগাব, শল্ময়,
49 ౪౯ హానాను, గిద్దేలు, గహరు వంశాల వారు.
হানন, গিদ্দেল, গহর,
50 ౫౦ రెవాయ, రెజీను, నెకోదా వంశాల వారు.
রায়া, রৎসীন, নকোদ,
51 ౫౧ గజ్జాము, ఉజ్జా, పాసెయ వంశాల వారు.
গসম, ঊষ, পাসেহ,
52 ౫౨ బేసాయి, మెహూనీము, నెపూషేసీము వంశాల వారు.
বেষয়, মিয়ূনীম, নফূষীম,
53 ౫౩ బక్బూకు, హకూపా, హర్హూరు వంశాల వారు.
বক্বূক, হকূফা, হর্হূর,
54 ౫౪ బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
বসলূত, মহীদা, হর্শা,
55 ౫౫ బర్కోసు, సీసెరా, తెమహు.
বর্কোস, সীষরা, তেমহ,
56 ౫౬ నెజీయహు, హటీపా వంశాల వారు.
নৎসীহ ও হটীফার বংশধর।
57 ౫౭ సొలొమోను సేవకుల, దాసుల వంశాల వారు, సొటయి వంశం వారు. సోపెరెతు, పెరూదా వంశాల వారు.
শলোমনের দাসদের বংশধর: সোটয়, সোফেরত, পরীদা,
58 ౫౮ యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
যালা, দর্কোন, গিদ্দেল,
59 ౫౯ షెఫట్య, హట్టీలు, జెబాయీం బంధువు పొకెరెతు, ఆమోను వంశాల వారు.
শফটিয়, হটীল, পোখেরৎ-হৎসবায়ীম ও আমোনের বংশধর।
60 ౬౦ దేవాలయ సేవకులందరూ, సొలొమోను దాసుల వంశాల వారు 392 మంది.
মন্দিরের দাসেরা এবং শলোমনের দাসদের বংশধর 392 জন।
61 ౬౧ తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన గ్రామాల నుండి కొందరు వచ్చారు. కానీ వాళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నట్టు రుజువులు చూపించ లేకపోయారు.
তেল্-মেলহ, তেল্-হর্শা, করূব, অদ্দন ও ইম্মের, এসব স্থান থেকে নিম্নলিখিত লোকেরা এসেছিল, কিন্তু তারা ইস্রায়েলী লোক কি না, এ বিষয়ে নিজ নিজ পিতৃকুলের প্রমাণ দিতে পারল না:
62 ౬౨ వీళ్ళెవరంటే, దెలాయ్యా, టోబీయా, నెరోదా వంశాల వారు 642 మంది,
দলায়, টোবিয় ও নকোদের বংশধর 642 জন।
63 ౬౩ హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశాల వారు. అంటే, గిలాదీయుడు బర్జిల్లయి కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ పేరుతో పిలువ బడిన బర్జిల్లయి వంశస్థులు, యాజక సంతానం వారు.
আর যাজকদের মধ্যে: হবায়ের, হক্কোষের ও বর্সিল্লয়ের বংশধর (এই বর্সিল্লয় গিলিয়দীয় বর্সিল্লয়ের এক মেয়েকে বিয়ে করেছিল এবং তাকে সেই নামেই ডাকা হত)।
64 ౬౪ వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారుగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు.
বংশতালিকায় এই লোকেরা তাদের বংশের খোঁজ করেছিল কিন্তু পায়নি, এবং সেই কারণে তারা অশুচি বলে তাদের যাজকের পদ থেকে বাদ দেওয়া হয়েছিল।
65 ౬౫ ఊరీం, తుమ్మీం, ధరించగల ఒక యాజకుణ్ణి నియమించేదాకా దేవునికి ప్రతిష్టితమైన పదార్ధాలను తినకూడదని ప్రజల అధికారి వాళ్ళకు ఆదేశించాడు.
সুতরাং, শাসনকর্তা তাদের এই আদেশ দিয়েছিলেন, যে ঊরীম ও তুম্মীম ব্যবহারকারী কোনো যাজক না আসা পর্যন্ত যেন লোকেরা কোনও মহাপবিত্র খাদ্য ভোজন না করে।
66 ౬౬ అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42, 360 మంది.
সর্বমোট তাদের সংখ্যা ছিল 42,360,
67 ౬౭ వీరు కాకుండా వీరి పనివారు, పనికత్తెలు 7, 337 మంది. గాయకుల్లో స్త్రీలు, పురుషులు కలిపి 245 మంది.
এছাড়া তাদের দাস-দাসী ছিল 7,337 জন; এবং তাদের 245 জন গায়ক-গায়িকাও ছিল।
68 ౬౮ వారి దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు,
তাদের 736-টি ঘোড়া, 245-টি খচ্চর,
69 ౬౯ 435 ఒంటెలు, 6, 720 గాడిదలు ఉన్నాయి.
435-টি উট ও 6,720-টি গাধা।
70 ౭౦ వంశాల నాయకుల్లో కొందరు పని కోసం ఆర్ధిక సహాయం చేశారు. అధికారి 120 తులాల బంగారం, 50 పళ్ళాలు, 530 యాజక వస్త్రాలు ఖజానాలో జమ చేశాడు.
পিতৃকুলপতিদের মধ্যে কেউ কেউ সেই কাজের জন্য দান করল। শাসনকর্তা ভাণ্ডারে 1,000 অদর্কোন সোনা ও পঞ্চাশটি বাটি এবং যাজকদের জন্য 530-টি পোশাক দিলেন।
71 ౭౧ వంశాల ప్రముఖుల్లో కొందరు 2, 400 తులాల బంగారం, 14 లక్షల తులాల వెండి ఖజానాలోకి ఇచ్చారు.
কয়েকজন পিতৃকুলপতি ভাণ্ডারে এই কাজের জন্য 20,000 অদর্কোন সোনা ও 2,200 মানি রুপো দিলেন।
72 ౭౨ మిగతా ప్రజలు ఇచ్చినవి 2, 400 తులాల బంగారం, 12, 72, 720 తులాల వెండి, 67 యాజక వస్త్రాలు.
বাকি লোকেরা মোট 20,000 অদর্কোন সোনা ও 2,000 মানি রুপো এবং যাজকদের জন্য 67-টি পোশাক দিল।
73 ౭౩ అప్పుడు యాజకులు, లేవీ గోత్రం వారు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజల్లో కొందరు, ఇశ్రాయేలీయులంతా ఏడవ నెలకల్లా తమ తమ గ్రామాల్లో కాపురం ఉన్నారు.
যাজকেরা, লেবীয়েরা, দ্বাররক্ষীরা, গায়কেরা এবং মন্দিরের দাসেরা বিশেষ কিছু লোকের ও অবশিষ্ট ইস্রায়েলীদের সঙ্গে নিজের নিজের নগরে বসবাস করতে লাগল। সপ্তম মাসে ইস্রায়েলীরা নিজের নিজের নগরে বসবাস করতে লাগল।