< నెహెమ్యా 4 >

1 మేము గోడలు నిలబెట్టడం మొదలు పెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు.
Bere a Sanbalat tee sɛ yɛreto ɔfasu no, ne bo fuw yiye. Nʼani beree yiye, dii Yudafo no ho fɛw,
2 షోమ్రోను సైన్యం వారితో, తన స్నేహితులతో ఇలా అన్నాడు. “అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్ళను పునాదులుగా వాడతారా?”
wɔ ne nnamfonom ne Samaria asraafo mpanyimfo anim se, “Dɛn na Yudafo ahiafo, mmɔborɔfokuw yi dwene sɛ wɔreyɛ? Wogye di sɛ, sɛ wɔbɔ afɔre sɛ dɛn koraa a, wobetumi de da koro ato ɔfasu yi ana? Monhwɛ abo a ahyew asɛe yi a wɔreyiyi afi afabo yi mu de ayɛ adwuma bio?”
3 అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు.
Na Amonni Tobia a na ogyina ne nkyɛn kae se, “Saa abo fasu yi de, sɛ sakraman koraa fa so a, ebedwiriw agu fam!”
4 “మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదికే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి.
Na mebɔɔ mpae se, “Yɛn Nyankopɔn, tie yɛn, na wɔredi yɛn ho fɛw. Ma wɔn fɛwdi no mmɔ wɔn ara wɔn ti so, na ma wɔn ankasa nkɔyɛ nnommum wɔ ananafo asase so.
5 వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”
Mmu wʼani ngu wɔn afɔdi so. Mpepa wɔn bɔne, efisɛ wɔahyɛ wo abufuw wɔ adansifo yi anim.”
6 అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాం. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయింది.
Eyi nyinaa akyi no, wɔtoo ɔfasu no kosii dedaw no sorokɔ fa twaa kurow no ho hyiae, efisɛ ɔmanfo no yɛɛ adwumaden.
7 యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు.
Na bere a Sanbalat ne Tobia ne Arabfo ne Amonfo ne Asdodfo tee sɛ adwuma no rekɔ so na wɔretuatua ɔfasu no mu atokuru no, wɔn bo fuw yiye.
8 జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు.
Wɔn nyinaa yɛɛ nhyehyɛe sɛ wɔbɛba abɛko atia Yerusalem, na wɔama basabasayɛ aba hɔ.
9 మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్లు కాపలా ఉంచాము.
Nanso yɛbɔɔ yɛn Nyankopɔn mpae, wɛn kurow no awia ne anadwo de bɔɔ yɛn ho ban.
10 ౧౦ అప్పుడు యూదా వాళ్ళు “బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది, శిథిలాల కుప్పలు ఎక్కువై పోయాయి. గోడ కట్టడం కుదరదు” అన్నారు.
Afei, nnipa a wɔwɔ Yuda no fii ase nwiinwii kae se, “Adwumayɛfo no rebrɛ, na afabo no dɔɔso, na yɛn nko ara rentumi nyɛ adwuma no.”
11 ౧౧ మా విరోధులు “వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి, పని జరగకుండా చేద్దాం” అనుకున్నారు.
Bere koro no ara mu no na yɛn atamfo nso reka se, “Ansa na wɔn ani bɛba wɔn ho so no, na yɛatow ahyɛ wɔn so, akunkum wɔn, ama adwuma no aba awiei.”
12 ౧౨ మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు, నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు.
Yudafo a na wɔte bɛn atamfo no bɛbɔɔ yɛn amanneɛ mpɛn bebree se, “Wobefi afanan nyinaa abɛtow ahyɛ yɛn so.”
13 ౧౩ అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో, గోడ పైనా మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరసలో నిలబెట్టాను.
Enti mede awɛmfo a wokura akode kɔtenaa baabi a ɔfasu no yɛ tia, wɔ mmeaemmeae a ɛhɔ deda hɔ. Memaa mmusuakuw no gyinagyinaa sɛ awɛmfo a, wokurakura afoa, mpeaw ne agyan.
14 ౧౪ నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను.
Mehwɛɛ sɛnea nneɛma te no, mefrɛɛ ntuanofo no ne ɔmanfo no ka kyerɛɛ wɔn se, “Munnsuro atamfo no! Monkae Awurade a ɔyɛ ɔkɛse ne onuonyamfo no na monko mma mo nnamfonom, mo mmusua ne mo afi.”
15 ౧౫ వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందనీ, దేవుడు దాన్ని వమ్ము చేశాడనీ మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారు గోడ దగ్గరికి చేరుకొన్నాం.
Bere a yɛn atamfo tee sɛ yɛahu wɔn atirimpɔw ne sɛnea Onyankopɔn asɛe saa atirimpɔw no, yɛn nyinaa san kɔɔ ɔfasu no ho kɔtoaa yɛn adwuma so.
16 ౧౬ అప్పటినుండి పనివాళ్ళలో సగం మంది పనిచేస్తుండగా, మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు.
Na efi saa bere no, me mmarima no dodow mu fa pɛ na wɔyɛɛ adwuma, na nkae no wɛn hɔ a wokurakura mpeaw, nkatabo, agyan, hyehyɛɛ akotade wɛn hɔ. Mpanyimfo no gyinagyinaa Yudafo no a
17 ౧౭ గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పని చేస్తున్నారు.
na wɔreto ɔfasu no akyi. Apaafo no biara de ne nsa baako yɛɛ adwuma bere a nsa baako nso kura akode mu,
18 ౧౮ కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పని చేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు.
na adansifo no mu biara wɔ afoa a ɛbɔ nʼataaso. Torobɛntohyɛnni no gyinaa me nkyɛn, na biribi si a, wahyɛn nʼabɛn.
19 ౧౯ అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను. “మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం.
Afei, mekyerɛɛ mu kyerɛɛ atitiriw ne adwumayɛfo ne ɔmanfo no nyinaa se, “Adwuma no atrɛw, na yɛn ntam nso woware wɔ ɔfasu no so.
20 ౨౦ కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”
Na sɛ mote torobɛnto no nnyigyei a, monyɛ ntɛm nkɔ baabi a nnyigyei no wɔ. Na yɛn Nyankopɔn bɛko ama yɛn.”
21 ౨౧ ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకూ ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.
Yɛkɔɔ adwuma ntɛm tenaa so kyɛe fi bere a owia pue kosi bere a owia kɔtɔ. Na bere biara na nnipa no mu fa rewɛn.
22 ౨౨ ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను.
Saa bere no meka kyerɛɛ wɔn a wɔtete ɔfasu no akyi no nso se, “Obiara ne ne boafo ntu nkɔ Yerusalem anadwo na ama wɔatumi awɛn anadwo, na wɔayɛ adwuma awia.”
23 ౨౩ ఈ విధంగా నేను గానీ, నా బంధువులు గానీ, నా సేవకులు గానీ, నా వెంట ఉన్న కాపలావాళ్ళు గానీ బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆయుధం వదిలి పెట్టలేదు.
Saa bere no, yɛn mu biara, sɛ ɛyɛ me anaa me fifo anaa mʼasomfo anaa awɛmfo a na wɔne me wɔ hɔ no anworɔw ne ntade da. Sɛ yɛrekɔpɛ nsu mpo a na yekurakura yɛn akode.

< నెహెమ్యా 4 >