< నెహెమ్యా 4 >
1 ౧ మేము గోడలు నిలబెట్టడం మొదలు పెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు.
Rĩrĩa Sanibalati aaiguire atĩ nĩtwakaga rũthingo rĩngĩ, akĩrakara na agĩthirĩka mũno. Agĩthekerera Ayahudi,
2 ౨ షోమ్రోను సైన్యం వారితో, తన స్నేహితులతో ఇలా అన్నాడు. “అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్ళను పునాదులుగా వాడతారా?”
na arĩ mbere ya athiritũ ake na mbũtũ cia ita cia Samaria, akiuga atĩrĩ, “Ayahudi aya ahinyaru-rĩ, nĩ kĩĩ mareka? Nĩmegũcookereria rũthingo rwao? Nĩmekũruta magongona? Nĩmekũrĩkia wĩra ũyũ na mũthenya ũmwe? Maahota gũtũma mahiga macooke muoyo kuuma hĩba-inĩ ici cia mahuti maya mahĩĩte ũũ wothe?”
3 ౩ అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు.
Tobia ũrĩa Mũamoni, ũrĩa warĩ mwena wake, akiuga atĩrĩ, “Rũthingo rũu rwa mahiga maraaka-rĩ, o na mbwe ĩngĩrũhaica no ĩrũmomore!”
4 ౪ “మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదికే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి.
No rĩrĩ, Wee Ngai witũ tũthikĩrĩrie, tondũ tũrĩ andũ anyarare. Garũra irumi icio ciao imacookerere. Maneane ta matahĩtwo bũrũri-inĩ wa ũkombo.
5 ౫ వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”
Ndũkahithĩrĩre mahĩtia mao kana weherie mehia mao kuuma ũthiũ-inĩ waku, nĩgũkorwo nĩmarumĩte andũ arĩa maraaka.
6 ౬ అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాం. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయింది.
Nĩ ũndũ ũcio tũgĩaka rũthingo rũu rĩngĩ o nginya ruothe rũgĩkinya nuthu ya ũraihu waruo, nĩgũkorwo andũ acio maarutire wĩra na ngoro cia kwĩyendera.
7 ౭ యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు.
No hĩndĩ ĩrĩa Sanibalati, na Tobia, na Aarabu, na Aamoni, na andũ a Ashidodi maiguire atĩ thingo cia Jerusalemu nĩciathiiaga na mbere gũcookererio na atĩ mĩanya nĩyathingagwo-rĩ, makĩrakara mũno.
8 ౮ జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు.
Magĩthiĩ ndundu marĩ othe, magĩciira ũrĩa megũka mahũũrane na Jerusalemu, na mambĩrĩrie ngũĩ kuo.
9 ౯ మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్లు కాపలా ఉంచాము.
No nĩtwahooire Ngai witũ na tũkĩiga arangĩri a gũtũgitĩra mũthenya na ũtukũ nĩ ũndũ nĩtwehĩtĩirwo.
10 ౧౦ అప్పుడు యూదా వాళ్ళు “బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది, శిథిలాల కుప్పలు ఎక్కువై పోయాయి. గోడ కట్టడం కుదరదు” అన్నారు.
O ihinda rĩu, andũ a Juda makiuga atĩrĩ, “Aruti a wĩra nĩmaroorwo nĩ hinya, na nĩ kũrĩ na mahuti maingĩ mũno matangĩreka twake rũthingo rũu rĩngĩ.”
11 ౧౧ మా విరోధులు “వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి, పని జరగకుండా చేద్దాం” అనుకున్నారు.
O nacio thũ ciitũ ikiuga atĩrĩ, “Mũira wa mamenye ũhoro kana matuone, tũgũkorwo hamwe nao, tũmoorage na tũtũme wĩra ũcio ũtige kũrutwo.”
12 ౧౨ మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు, నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు.
Hĩndĩ ĩyo Ayahudi arĩa maatũũraga hakuhĩ na thũ icio magĩũka, magĩtwĩra maita ikũmi atĩrĩ, “O kũrĩa mũngĩũrĩra-rĩ, nĩmegũtũtharĩkĩra.”
13 ౧౩ అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో, గోడ పైనా మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరసలో నిలబెట్టాను.
Nĩ ũndũ ũcio ngĩiga andũ amwe na thuutha wa kũrĩa rũthingo rwarĩ thĩ mũno na gũtaarĩ na ũgitĩri; ngĩmaiga kũringana na nyũmba ciao marĩ na hiũ ciao cia njora, na matimũ, na mota.
14 ౧౪ నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను.
Ndaarĩkia kuona ũrĩa maũndũ maatariĩ, ngĩrũgama ngĩĩra andũ arĩa maarĩ igweta, na anene, na andũ arĩa angĩ atĩrĩ, “Mũtikametigĩre. Ririkanai Mwathani, o we ũrĩa mũnene na wa kũmakania, nĩguo mũrũĩrĩre ariũ a thoguo, na aanake anyu, na airĩtu anyu, na atumia anyu, o na mĩciĩ yanyu.”
15 ౧౫ వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందనీ, దేవుడు దాన్ని వమ్ము చేశాడనీ మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారు గోడ దగ్గరికి చేరుకొన్నాం.
Rĩrĩa thũ ciitũ ciamenyire atĩ nĩtwamenyete ũhoro wa ndundu yao, na atĩ Ngai nĩarigĩrĩirie ũndũ ũcio, ithuothe tũgĩcooka rũthingo-inĩ, o mũndũ agĩthiĩ wĩra-inĩ wake.
16 ౧౬ అప్పటినుండి పనివాళ్ళలో సగం మంది పనిచేస్తుండగా, మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు.
Kuuma mũthenya ũcio nuthu ya andũ akwa nĩo maarutaga wĩra nayo nuthu ĩyo ĩngĩ yao makĩheo matimũ, na ngo, na mota, o na nguo cia kĩgera. Anene nao makĩrũgama thuutha wa andũ othe a Juda
17 ౧౭ గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పని చేస్తున్నారు.
arĩa maakaga rũthingo. Nao arĩa maakuuaga indo cia mwako maarutaga wĩra na guoko kũmwe, nakuo kũrĩa kũngĩ kũnyiitĩte kĩndũ kĩa mbaara,
18 ౧౮ కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పని చేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు.
nake mwaki o wothe aikaraga eyohete rũhiũ rwake rwa njora njohero o akĩrutaga wĩra. No mũhuhi wa karumbeta aanjikaraga hakuhĩ.
19 ౧౯ అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను. “మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం.
Ningĩ ngĩĩra arĩa maarĩ igweta, na anene, na andũ arĩa angĩ atĩrĩ, “Wĩra nĩ mũingĩ mũno na ũgatambũrũka, na nĩtũraihanĩrĩirie mũno mũndũ na ũrĩa ũngĩ rũthingo-inĩ.
20 ౨౦ కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”
Rĩrĩa rĩothe mũngĩigua karumbeta kaahuhwo, mũũke harĩa tũrĩ. Ngai witũ nĩwe ũgũtũrũĩrĩra!”
21 ౨౧ ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకూ ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.
Nĩ ũndũ ũcio tũgĩthiĩ na mbere na kũruta wĩra, nuthu ya andũ ĩnyiitĩte matimũ kuuma rũciinĩ nginya njata cioneke hwaĩ-inĩ.
22 ౨౨ ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను.
Hĩndĩ o ĩyo ngĩĩra andũ atĩrĩ, “Reke o mũndũ na mũteithia wake maikarage Jerusalemu thĩinĩ ũtukũ, nĩgeetha matũtungatagĩre ta arangĩri ũtukũ, na mũthenya makaruta wĩra.”
23 ౨౩ ఈ విధంగా నేను గానీ, నా బంధువులు గానీ, నా సేవకులు గానీ, నా వెంట ఉన్న కాపలావాళ్ళు గానీ బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆయుధం వదిలి పెట్టలేదు.
Niĩ mwene, kana ariũ a baba, kana andũ akwa, kana arangĩri arĩa maarĩ hamwe na niĩ gũtirĩ warutaga nguo; o mũndũ aakoragwo na indo ciake cia mbaara o na agĩthiĩ gũtaha maaĩ.