< నెహెమ్యా 12 >
1 ౧ షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలుతో వచ్చిన యాజకులు, లేవీయులు వీరే. యేషూవ, శెరాయా, యిర్మీయా, ఎజ్రా,
스알디엘의 아들 스룹바벨과 및 예수아를 좇아 돌아온 제사장과 레위 사람은 이러하니라 제사장은 스라야와, 예레미야와, 에스라와
2 ౨ అమర్యా, మళ్లూకు, హట్టూషు,
아마랴와, 말룩과, 핫두스와
3 ౩ షెకన్యా, రెహూము, మెరేమోతు,
스가냐와, 르훔과, 므레못과
4 ౪ ఇద్దో, గిన్నెతోను, అబీయా,
잇도와, 긴느도이와, 아비야와
5 ౫ మీయామిను, మయద్యా, బిల్గా,
미야민과, 마아댜와, 빌가와
6 ౬ షెమయా, యోయారీబు, యెదాయా,
스마야와, 요야립과, 여다야와
7 ౭ సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా, అనేవాళ్ళు. వీళ్ళంతా యేషూవ రోజుల్లో యాజకుల్లో వారి బంధువుల్లో ప్రముఖులుగా ఉన్నారు.
살루와, 아목과, 힐기야와, 여다야니 이상은 예수아 때에 제사장과 그 형제의 어른이었느니라
8 ౮ లేవీయులలో ఇంకా, యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, కృతజ్ఞత పాటలు పాడే పరిచర్యలో ముఖ్యుడైన మత్తన్యా, అతని బంధువులు.
레위 사람은 예수아와, 빈누이와, 갓미엘과, 세레뱌와, 유다와, 맛다냐니 이 맛다냐는 그 형제와 함께 찬송하는 일을 맡았고
9 ౯ బక్బుక్యా, ఉన్నీ, వారి బంధువులు, వారికి ముందు వరుసలో నిలబడి పాటలు పాడేవాళ్ళు.
또 그 형제 박부갸와, 운노는 직무를 따라 저의 맞은편에 있으며
10 ౧౦ యేషూవ కొడుకు యోయాకీము, యోయాకీము కొడుకు ఎల్యాషీబు, ఎల్యాషీబు కొడుకు యోయాదాను.
예수아는 요야김을 낳았고, 요야김은 엘리아십을 낳았고 엘리아십은 요야다를 낳았고
11 ౧౧ యోయాదా కొడుకు యోనాతాను, యోనాతాను కొడుకు యద్దూవ.
요야다는 요나단을 낳았고, 요나단은 얏두아를 낳았느니라
12 ౧౨ యోయాకీము రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజకుల ఎవరంటే, శెరాయా కుటుంబానికి మెరాయా, యిర్మీయా కుటుంబానికి హనన్యా.
요야김 때에 제사장의 족장된 자는 스라야 족속에는 므라야요, 예레미야 족속에는 하나냐요
13 ౧౩ ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము, అమర్యా కుటుంబానికి యెహోహానా.
에스라 족속에는 므술람이요, 아마랴 족속에는 여호하난이요
14 ౧౪ మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెబన్యా కుటుంబానికి యోసేపు.
말루기 족속에는 요나단이요, 스바냐 족속에는 요셉이요
15 ౧౫ హారిము కుటుంబానికి అద్నా, మెరాయోతు కుటుంబానికి హెల్కయి.
하림 족속에는 아드나요, 므라욧 족속에는 헬개요
16 ౧౬ ఇద్దో కుటుంబానికి జెకర్యా, గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము.
잇도 족속에는 스가랴요, 긴느돈 족속에는 므술람이요
17 ౧౭ అబీయా కుటుంబానికి జిఖ్రీ, మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి.
아비야 족속에는 시그리요, 미냐민 곧 모아댜 족속에는 빌대요
18 ౧౮ బిల్గా కుటుంబానికి షమ్మూయ, షెమయా కుటుంబానికి యెహోనాతాను.
빌가 족속에는 삼무아요, 스마야 족속에는 여호나단이요
19 ౧౯ యోయారీబు కుటుంబానికి మత్తెనై, యెదాయా కుటుంబానికి ఉజ్జీ.
요야립 족속에는 맛드내요, 여다야 족속에는 웃시요
20 ౨౦ సల్లయి కుటుంబానికి కల్లయి, ఆమోకు కుటుంబానికి ఏబెరు.
살래 족속에는 갈래요, 아목 족속에는 에벨이요
21 ౨౧ హిల్కీయా కుటుంబానికి హషబ్యా, యెదాయా కుటుంబానికి నెతనేలు.
힐기야 족속에는 하사뱌요, 여다야 족속에는 느다넬이었느니라
22 ౨౨ లేవీయులకు సంబంధించి ఎల్యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. పారసీక రాజు దర్యావేషు పాలన కాలంలో కూడా వీరే కుటుంబ యాజకులుగా ఉన్నారు.
엘리아십과, 요야다와, 요하난과, 얏두아 때에 레위 사람의 족장이 모두 책에 기록되었고 바사 왕 다리오때에 제사장도 책에 기록되었고
23 ౨౩ ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకూ అనుదిన కార్యక్రమ వివరాలు రాసే గ్రంథంలో వారు లేవీయుల కుటుంబ యాజకులుగా నమోదయ్యారు.
레위 자손의 족장들은 엘리아십의 아들 요하난 때까지 역대지략에 기록되었으며
24 ౨౪ దేవుని సేవకుడైన దావీదు ఆజ్ఞ ప్రకారం స్తుతి గీతాలు పాడే వంతు లేవీయుల కుటుంబ యాజకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవలకు, వారికి ఎదురుగా నిలబడి పాడే వంతు వారి బంధువులకు నియమించారు.
레위 사람의 어른은 하사뱌와, 세레뱌와, 갓미엘의 아들 예수아라 저희가 그 형제의 맞은편에 있어 하나님의 사람 다윗의 명한대로 반차를 따라 주를 찬양하며 감사하고
25 ౨౫ మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవాళ్ళు ఆలయ ద్వారాల సమీపంలో పదార్థాలు నిల్వ చేసే గదులకు కాపలాదారులుగా ఉన్నారు.
맛다냐와, 박부갸와, 오바댜와, 므술람과, 달몬과, 악굽은 다 문지기로서 반차대로 문 안의 곳간을 파수하였나니
26 ౨౬ యోజాదాకు మనవడు, యేషూవ కొడుకు యోయాకీము రోజుల్లోనూ, అధికారియైన నెహెమ్యా రోజుల్లోనూ, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా రోజుల్లోనూ వీరు ఆ పని చేస్తూ వచ్చారు.
이상 모든 사람은 요사닥의 손자 예수아의 아들 요야김과 방백 느헤미야와 제사장 겸 서기관 에스라 때에 있었느니라
27 ౨౭ యెరూషలేం సరిహద్దు గోడల ప్రతిష్ట సమయంలో వీళ్ళు ఆ కార్యక్రమం స్తుతి గీతాలతో, పాటలతో, తంతి వాయిద్యాలతో మేళతాళాలతో ఆర్భాటంగా జరిగించడానికి అన్ని పరిసర గ్రామాల నుండి లేవీయులను యెరూషలేంకు రప్పించే పని చేపట్టారు.
예루살렘 성곽이 낙성되니 각처에서 레위 사람들을 찾아 예루살렘으로 데려다가 감사하며 노래하며 제금 치며 비파와 수금을 타며 즐거이 봉헌식을 행하려 하매
28 ౨౮ అప్పుడు గాయకుల వంశాల సంతానం యెరూషలేం చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల్లో నుండి సమకూడి వచ్చారు.
이에 노래하는 자들이 예루살렘 사방 들과 느도바 사람의 동네에서 모여오고
29 ౨౯ యెరూషలేం చుట్టూ గాయకులు తమ గ్రామాలు కట్టుకుని ఉండడం వల్ల గిల్గాలు కుటుంబం నుండి, గెబ, అజ్మావెతు ప్రాంతాల నుండి ప్రజలు తరలి వచ్చారు.
또 벧길갈과 게바와 아스마웹 들에서 모여 왔으니 이 노래하는 자들은 자기를 위하여 예루살렘 사방에 동네를 세웠음이라
30 ౩౦ యాజకులు, లేవీయులు మొదటగా తమను తాము పవిత్రం చేసుకున్నారు. తరువాత ప్రజలను, ద్వారాలను, గోడలను శుద్ధి చేశారు.
제사장들과 레위 사람들이 몸을 정결케 하고 또 백성과 성문과 성을 정결케 하니라
31 ౩౧ తరువాత నేను యూదుల ప్రముఖులను గోడ మీదికి ఎక్కించాను. స్తుతి గీతాలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా విభజించాను. ఒక గుంపు చెత్త ద్వారం కుడివైపు గోడ మీద నిలబడ్డారు.
이에 내가 유다의 방백들로 성 위에 오르게 하고 또 감사 찬송하는 자의 큰 무리를 두 떼로 나누어 성 위로 항렬을 지어가게 하는데 한 떼는 우편으로 분문을 향하여 가게 하니
32 ౩౨ వారితోపాటు హోషయా, యూదుల ప్రముఖుల్లో సగం మంది వెళ్ళారు.
따르는 자는 호세야와 유다 방백의 절반이요
33 ౩౩ ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము,
또 아사랴와, 에스라와, 므술람과
34 ౩౪ యూదా, బెన్యామీను, షెమయాయు, యిర్మీయా అనేవాళ్ళు కూడా గోడ ఎక్కారు.
유다와, 베냐민과, 스마야와, 예레미야며
35 ౩౫ షెమయా మనవడు, యోనాతాను కొడుకు జెకర్యాతో కలసి కొందరు యాజకుల కొడుకులు బాకాలు ఊదుతూ వెళ్ళారు. ఆసాపు కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు మీకాయా, మీకాయా కొడుకు మత్తన్యా. మత్తన్యా కొడుకు షెమయా.
또 제사장의 자손 몇이 나팔을 잡았으니 요나단의 아들 스마야의 손자 맛다냐의 증손, 미가야의 현손 삭굴의 오대손, 아삽의 육대손 스가랴와
36 ౩౬ షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవాళ్ళు అతని బంధువులు. వీళ్ళు దైవ సేవకుడు దావీదు నియమించిన వాయిద్యాలు మోగిస్తూ వెళ్ళారు. ఆచార్యుడైన ఎజ్రా వారికి ముందుగా నడిచాడు.
그 형제 스마야와, 아사렐과, 밀랄래와, 길랄래와, 마애와, 느다넬과, 유다와, 하나니라 다 하나님의 사람 다윗의 악기를 잡았고 학사 에스라가 앞서서
37 ౩౭ వాళ్ళు తమకు ఎదురుగా ఉన్న ఊట ద్వారం దగ్గర దావీదు పట్టణం మెట్లపై నుండి ఆ పట్టణం దాటి గోడ వెంట తూర్పు దిశగా నీటి ద్వారం దాకా వెళ్ళారు.
샘문으로 말미암아 전진하여 성으로 올라 가는 곳에 이르러 다윗성의 층계로 올라가서 다윗의 궁 윗 길에서 동향하여 수문에 이르렀고
38 ౩౮ కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ళ రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్ళారు. వారితో కలసి నేను కూడా వెళ్లాను.
감사 찬송하는 다른 떼는 저희를 마주 진행하는데 내가 백성의 절반으로 더불어 그 뒤를 따라 성 위로 행하여 풀무 망대 윗 길로 성 넓은 곳에 이르고
39 ౩౯ ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు.
에브라임 문 위로 말미암아 옛문과, 어문과, 하나넬 망대와, 함메아 망대를 지나 양문에 이르러 감옥 문에 그치매
40 ౪౦ ఆ విధంగా దేవుని ఆలయంలో కృతజ్ఞతా గీతాలు పాడేవాళ్ళ రెండు గుంపులు, నేనూ నాతోపాటు ఉన్న అధికారుల్లో సగం మంది నిలబడి ఉన్నాం.
이에 감사 찬송하는 두 떼와 나와 민장의 절반은 하나님의 전에 섰고
41 ౪౧ యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు.
제사장 엘리아김과, 마아세야와, 미냐민과, 미가야와, 엘료에내와, 스가랴와, 하나냐는 다 나팔을 잡았고
42 ౪౨ ఇజ్రహయా అనే వాడి ఆధ్వరంలో గాయకులు మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు పెద్ద స్వరంతో పాటలు పాడారు.
또 마아세야와, 스마야와, 엘르아살과, 웃시와, 여호하난과, 말기야와, 엘람과, 에셀이 함께 있으며 노래하는 자는 크게 찬송하였는데 그 감독은 예스라히야라
43 ౪౩ వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి.
이 날에 무리가 크게 제사를 드리고 심히 즐거워하였으니 이는 하나님이 크게 즐거워하게 하셨음이라 부녀와 어린 아이도 즐거워 하였으므로 예루살렘의 즐거워하는 소리가 멀리 들렸느니라
44 ౪౪ ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు.
그 날에 사람을 세워 곳간을 맡기고 제사장들과 레위 사람들에게 돌릴 것 곧 율법에 정한대로 거제물과 처음 익은 것과 십일조를 모든 성읍 밭에서 거두어 이 곳간을 쌓게 하였노니 이는 유다 사람이 섬기는 제사장들과 레위 사람들을 인하여 즐거워함을 인함이라
45 ౪౫ దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్టు గాయకులు, ద్వారపాలకులతోపాటు తమ దేవునికి సేవ పనులను చేస్తూ, శుద్ధి ఆచారాలు పాటిస్తూ వచ్చారు.
저희는 하나님을 섬기는 일과 결례의 일을 힘썼으며 노래하는 자들과 문지기들도 그러하여 모두 다윗과 그 아들 솔로몬의 명을 좇아 행하였으니
46 ౪౬ పూర్వం దావీదు జీవించిన కాలంలో ఆసాపు పర్యవేక్షణలో గాయకుల నియామకం, స్తుతి గీతాల ఎంపిక, పాటలు పాడడం మొదలైన విషయాలు జరిగేవి.
옛적 다윗과 아삽의 때에는 노래하는 자의 두목이 있어서 하나님께 찬송하는 노래와 감사하는 노래를 하였음이며
47 ౪౭ జెరుబ్బాబెలు కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులంతా తమ తమ వంతుల ప్రకారం గాయకులకు, ద్వారపాలకులకు ప్రతిరోజూ ఆహార పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీయుల కోసం ఒక భాగం కేటాయించారు. లేవీయులు అహరోను వంశంవారి కోసం ఒక భాగం కేటాయించారు.
스룹바벨과 느헤미야 때에는 온 이스라엘이 노래하는 자들과 문지기들에게 날마다 쓸 것을 주되 그 구별한 것을 레위 사람들에게 주고 레위 사람들은 그것을 또 구별하여 아론 자손에게 주었느니라